పోస్ట్‌లు

పాత బట్టలు

నిజానికి ఇది ఒక కుటుంబ సమస్య .... సాంఘిక సమస్య కూడా పర్యావరణ సమస్య కూడా... ఇంతకీ ఏమిటిది? పాత బట్టలు. ఏ ఇంట్లో చూసినా కబోర్డ్ లు నిండిపోయి ఉంటాయి పాత బట్టలు. క్రితం సంవత్సరం పండగకి కొనుక్కున్న బట్టలు మళ్లీ వచ్చే పండక్కి పాత బట్టలు అయిపోయి అవి కబోర్డ్ లో అలాగే అడుగున ఉండిపోతాయి. దాన్ని తీసుకుని మళ్లీ కట్టుకునే నాథుడు ఉండడు.  ఆధునిక కాలంలో ప్రతి బెడ్ రూమ్లో పెద్ద పెద్ద కబోర్డ్ లు అది కాకుండా బీరువాలు ఎన్ని ఉన్నా బట్టలు నిండిపోయి ఉంటున్నాయి ప్రతి ఇంట్లో. ప్రతిసారి ఆ ఇల్లాలికి అవన్నీ మడతలు పెట్టి సక్రమంగా కబోర్డ్ లో అమర్చడం ఒక పెద్ద పని.  మా చిన్నతనాల్లో పండగలకి పుట్టినరోజులకి మటుకే బట్టలు కొనుక్కుని వాళ్ళం. ఇప్పుడు అలా కాదు ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుక్కోవడం మోజు తీరేవరకు కట్టుకోవడం అవి చివరికి పాత బట్టలు అయిపోతున్నాయి. నిజానికి ఇది కుటుంబంలో ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా చిన్నపిల్లలు పుట్టి దగ్గర నుంచి రకరకాల డ్రస్సులు కొంటూ ఉంటారు ఎదిగే పిల్లలు కదా అవి వాళ్లకి రానురాను సరిపోవు. అలాగే ఆడ మగ తారతమ్యం లేకుండా వెలిసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు మన కబోర్డ్ లో ఎన్ని ఉంటాయో ల...

క్యాలండర్

 క్యాలెండర్ ఏ ఇంటిలో చూసిన గోడ మీద అందమైన చిత్రపటాలు లేకపోయినా క్యాలెండర్ మటుకు వేలాడుతూ ఉంటుంది ప్రతి నెలకి ఒక పేజీ కేటాయించి పన్నెండు పేజీలతో ప్రతిరోజు పంచాంగం చూడనవసరం లేకుండా తిధి వార నక్షత్రం వర్జ్యం కరణం యోగం అన్ని ఒకే చోట మనకు చూపిస్తూ మంచి చెడ్డలు చెప్పే క్యాలెండర్ మన దినచర్యలో ఒక ముఖ్యమైన వస్తువు. తిధి వార నక్షత్రాలతో సంబంధం లేదు. మన జీవితాలకు సంబంధించి ఏ ముఖ్యమైన రోజు అయినా అన్నీ తేదీలు తోటే ముడిపడి ఉన్నాయి . పలానా రోజు ఫలానా తేదీ పలానా సంవత్సరం . గవర్నమెంట్ వారు కొలువులో చేరడానికి కొలువు నుండి దిగిపోవడానికి అన్నీ తేదీలే ముఖ్యం .  పెళ్లిరోజు కూడా ఫలానా తేదీ అని చెప్తాం అంతేకానీ పలానా తిధినాడు అని చెప్పం. కేవలం పితృ కార్యాలు, పండగలు మాత్రమే తిధుల ప్రకారం జరుపుకుంటాం.  ఏ శుభకార్యానికి అయినా ముహూర్తాలు అయితే తిథి వార నక్షత్రం తారాబలం చూసి పెట్టుకుంటాం గానీ అంకెలతో కనిపించే ఆ తేదీలు మన జీవితంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  దేశంలో ఒక ముఖ్య సంఘటన జరిగితే తదుపరి అది మన చరిత్ర పేజీలో ఒక ముఖ్యమైన రోజు అవుతుంది.ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 1947 వ సంవత...

ఇదే నా పండుగ

గ్రామీణ జీవితంలో సంత అంటే ఒక జాతర లాంటిది. వారానికి ఒకసారి జరిగే సంతలో కూరగాయలు, వెచ్చాలు కొనుక్కోడానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంత జరిగే ప్రదేశానికి వచ్చి, నెత్తి మీద బుట్ట, చేతిలో పదేళ్ల కూతురు కావమ్మని పట్టుకుని నడుచుకుంటూ, సంతలో ప్రతి దుకాణం తిరుగుతోంది యాదమ్మ. ప్రతీ వారం గ్రామంలో ఒక రోజు “సంత రోజు”గా జరుపబడుతుంది. ఆ రోజున చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఒకే చోటకి చేరి కొనుగోళ్ళు చేస్తారు. ఈ సంతలు మానవ మేళాలను పోలి ఉంటాయి — సరికొత్త వస్తువులు, మిత్రుల కలయిక, ప్రజల సందడి, చిన్న చిన్న సంతోషాలు అన్నీ అక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా సంతలో ఉన్న దుకాణాలు ఇవి సమాజ జీవన శైలికి ప్రతిబింబంగా నిలుస్తాయి. సంతలో ఎన్నో రకాల దుకాణాలు కనిపిస్తాయి. కొన్ని స్ధిరంగా ఉంటే, కొన్ని తాత్కాలికమైనవి. ముఖ్యంగా కనిపించే దుకాణాలు: కొత్తగా తీయబడిన దుంపలు, ఆకుకూరలు, మిరపకాయలు, టమోటాలు మొదలైనవి ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కళకళలాడుతూ ఉంటాయి. చక్కెర, ఉప్పు, పెప్పర్, నూనె, సబ్బులు, అల్లాలు మొదలైన అవసరమైన దినసరి సరుకులు చిన్న చిన్న పొట్టిదుకాణాల్లో విక్రయిస్తారు. గ్రామీణ శైలిలో వేషధారణకి అనుగుణంగా చీరలు, షర్ట్లు, పంచెలు మ...