పోస్ట్‌లు

పార్వతమ్మ కోరిక

పార్వతమ్మ కోరిక " అమ్మ అమ్మమ్మ అన్నం తిందా! రాత్రి ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన రఘు తల్లి అన్నపూర్ణని అడిగాడు. మజ్జిగ అన్నం తిని మందులు వేసుకుని పడుకుంది. నీ గురించి పది సార్లు అడిగింది రా. వాడు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు ఏమిటని. ఏరా ! రఘు అమ్మమ్మ ఎప్పటికైనా మంచం మీద నుంచి లేస్తుంది అంటావా! అని అడిగింది కొడుకుని. అమ్మమ్మకి ఏమి అనారోగ్యాలు లేవు. కేవలం వయస్సు తెచ్చిన నీరసం తోటి అలా పడుకొని ఉంటోంది. అయినా డబ్బై ఐదు ఏళ్ళు వయస్సు. తాతయ్య పోవడంతో మరి బెంగపెట్టుకుంది.  మనం ఆ పోయిన వ్యక్తిని తీసుకురాలేం కానీ అమ్మమ్మని సాధ్యమైనంత వరకు ఆనందంగానే ఉంచాలమ్మ. అమ్మమ్మకి ఇంక ఎవరున్నారు. ఉన్నవాళ్లందరూ ఆడపిల్లలు ఎవరికి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మకు నేనంటే చాలా ఇష్టం. ఒకటేమో పెద్ద మనవడు గాను రెండోది ఆవిడకి మగపిల్లలు లేకపోవడం తాతయ్య పోయిన తర్వాత మన దగ్గరి ఉండడంతో అమ్మమ్మ తోటి మనకు చాలా అనుబంధం పెరిగింది.ఆ రోజుల్లో చిన్న వయసులో పెళ్లిళ్లు చిన్న వయసులోనే కాన్పులు మూలంగా మనవళ్లు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు అని అన్నాడు రఘు. " ఏమోరా ఆవిడ బ్రతికి ఉన్నన్నాళ్ళు ఏ మాట అన...

ఊరి ముచ్చట్లు

ఊరి ముచ్చట్లు  సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత పిల్లలందరూ రాబోయే వేసవికాలం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కైతే పది రోజులు సెలవులు కానీ వేసవికాలం వచ్చిందంటే ఇంకేముంది రెండు మూడు నెలల పాటు పిల్లలకి ఆటవిడుపే. పెద్ద పరీక్షలు అయిపోతే అమ్మమ్మ గారి ఊరికి పరుగులు తీస్తుంటారు.  అసలు రుతువు మారుతోందని మనకి ఎలా తెలుస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులే మనకి రుతువు మారిపోతోందని తెలుస్తుంది.  మహాకవి పోతన గారు భాగవత గ్రంథంలో గ్రీష్మ రుతువు గురించి చెబుతూ పగటి సమయాలు అంతకంతకు పెరుగుతున్నాయని సూర్యుడు ఉత్తర దిక్కు వైపుకు సంచరిస్తున్నాడని ఎండ తీక్షణ రోజురోజుకీ పెరుగుతుందని భూమి నుండి లేచిన దుమ్ము రేణువులు ఆకాశమంతటా వ్యాపించి ఉన్నాయని సెలయేళ్లు కొలనులు ఎండిపోయాయి బాటసారులు చలివేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారని పాములు ఎండలు భరించలేక పొదల్లో చేరిపోతున్నాయని చెట్లు పూలు వాడిపోయాయని అగ్నిదేవుడు అడవులతో ఆడుకుంటున్నాడని అద్భుతమైన వర్ణన చేశారు. అలాంటి వాతావరణంలోని మార్పులతో ఆ ఊరికి అంటే మా స్వగ్రామం కాకినాడ తాలూకా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామoలో కూడా వేసవికాలం అడుగుపెట్టేసింది....

ఇది సత్యం

ఇది సత్యం. " ఈసారి పండక్కి పిల్లలు ఎవరికీ ఫోన్ చేయకండి. నేను చాకిరి చేయలేకపోతున్నాను. మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. ఖర్చులు తట్టుకోవడం కష్టం కదా! అయినా పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యి పది ఏళ్లు పైన అయింది. ఏమీ అనుకోరు లెండి అంది జానకమ్మ తన భర్త సుందర రామయ్య తో. సుందర రామయ్య ఎటు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం చేస్తాడు ఇంటి యజమాని కదా! ఏ నిర్ణయం తీసుకున్న మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా! సుందర రామయ్యకి కూడా అదే అనిపించింది. రమారమీఅరవై ఐదు ఏళ్లు వయస్సు దాటింది జానకమ్మకి. ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు.  సుందరామయ్యకి నలుగురు ఆడపిల్లలే. అందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ లోటు లేదు. సుందరామయ్య మటుకు ఉన్న ఊరిలో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు. అయినా ఏ పండుగకి పిల్లల్ని పిలవకుండా ఉండరు.  ఈసారి జానకమ్మ ఎందుకు అలా చెప్పింది? అలా ఎప్పుడూ చెప్పలేదు. సుమారు యాభై సంవత్సరాల నుంచి చాకిరీ చేసి చేసి అలిసిపోయింది జానకమ్మ. ఏమిటో రేపు ఒకసారి జానకమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్...