పోస్ట్‌లు

యువత లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

యువత ఏమిటి నీ బాధ్యత

అంశం : యువత ఏమిటి మీ బాధ్యత రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు, కాకినాడ ఉప్పొంగే వయసు — పొంగే పాలలాంటి మనసు, కావలసినంత గుండెబలం — దేవుడిచ్చిన కండబలం, ప్రతి యువతకి దేవుడిచ్చిన వరం! కళ్లుతెరిచి చూస్తే — మనసుపెట్టి ఆలోచిస్తే, బాధ్యతల అడ్రస్సు దొరుకుతుంది. సంఘంలోకి తొంగిచూస్తే — సమస్యల సుడిగుండం కనబడుతుంది. ఇంట గెలిచి — కన్నవారి కన్నీళ్లు తుడిచినపుడు, తొలి బాధ్యత నెరవేరినట్టే. మత్తుకి చిత్తుకాక — మమతారాగాలు పంచినపుడు, బాధ్యత గల యువతకి — జనాలు ఇస్తారు కితాబు. అన్నమో రామచంద్రాయని అలమటించే అభాగ్యులకు పట్టెడు అన్నం పెట్టినపుడు — డొక్కా సీతమ్మగారి వారసులవుతారు యువత. అన్యాయాన్ని ఎదిరించి — అక్రమాలను నిలదీసి, ప్రశ్నించే ధైర్యం అలవర్చుకుంటే — ప్రతి యువతి, యువకుడు బాధ్యత గల పౌరులే. ఆశయసాధన కోసం పాటుపడి, "ఆరోగ్యమే మహాభాగ్యం" అని నమ్మి — ముందుకు సాగిపోవడమే యువత బాధ్యత! జ్ఞానం పట్ల ఆసక్తి — సేవ పట్ల నిబద్ధత, ఇవే నిజమైన యువతకు గుణములు కావాలి. నువ్వు చదివింది నిన్ను మార్చకపోతే, అదే చదువు సమాజాన్ని మార్చగలదా? ఉద్యోగం పొందిన వెంటనే — బాధ్యతలు పూర్తయినట్టా? కాదయ్యా! అది ఒక్క నిధానం మాత్రమే,...