కృష్ణ
కృష్ణ ఉదయం పది గంటలు అయింది. చుట్టూ పోలీసులు మధ్య చేతులకు బేడీలు వేసుకొని ఉన్న సుమారు ముప్పై సంవత్సరములు యువతి నడుచుకుంటూ కోర్టు లోపలికి అడుగుపెట్టింది కోర్ట్ ఆవరణలో ఉన్న అందరూ ఆమెకేసి వింతగా చూస్తున్నారు. ఈమె కూడా నేరం చేసిందా అన్నట్లు! ఆవిడకు మినహాయింపు ఏమిటి ?అని చూస్తే పాపం ఆవిడ నిండు గర్భిణీ. న్యాయదేవతకు అవి ఏమీ సంబంధం లేదు. సాక్ష్యం బలంగా ఉంటే ఎవరైనా నేరస్తులు. అది దొంగ సాక్ష్యం కావచ్చు ,దొరల సాక్ష్యం కావచ్చు. సాక్ష్యాన్ని నమ్మి ఇంకేముంది యావత్ జీవిత కారాగర శిక్ష విధించింది. సాధారణంగా ప్రతి స్త్రీ పురిటి కోసం పుట్టింటికి వెళ్తారు. కానీ విధి వ్రాత అలా ఉంది. జైలు గోడలే పుట్టిల్లు అయింది. మానవతా దృక్పథంతో కోర్టు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిస్తే మరో ప్రాణికి జన్మనిచ్చింది సరిత. ఆ బిడ్డను చూసి కుమిలి కుమిలి ఏడ్చింది సదరు ఖైదీ సరిత. రేపటి సమాజంలో దీని బ్రతుకేమిటి? సరిత భర్త ఎప్పుడో పారిపోయాడు. ఇంక నా అన్న వాళ్ళు ఎవరూ లేరు సరితకి. ఆ నాలుగు గోడల మధ్య ఆ పిల్లని పెంచుకోవడానికి అనుమతించింది ప్రభుత్వం. శ్రీకృష్ణ పరమాత్...