దానం

 కళ్ళు మూస్తే మరణం.

మట్టిలో మట్టి అవుతున్న శరీరం

మానవ జీవితం లిప్తకాలం .


అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది .

అవయవ దానo అన్నదానo కన్న మిన్న.


నీ మరణం మరో ప్రాణానికి పునర్జన్మo.

   అదే అవయవ దాన పరమార్థం.

 టెక్నాలజీ మనకు ఇచ్చిన గొప్ప వరం.

 వైద్యో నారాయణ హరి అంటారు

అపర నారాయణుడే అవయవదాత.


నిన్ను పుట్టించిన బ్రహ్మ కనబడడు.

గుళ్లో కాగడా పెట్టి వెతికినా దొరకడు.

నువ్వుఅవయవ దానం చేసిన అపర బ్రహ్మవి 

    కర్ణుడే వేస్తాడు పెద్ద పీట చరిత్రలో.


       ఎందుకు ఈ శరీరం మీద మమకారం.

         కన్ను మూస్తే మరుక్షణం మరుభూమి పయనం.


          బ్రతికినంత కాలo స్వార్ధపు కోరల్లో.

         చచ్చిన తర్వాత కూడా పునర్జన్మ కోసం ఎందుకు

        తాపత్రయం 

        మనిషి జన్మకి ఉండాలి సార్ధకత.

        ప్రాణం పోయడమే పారమార్ధికత.


     మనిషి తయారు చేసిన మైనపు వత్తి నీకు ఆదర్శం.

    లోకానికి వెలుగు చూపడమే తనకు తెలిసిన సత్యం.

    మనిషిగా పుట్టిన నీకు ఎందుకు లేదు జ్ఞానం.


     పుణ్యలోకం కోసం చేస్తారు దశదానం.

    నేత్ర దానంతో వెలుగు లేని కళ్ళకి జీవం.

       ఇదేగా అవయవదానం అంతరార్థం.

            ఇంతకన్నా ఏది పరమార్థం.


    ప్రతి ఒక్కరి గుండె చేస్తుంది లబ్ డబ్ శబ్దం.

    అవయదానం తో నీ గుండె చేస్తుంది పరకాయ ప్రవేశం.

    ఉదయం సాయంత్రం చేస్తుంది నీ నామ జపం.


          శరీరం మలినాలన్ని బయటకు తోస్తుంది.

          అందుకే మూత్రపిండాలు నియామకం.

          ఒక్కడానితో చెయ్యచ్చు జీవనయానం.

           వైద్యశాస్త్రం ఒప్పుకున్న సత్యం.


      గుడిలో అన్నదాన విరాళం తో పాటు

      అవయవ దాన అంగీకారపత్రం పై సంతకం పెట్టు.

     అంత కన్న మానసిక సంతృప్తి లేదంటే ఒట్టు.


     సదాచార శాస్త్రం చెప్పని దానమని భయపడకు.

          ప్రాణదానం పరమాత్ముడు మెచ్చే గుణం.

     కన్ను మూస్తే ఏ లోకం పోతావో ఎవరికి తెలుసు. అవయవ దానం చేస్తే నీ శరీర భాగంతో భూలోకంలోనే

వుండొచ్చు.

ఇంతకన్నా ఏమి చెప్పవచ్చు అవయవదాన మహత్యం.

           నువ్వే తెలుసుకోవాలి సత్యం.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బా

రావు.

          కాకి నాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట