తాత ఆశీస్సులు

తాత ఆశీస్సులు

నవ మాసములు చిమ్మ చీకటిలో ఉండి

అమ్మకు పెట్టిన అమృతములన్నీ చిన్ని కృష్ణుడివై దొంగలించి

కెవ్వున కేక వేసి అమ్మ ఇచ్చిన మధురామృతములన్నీ త్రాగి

గోరుముద్దలు తినే వయసు వచ్చి గోపాల బాలుడవైన వేళ

ఈ సంబరముతో అంబరమున ధ్రువతారవై వెలుగు.

కరముతో చేపట్టినది భవిష్యత్ నిర్దేశికమని 
 జనుల నమ్మకం వమ్ము చేయక సుమీ.

కలము చేతబట్టి అమ్మ కలల రాజువై వెలుగొందు

రమణీయ కావ్యమును తాకి రవి కుల సోముడవై రాజిల్లు

ఆయుధము చేపట్టి సామ్రాజ్యాధినేత వై జగతినేలు

సుమములన్ని చేతబట్టి సుమధుర భాషనుడవై జగతినేలు

సువర్ణము చేతబట్టి సుర రాజు వై పుడమి నేలు.
ఈ సంబరముతో అంబరమున ధ్రువతారవై వెలుగు

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట