పోస్ట్‌లు

సీతమ్మ

ఉదయం పదకొండు గంటలు అయింది. ఆ నగరంలో ప్రముఖ కూడలి ఉన్న గుడి ముందు ఇద్దరు బిచ్చగాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇంతలో గుడి తలుపులు మూసేసి పూజారి గారు బయటకు వచ్చి ఏరా ఇంకా వెళ్ళలేదా ?అని అడిగారు. ఎందుకంటే ఉదయం సాయంకాలం గుడిమెట్ల మీద ఆ ఇద్దరు బిచ్చగాళ్ళు సుమారు ఇరవై సంవత్సరాల నుండి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఉదయం సాయంకాలం గుడి దగ్గర బిక్షాటన చేసుకుంటూ గుడి కట్టేసిన తర్వాత ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర, రాత్రి పూట పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ మెట్ల మీద పడుకుంటారు.ఆ నగరంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ వాళ్లు వేరే గుడి దగ్గరికి వెళ్లలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ప్రమాదవశాత్తు కాళ్లు ఒక యాక్సిడెంట్ లో పోయాయి. ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన మీద మూడు చక్రాలు బండి వాళ్లకి ఆధారం. పూజారి గారు అడిగిన ప్రశ్నకి "లేదండి అంటూ సమాధానమిచ్చి ఏదో నసుగుతూ కనబడ్డారు బిచ్చగాళ్ళు.  రోజు పద కొండు గంటలకే అక్కడికి నుంచి వెళ్ళిపోయే ఆ బిచ్చగాళ్ళు ఇవాళ ఇంకా ఎందుకు అక్కడ ఉన్నారని అప్పుడు తట్టింది పూజారి గారికి. విషయం అర్థమైంది రా !మీరు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారో! ఆ అమ్మగారి గురించే కదా అవునన్నట్లుగా తల ఊపేరు....

అద్దె తల్లి

నెలలు నిండుతున్న కొద్ది లచ్చమ్మకిమనసు ఆందోళనగా ఉంది. ఇది తొలి కానుపు కాకపోయినా ఈసారి బాధగా భయంగా ఉంది లచ్చమ్మ కి. క్రితం సారి కన్నా ఈ సారి ఆరోగ్యం చాలా బాగుంది. నీరసం అనేది లేదు. మంచి ఆహారం మంచి మందులు పళ్ళు పాలు అన్ని వేళకు తింటున్న మనసు ఇదివరకు అంత ఉత్సాహంగా లేదు.  ఈ కడుపులో ఉన్న బిడ్డ భూమ్మీదకి వచ్చిన వెంటనే ఎవరికో ఇచ్చేయాలి అనే బాధ లచ్చమ్మ గుండెను మండిస్తోంది. సహజంగా కాకపోతేనే కృత్రిమంగా అయినా గర్భంలో తిరుగుతున్న బిడ్డ వాడు చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. రాత్రి పడుకుంటే కాళ్లతో తన్నుతాడు. ఏదో కడుపులోంచి మాటలు వినపడుతున్నట్టుగా ఉంటాయి. అది తన భ్రమ లేక నిజంగానే మాట్లాడుతున్నాడా!. ఎప్పుడు బయటకు వస్తాడా! వాడిని గుండెల మీద వేసుకుని ముద్దాడాలని కడుపునిండా పాలు తాగించాలని భుజం మీద వేసుకుని జో కట్టాలని కలలు కంటోంది లచ్చమ్మ. ఇవన్నీ క్రితం సారి కానుపు వచ్చిన తర్వాత అనుభవించిన అనుభూతులు. తల్లిగా మధుర అనుభూతులు. మరి ఈసారి ఆ అనుభూతులను అనుభవించడానికి అవకాశం ఉంటుందా లేదో!. ఎన్ని రోజులు పిల్లవాడిని మన దగ్గర ఉంచుతారో!. కొద్దిరోజులు కూడా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించకుండా తన దగ్గర్నుంచి లాక...

నారాయుడు

అది ఒక పెద్ద మండువా ఇల్లు. ఆ కాలంలో ఎక్కువగా మండువా ఇళ్లు కట్టేవారు. సింహద్వారం దాటి లోపలకు అడుగుపెట్టగానే ఆ పక్క ఈ పక్క గదులు మధ్యలో వెలుతురు గాలి ధారాళంగా ప్రవేశించడానికి నలుచదరంగా పైన పైకప్పు లేకుండా ఉండి కింద కూడా అదే మాదిరి గుంట, కురిసిన వర్షం బయటకు వెళ్ళిపోవడానికి డ్రైనేజీ సిస్టం చూడడానికి ఎంతో అందంగా ఉండి పైకప్పు అంతా మట్టి పెంకులతో కట్టిన అందమైన లోగిలి. ఎప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో తెలియదు మన హీరో.. ఇప్పుడు చెప్పడానికి పెద్దలు కూడా ఎవరూ లేరు. నల్లటి శరీరం తల పైన తలపాగా పైకి బిగ కట్టిన పంచి ఒంటిమీద తువ్వాలు గుడ్డ కూడా లేని శరీరం పైకి సినిమా యాక్టర్ మాడాలా కనిపించిన మనసు శరీరము ఆ ఇంటి కోసమే త్యాగం చేసిన మా నారాయుడు మా మధు నా పంతుల వారి ఇంట్లో పుట్టిన వారి అందరికీ పల్లిపాలెం గ్రామ కాపురస్తులందరికీ సుపరిచితమే.  ఎందుకు నారాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పడం. కొద్దో గొప్పో పొలం ఉండి పెరటి నిండా పశు సంపద ఉండి గుట్టుగా గౌరవంగా కాలక్షేపం చేసే మా మధునా పంతుల వారు ప్రతి ఏటా ఒక పాలికాపుని సంవత్సరం కాలానికి కుదుర్చుకునేవారు. అలా వాడి పనితనం మనకు నచ్చితే మనం ఇచ్చే జీతం వా...