గురువు

గురువు

బడి అంటే బ్రతుకు పాఠాలు నేర్పే బొమ్మ.
బడి అంటే భయం తొలగించి బుజ్జగించి లాలించి
అక్కున చేర్చుకుని అక్షరాలు నేర్పేది గురువు

అక్షరమనే ఆయుధాన్ని ఇచ్చి
బ్రతుకు పోరాటపు యోధుడుగా తీర్చిదిద్దేవాడు గురువు.

అజ్ఞానం తొలగించేది గురువు
విజ్ఞానాన్ని పెంచేది గురువు.

గుడిలో ఉండేది కనిపించని దైవం
బడిలో ఉండే ది నడిచే దైవం.
అమ్మ ఒడి దాటి గుడిలో అడుగుపెట్టిన బొమ్మని
 అమ్మ లా ఆదరించేది గురువు.

కార్గిల్ యుద్ధ వీరుడు అయిన
కరోనాకు వైద్యం చేసే డాక్టర్ అయినా
కష్టపడే కార్మికుడైన
 పొలం దున్నే రైతైన
ఆకాశాన్నంటే భవనాలు నిర్మించే ఇంజనీర్ అయిన
ఒక గురువుకి శిష్యుడే
ఆ శిష్యుడు గుండెల్లో గురువు ఒక దైవమే
గురువు పాత్రకే ఉంది ఆ గౌరవం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట