పోస్ట్‌లు

కృష్ణ

కృష్ణ ఉదయం  పది గంటలు అయింది.  చుట్టూ పోలీసులు మధ్య చేతులకు బేడీలు వేసుకొని ఉన్న సుమారు ముప్పై సంవత్సరములు యువతి నడుచుకుంటూ కోర్టు లోపలికి అడుగుపెట్టింది  కోర్ట్ ఆవరణలో ఉన్న అందరూ ఆమెకేసి వింతగా చూస్తున్నారు. ఈమె కూడా నేరం చేసిందా అన్నట్లు! ఆవిడకు మినహాయింపు ఏమిటి ?అని చూస్తే పాపం ఆవిడ నిండు గర్భిణీ.  న్యాయదేవతకు అవి ఏమీ సంబంధం లేదు. సాక్ష్యం బలంగా ఉంటే ఎవరైనా నేరస్తులు. అది దొంగ సాక్ష్యం కావచ్చు ,దొరల సాక్ష్యం కావచ్చు. సాక్ష్యాన్ని నమ్మి ఇంకేముంది యావత్ జీవిత కారాగర శిక్ష  విధించింది. సాధారణంగా ప్రతి స్త్రీ  పురిటి కోసం పుట్టింటికి వెళ్తారు. కానీ  విధి వ్రాత అలా ఉంది. జైలు గోడలే పుట్టిల్లు అయింది. మానవతా దృక్పథంతో  కోర్టు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిస్తే మరో ప్రాణికి జన్మనిచ్చింది సరిత.  ఆ బిడ్డను చూసి కుమిలి కుమిలి ఏడ్చింది  సదరు ఖైదీ సరిత.  రేపటి సమాజంలో దీని బ్రతుకేమిటి?   సరిత భర్త ఎప్పుడో పారిపోయాడు. ఇంక నా అన్న వాళ్ళు ఎవరూ లేరు సరితకి. ఆ నాలుగు గోడల మధ్య ఆ పిల్లని పెంచుకోవడానికి అనుమతించింది ప్రభుత్వం. శ్రీకృష్ణ పరమాత్...

ఇది ఏమి ఉప్మా చెప్మా!

ఇది ఏమి ఉప్మా చెప్మా!  ప్రతిరోజు ఇంటి ఇల్లాలికి అనేక సమస్యలు. ఏమిటా సమస్యలు? ఆర్థిక సమస్యలు కాదు. అల్పాహారం సమస్యలు. పదుగురు మెచ్చే అల్పాహారం చేయాలని తాపత్రయం. అందుకే ప్రతి ఉదయం కాఫీ తాగిన వెంటనే ఇవాళ ఏం టిఫిన్ చేసుకుందాం అoటు పిల్లలు మరియు భర్త మనోగతం తెలుసుకుంటుంది. ఎవరు ఏమి చెప్పకపోతే మౌనంగా తనకు నచ్చినది తయారు చేసుకుంటుంది. ఇంటి పనులతో అలసిపోయి ఉంటే కాస్తంత ఉప్మా కలియబెట్టి పెట్టేస్తుంది. ఆ అల్పాహారం చూడగానే కుటుంబ సభ్యుల మొహాలు మాడిపోయిన పెసరట్టులా అయిపోతాయి. అయినా తప్పదు మరి. అయితే ఒకటి ఉంది చెయ్యి తిరిగిన ఇల్లాలు చేసిన ఉప్మా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.  ఇప్పుడైతే రకరకాల టిఫిన్లు వచ్చేయ్ గాని ఒకప్పుడు సదరు ఉప్మాయే పెళ్లి వారికి అల్పాహారం. ఆకుపచ్చటి అరిటాకులో నూనెలో తేలియాడుతూ తెల్లగా మెరిసిపోయే ఆ ఉప్మా ఆ పెళ్లి వారికి అమృతమే.ఆ రోజులు కాబట్టి అలా ఉండేది. ఈ రోజుల్లో ఉప్మా చూస్తే తేలికగా చూస్తారు. పెసరట్టు కాంబినేషన్తో అయితే మారు అడుగుతారు. మాట్లాడకుండా తినేస్తారు. అప్పట్లో ఈ ఉప్మాలో పసుపు రంగులో మెరిసిపోయే శనగపప్పు తప్ప ఈ రోజుల్లో లాగ రకరకాల పప్పులు ఉప్మా తో పాటు ఉడికే...

గుండెల్లో నిలిచిన వైద్యుడు

గుండెల్లో నిలిచిన వైద్యుడు  ప్రతిరోజు ఎంతోమంది రోగుల గుండెలకి స్వాంతన చేకూర్చే డాక్టర్ రామారావు కి ఆరోజు గుండెల్లో చాలా గుబులుగా ఉంది. ఆ వయసులో కూడా చాలా ఉత్సాహంగా జూనియర్ డాక్టర్లతో కలిసిమెలిసి పని చేస్తూ గుండె శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ రామారావు మనసు అదోలా ఉంది. నాలుగు దశాబ్దాల పాటు గవర్నమెంట్ డాక్టర్ గా సేవలందించిన రామారావు కి ఆ రోజుతో ఆసుపత్రితో అనుబంధం తెగిపోతోంది డాక్టర్ రామారావు గుండె సంబంధిత వ్యాధులు చికిత్స చేసే డాక్టర్ గా ఆ మండలంలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. వృత్తిపరంగా ఎన్నో సమస్యలున్న తన తోటి ఉద్యోగులతో మంచిగా ఉంటూ కాలక్షేపం చేశాడు ఇన్ని రోజులు. ఎప్పటిలాగే సాయంకాలం ఆరోజు కూడా ఐదు గంటలు అయింది . పదవి విరమణ సభ మొదలైంది. ఒక్కొక్కరే లేచి డాక్టర్ గారితో తన అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు.  ఇంతలో చివర వరుసలో కూర్చున్న ఒక జూనియర్ డాక్టర్ లేచి మైక్ తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. నా పేరు రవి ప్రకాష్. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ జూనియర్ డాక్టర్ గా జాయిన్ అయ్యి నెలరోజులు అయింది. అయితే డాక్టర్ గారితో పని చేసిన అనుభవం కంటే ఒక పేషెంట్ కొడుకుగా నా అనుభవం ఎక్కువ...