పోస్ట్‌లు

కాలం నీది కాదు

కాలం నీది కాదు  నాది కాదు. కాలం ఎవ్వరిది కాదు కాలం అందరినీ మురిపిస్తుంది కాలం అందరినీ మరిపిస్తుంది భయంతో వణికిస్తుంది బాధ్యతగా ముందుకు నడిపిస్తుంది. ఎవ్వరి గురించి ఆగదు. ముందుకు పరిగెడుతూనే ఉంటుంది రోజులు నెలలు సంవత్సరాలు ఇవే కదా కాలానికి కొలమానం ఎవరి కాలం ఎలా ఉందో ఎవరికి తెలుసు ఏ క్షణం ఎవరిదో ఎవరికి ఎరుక. రేపు అనేది నాది కాదు అన్నది ఎవరికి తెలుసు భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంటాం బాధ్యతగా పనులు మొదలుపెడతాం కాలం సహకరించకపోతే ఏం చేస్తాం. అదే ఆఖరి రోజని ఎవరికి తెలుసు. ఊపిరి ఉన్న రోజే మన రోజని పెద్దలకు తెలుసు ఎంతో కాలం ఉందని అనుకుంటాం సమయం ఆసన్నమైతే ఊపిరి తీస్తుంది. సమయం వస్తే ఊపిరి పోస్తుంది. తీర్చవలసిన బాధ్యతలు తీర్చుకోవాల్సిన రుణాలు వేటిని లెక్కచేయదు. నిర్దయగా తన పని తాను చేసుకుంటూనే పోతుంది. కాలం కర్కశ మైనది. దయా దాక్షిణ్యాలు ఉండవు. పాల బుగ్గల పసివాళ్లకు అమ్మను దూరం చేస్తుంది. దాంపత్య బంధాన్ని మధ్యలోనే తుంపేస్తుంది. కాటికి కాళ్ళు చాపుకుని ఉన్న వాళ్ళని కర్త గా ముందు నడిపిస్తుంది. ఆత్మీయులను అయోమయంలోకి నెట్టివేస్తుంది కన్నవాళ్ళ కడుపు తీపి పట్టించుకోదు. బతుకంటే భయం పుట్టేలా చేస్తుంద...

గురువు

గురువు బడి అంటే బ్రతుకు పాఠాలు నేర్పే బొమ్మ. బడి అంటే భయం తొలగించి బుజ్జగించి లాలించి అక్కున చేర్చుకుని అక్షరాలు నేర్పేది గురువు అక్షరమనే ఆయుధాన్ని ఇచ్చి బ్రతుకు పోరాటపు యోధుడుగా తీర్చిదిద్దేవాడు గురువు. అజ్ఞానం తొలగించేది గురువు విజ్ఞానాన్ని పెంచేది గురువు. గుడిలో ఉండేది కనిపించని దైవం బడిలో ఉండే ది నడిచే దైవం. అమ్మ ఒడి దాటి గుడిలో అడుగుపెట్టిన బొమ్మని  అమ్మ లా ఆదరించేది గురువు. కార్గిల్ యుద్ధ వీరుడు అయిన కరోనాకు వైద్యం చేసే డాక్టర్ అయినా కష్టపడే కార్మికుడైన  పొలం దున్నే రైతైన ఆకాశాన్నంటే భవనాలు నిర్మించే ఇంజనీర్ అయిన ఒక గురువుకి శిష్యుడే ఆ శిష్యుడు గుండెల్లో గురువు ఒక దైవమే గురువు పాత్రకే ఉంది ఆ గౌరవం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279

మనసే మందారమైన వేళ

శీర్షిక: మనసే మందారమైన వేళ మనిషిని నడిపించే యంత్రం మనసు మనసే కదా మనిషికి మంచి మిత్రుడు మనసును మించిన శత్రువు కానరాడు. రహదారిలో నడిపించేది మనసు గోదావరిలో ముంచేసేది మనసే. మనసు కోరితే తూచా తప్పకుండా  అమలు చేసేది తనువు. మనిషి చేసే కర్మలకి మనసే కదా మూలం. స్పందించే హృదయం ఉంటే మనసున్న వాడని నామకరణం దయగల ప్రభువులని బిరుదులతో సత్కారం. కోరికలతో దహించుకపోయేది మనసు  కొండమీద కోతి కోసం  పడరాని పాట్లు పడుతుంది తనువు. అందని ద్రాక్ష కోసం అసువులు అర్పిస్తుంది మనసులోనే ఉంది మహత్యం. ఆందోళనకు లొంగని మనసుంటేనే ఆరోగ్యం. మనసే మందారమైన వేళ. తనువు ఆనంద నృత్యం చేస్తుంది. సత్కర్మల వైపు పరుగులు తీస్తుంది. గువ్వలా ఎగిరిపోవాలనిపిస్తుంది మనసే కదా మనిషిని నడిపించే యంత్రం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279