పోస్ట్‌లు

అలంకరణ

అలంకరణ పూర్వకాలంలో శుభకార్యాలు ఆకాశమంత పందిరి వేసి పందిరి నిండా ముగ్గులు పెట్టి ,పచ్చటి తోరణాలు కట్టి పెళ్లిళ్లు చేసేవారు. అలాంటిది కాలం మారిపోయింది. పట్టణాల్లో బహుళ అంతస్తులో భవనంలో నివాసం ఉంటూ ఎవరైనా పది మంది చుట్టాలు వస్తే ఉండడానికి సరిపోక ఇబ్బంది పడుతుంటే అటువంటిది ఇంక శుభకార్యాలు సమయంలో ఎలా సరిపోతాయి .  అందుకే ఈ శుభకార్యాలన్నింటికీ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఆకాశమంత ఎత్తులో అందంగా కల్యాణ మండపాలు కట్టి అద్దెలకు ఇస్తున్నారు. ఈ కళ్యాణ మండపాల్లో అతిథులు కూర్చోవడానికి విశాలమైన హాలు. కుర్చీలు సోఫాలు ఏసీలు డైనింగ్ హాలు అతిధి రూములు కళ్యాణ వేదిక ఒకటేమిటి సకల సౌకర్యాలు ఒకచోటే. అటువంటి కళ్యాణ వేదికలని అందంగా అలంకరించడం ఒక కళ.  ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ వేదిక ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది .ఒక గుడిలా ఉంటుంది . ఇదంతా అలంకరణ మహిమ. ఇవాళ రేపు పుట్టినరోజులకి పండగలకి పెళ్లిళ్లకి మరి ఏ ఇతర శుభకార్యానికైనా ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఒక అలవాటుగా మారింది.  దీనికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వారు ఉన్నారు. కొంతమంది పూలతో మరి కొంతమంది బుడగలతో మరి కొంతమంది అందమైన అలంకరణ సామగ్రితో ఆ వేదికన...

మాధవుడి కాలచక్రం

మాధవుడి కాలచక్రం రాములోరి కళ్యాణం మనకు ఒక పండగ ముక్కంటి పుట్టినరోజు జన్మానికో శివరాత్రి పగలంతా ఏడు గుర్రాల రథమెక్కి ఊరేగే ఆ సూర్యుడు పుట్టినరోజు కూడా మనకు పండగే మరి ఉగాదికి ఏ దేవుడి ని పూజించాలి? చంటిగాడికి ఓ ప్రశ్న. అప్రయత్నంగా తల పైకెత్తి చూస్తే గోడమీద పాలసముద్రం మీద నిలువ నీడలా చక్రాయుధం ధరించి చిరునవ్వుతో కనబడినాడు పరమాత్మ. అది కాలచక్రం, పరమాత్మ చేతిలో తిరిగే విష్ణు చక్రం! కాదు కాదు... కాల స్వరూపమే పరమాత్మ! ఆరు ఋతువులను బండి చక్రాల్లా నడిపిస్తూ, ఆగకుండా ముందుకు కదిలించే మహానటుడు! మనల్ని మురిపించే ఆ మాధవుడు! శిశిరం వదిలి వెళ్ళిన నిరాశలను, నవ వసంతం తెచ్చి తరిమి కొడతాడు. పచ్చని ఆకులు విప్పిన నవ తరువుగా కొత్త ఆశయాలను మోసుకురావడానికి ఉగాదిగా కొత్త ఊపిరి పోస్తాడు పంచాంగం విప్పి రాబోయే కాలాన్ని తెలుపుతాడు, ఆశలను పెంచి, ఆశయాలను మొలకెత్తిస్తాడు. ఆరు రుచులను తొలిరోజే రుచి చూపించి, "జీవితమంటే ఇంతే!" అని బోధిస్తాడు. వసంతంలో వచ్చే పండుగతో తల రాతలు మారతాయని ఆశిస్తే, "వసంత రుతువు అంటే నేనే!" అంటాడు ఆ సమ్మోహనాకారుడు చంటిగాడు ప్రశ్నకు సమాధానం దొరికింది, పండగ పరమార్ధం తెలిసింది....

మేనమామ

మేనమామ " ఏవండీ మా మేనమామ పోయాడుట. ఫోన్ చేసి చెప్పారు అంటూ చెప్పింది సుమతి భర్త మోహన్ ఆఫీస్ నుండి రాగానే అలాగా! అయ్యో పాపం అన్నాడు. అంతే ఆ తర్వాత ఏ మాట లేదు. ఆ తర్వాత భర్త చెప్పబోయే మాట గురించి ఎదురుచూసింది సుమతి. భర్త నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో చివరికి ధైర్యం చేసి "ఏవండీ మాకు ఉన్న ఒక్క ఒక మేనమామ వాళ్ల కుటుంబాన్ని అత్తయ్యని చూసి రావాలండి అని అడిగింది భర్తని సుమతి.  నాకు ఆఫీసులో బోలెడు పనులు ఉన్నాయి. సెలవు దొరకడం కష్టం. అయినా ముంబై నుంచి ఆ పల్లెటూరు వెళ్లాలంటే ఎంత కష్టం. రిజర్వేషన్లు దొరకవు. ఫ్లైట్ కి వెళ్లాలంటే చాలా ఖర్చు .పైగా చలికాలం. మరి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు భార్య వైపు. అయినా మనం వెళ్లేసరికి ఆయన శవాన్ని ఇంకెవరిని చూస్తాం. ఏదో వెళ్లేవని పేరు కానీ ! ఇద్దరు పిల్లల్ని తీసుకుని నువ్వు ఒకదానివి వెళ్లడం చాలా కష్టం అని చెప్పి వేరే గదిలోకి వెళ్ళిపోయాడు.  సుమతికి ఒక్కసారి దుఃఖం పొంగుకు వచ్చింది. ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది.  సుమతి అమ్మమ్మగారి ఊరు తూర్పుగోదావరి జిల్లాలో పల్లిపాలెం గ్రామం. సుమతి అమ్మమ్మ పేరు సీతమ్మ తాతయ్య పేరు...

సాయం

సాయం  మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఎప్పుడు సాయంత్రం ఐదు గంటలకు కానీ రాని పనిమనిషి రత్తమ్మ రావడం చూసి "ఏమిటి రత్తాలు తొందరగా వచ్చేసావు ఇవాళ అని అడిగింది .సుభద్రమ్మ. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కదా అందుకే తొందరగా వచ్చి ఉంటుంది అనుకుంది సుభద్రమ్మ. గోదావరి మంచి పోటు మీద ఉంది. సాయంకాలానికి మన ఊళ్లో కి రావచ్చని కొంపలన్ని ఖాళీ చేయమని ప్రెసిడెంట్ గారు టముకు వేయించారు కదమ్మా. అందుకనే చీకటి పడకుండా సామాన్లు పిల్లల్ని తీసుకుని పక్కనున్న మా అత్తవారు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ము. మరి ఎలా వెళ్తారు? అని అడిగింది సుభద్రమ్మ. మన ఊర్లోకి పడవలు వచ్చాయి.వాడు అడిగినంత ఇచ్చి బయటపడదాము అనుకుంటున్నా ము అంటూ చెబుతున్న రత్తమ్మ మాటలకి ఒక్కసారి ఆలోచనలో పడింది సుభద్రమ్మ.  అది గోదావరి పక్కనున్న శుద్ధ పల్లెటూరు. ఊళ్లో అందరూ మోతుబరి రైతులే . పిల్లలంతా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో సెటిల్ అయిపోయారు.తాతల నాటి ఆస్తులు ఇల్లు వదల్లేక ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నారు ఆ తరం వాళ్లు. కోనసీమ గురించి అందంగా చెప్పుకుంటాం గాని పాపం వర్షాకాలం వచ్చిందంటే వాళ్లకి ఎంతో కష్టం. గోదావరి రోజుకు ఒకసారి భ...

కర్తవ్యం

కర్తవ్యం                 " రోజంతా మీకు చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఏమి వినపడదు కనపడదు. చెప్పిన మాట అర్థం చేసుకోరు. నాకు వయసు అయిపోతుంది అంటూ పొద్దున్నే అత్తగారి మీద గట్టి గట్టిగా కేకలు వేస్తున్న పార్వతమ్మ మాటలకి మెలకువ వచ్చింది కోడలు రాజ్యలక్ష్మి కి. పార్వతమ్మ అత్తగారు సుందరమ్మ గారు మంచం పట్టి చాలా రోజులైంది. పాపంఈలోగా పార్వతమ్మ గారి భర్త కూడా చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు రాజేష్ కి రాజ్యలక్ష్మి ఇచ్చి పెళ్లి చేసి కొత్త కోడల్ని కాపురానికి తీసుకొచ్చి రెండు నెలలు అయింది. ప్రతిరోజు పొద్దున్న ఇదే వరుస. సుందరమ్మ గారిని చూస్తే జాలేస్తోంది రాజ్యలక్ష్మి కి.  ఆ లంక అంత కొంపలో ఆ మూల గదిలో ఒక నులక మంచం. ఆ నులక మంచ o మీద సరి అయిన దుప్పటి ఉండదు. సుందరమ్మ శుభ్రమైన బట్ట కట్టుకుని ఎన్ని రోజులైందో. సుందరమ్మ గారి నీ ఆదరించిఅన్నం పెట్టడం చూడలేదు రాజ్యలక్ష్మి. నిజానికి ఆర్థికంగా సుందరమ్మకి లోటు లేదు. ఇంట్లో అందరూ వెండి కంచాలలో భోజనం చేస్తారు. కానీ ఆ సుందరమ్మ కి సత్తు కంచంలో అన్నం కలిపి పెడుతుంది  పార్వత మ్మ.  ఆ తరం వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉండేవి . ...

స్నేహం👬

స్నేహం చూడగానే ఒక చిరునవ్వు ఆ పైన ఒక ఆత్మీయమైన పలకరింపు  ఇదే కదా స్నేహానికి మొదటి మెట్టు. స్నేహం సాధారణంగా జ్ఞానం  తెలియని వయసులో అమ్మ ఒడి నుంచి బడికి వెళ్లిన తర్వాత  బెంచ్ మీద మీద పక్కన కూర్చున్న వాడితో మొదలవుతుంది  . సాయంకాలం పూట పార్కుల్లో ఎదురింటి కుర్రాళ్ళు   పక్కింటి కుర్రాళ్ళు తో ను బలపడుతుంది స్నేహం.  ఈ జీవనయానంలో ఎంతోమంది స్నేహితులు చేతులు   కలుపుతుంటారు విడిపోతుంటా రు. కొంతమంది   బ్రతుకుదారులు వేరైనా కడదాకా కలిసి ఉంటారు. పెరిగి   పెద్దయిన తర్వాత ఒక ఇంటివాడు అయిన తర్వాత పక్కింటి  వాళ్లతోటి ఎదురింటి వాళ్ళ తోటి స్నేహం మొదలవుతుంది.  అయితే నేను చెప్పబోయే వీళ్ళిద్దరు ఒక స్కూల్లో  చదువుకోలేదు. వయసులో చాలా తేడా వృత్తుల్లో తేడా అయినా ఒకే ఊరిలో కాపురం ఉంటూతెల్లవారి లేస్తే ఎవరు వృత్తిలో వాళ్ళు బిజీగా ఉంటూ రక్తసంబంధం లేకపోయినా బావగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటూ కాలక్షేపం చేసే  రామారావు విశ్వనాథ శాస్త్రి ల కథ. రామారావు ఆ ఊర్లో ఒక ఆయుర్వేద వైద్యుడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేస్...

అంతరంగ రంగస్థలం

అంతరంగ రంగస్థలం. అది ఒక రంగస్థలం. కాదు కాదు పుణ్యస్థలం. పుణ్యక్షేత్రం సందర్శించాలంటే రాసిపెట్టి ఉండాలి. ఈ రంగస్థలం ఎక్కాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ కళమీద విపరీతమైన మక్కువ తో ఇన్నాళ్లు మన మధ్య ఉన్నవాళ్లే ఒక్కసారిగా ఆ రంగస్థలం మీద కాలు పెట్టిన వెంటనే నటులు అయిపోతారు. పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ నాటకం చూస్తున్నంత సేపు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లి పోతారు.  రంగస్థలం మీద ప్రేక్షకుడికి ఎదురుగుండా నిలబడి తన నటన ప్రదర్శించాలి. ఇది చాలా కష్టమైన పని. రకరకాల పాత్రలు రకరకాల వేషధారణలు ధరించాలి . గొంతెత్తి శ్రావ్యంగా రాగయుక్తంగా పద్యాలు చదివి వినిపించాలి. అవసరమైన చోట నృత్యాలు చేయాలి. భారీ సంభాషణలు తో పాత్రను రక్తి కట్టించాలి. నిజంగా నటుల నటన తెలియాలంటే నాటకాలోనే తెలుస్తుంది. అయితే తెరదించిన తర్వాత ఆ నటులు మామూలు మనుషులు అయిపోతారు. నాటకానికి జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది అంటారు. కానీ మన నూరేళ్ళ జీవితంలో జీవిత చరమాంకం వరకు నటిస్తూనే ఉంటాం. పాత్రలలో జీవిస్తూనే ఉంటాం. మనం కూడా నటులమే. మానవ జీవితంలో ఉన్న వివిధ దశలలో మనల్ని ఆడించే ఆ పైవాడు మన దర్శకుడు . ఈ దర్శకుడు మనకి కనపడడు. కా...

సహాయం

సహాయం జీవితం క్షణ  భంగురం  అంటారు. ఒక్క క్షణం కాలం నిడివి గల జీవిత సంఘటనలు కొన్ని మనకి కనువిప్పు కలిగిస్తాయి. మనిషి గా ఉండవలసిన బాధ్యత గుర్తు చేస్తాయి. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కానీ స్పందించే హృదయాలు కొన్నే ఉంటాయి. అవసరమైనప్పుడు ఆదుకోవడం అనేది అందరికీ  చేతకాదు. ఎంతసేపు డబ్బు చుట్టూ పరిగెత్తే మనిషి తన చుట్టుపక్కల చూడడం మానేశాడు.  చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అని   సిరివెన్నెల వారు అమృతమైన మాటలు చెప్పిన బాలు గారు గొంతులో ఆ పాట ఆనందంగా విని అర్థం మరుగున పడేసారు జనం ఆ పాట సంగతి అలా ఉంచి మనం కథలోకి వెళ్ళిపోదాం. అవి కరోనా దేశాన్ని కుదిపేస్తున్న రోజులు. రోడ్డుమీద ఎక్కడ జనసంచారం కనబడే వారు కాదు కానీ ఆసుపత్రిలోనూ  మందుల షాపుల దగ్గర బాగా రద్దీగా ఉండేది. అన్ని మందుల షాపుల్లాగా ఆ మందుల షాపు దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మందుల కోసం వచ్చినవాళ్లలో రకరకాల వయసులో వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 10 సంవత్సరాల పాప చేతిలో బ్యాగు, మందుల చీటీతో వచ్చి నిలబడి ఉంది ఇంతలో ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ ఒక మందుల చీటీ మందుల షాపు యజమాని చేతులో పెట్టాడు. ఆ ముసలాయనకి ...

సీత జీవితం

సీత జీవితం  ఇల్లంతా పెళ్లి సందడితో హడావిడిగా ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు ఆకాశమంత పందిరి హాలంతా డెకరేషన్ చాలా అందంగా ఉంది. అక్కడ హల్దీ కార్యక్రమానికి డ్యాన్సులతో బంధువులంతా బిజీగా ఉన్నారు. పెళ్లికూతురు సీతాదేవి గారిని రెండు చేతులుండా గోరింటాకు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు గోరింటాకు పెట్టించుకునే హడావుడిలో కొందరు డాన్స్ లు హడావిడిలో హాలు అంతా ఆనందంగా ఉంది.  పెళ్లి పెద్దలు ఇద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వథూవరుల వయసు ఎంత ఉంటుందో ఊహించగలరా . ఇద్దరు వృద్ధ దంపతులు . ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు. ఇద్దరు బిడ్డల తల్లి . కడుపున పుట్టిన పిల్లలు తల్లికి పెళ్లి చేయడం మరీ వింతగా ఉంది కదా. వింత కాదండి. ఇంతకీ పెళ్లి వెనుక అసలు కథ ఏమిటి. సీతా దేవి గారు తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. తండ్రి నారాయణ మూర్తి గారు వేద పండితుడు. ఆచార సాంప్రదాయాలకు విలువనిచ్చేవాడు. లేక లేక పుట్టిన ఆడపిల్లని చాలా కట్టుబాట్లుతో పద్ధతిగా పెంచాడు. ఆ ఊర్లో ఉండే ప్రాథమిక విద్య తోటి చదువు ఆపించేసి ఇంటి వద్దనే సంస్కృత పాఠాలు పురాణాలు సంగీతం నేర్పించాడు. సీతా దేవి గారు కూడా చాలా...

తలరాత

తలరాత ఉదయం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. జనజీవనం అంతా  అస్తవ్యస్తo అయిపోయింది. రోడ్డుమీద ఒకరు కూడా  తిరగటం లేదు. ఉన్నట్టుండి వీధి గుమ్మo లోనుంచి అమ్మా  ఇంత అన్నం ఉంటే పెట్టండి చలిగా ఉంది ఒక పాత బట్ట   ఇవ్వండి అంటూ దీనంగా ఒక వృద్ధురాలి అరుపువినిపించింది.  ఇంత వర్షంలో ఎవరు అబ్బా అనుకుంటూ సీతమ్మ గారు వీధి  గుమ్మంలోకి తొంగి చూసారు. ఒక చేతిలో కర్ర మరొక  చేతిలోగిన్నె పట్టుకుని చిరిగిపోయిన బట్టలతో ఒక వృద్ధురాలు వణికిపోతూ గుమ్మంలో నిలబడి ఉంది. ఈవిడ ఎవరో  ఎరుగున్న మనిషి లాగే ఉంది. ఎక్కడో చూసినట్టుగా ఉంది అని  మనసులో అనుకుంటూసీతమ్మ గారు అమ్మ మీరు వెనక వేపుకు పాకలోకి రండి. బట్టలు మార్చుకుని అన్నం తిందురు గాని వర్షం లో ఎలా తింటారు. పైగా బాగా తడిసిపోయి ఉన్నారు అంటూ పెట్టలోంచి పాత చీర జాకెట్లు తీసి ఆ  వృద్ధురాలికి ఇచ్చింది. ఆ వృద్ధురాలు బట్టలు మార్చుకునేలాగా గిన్నెలో వేడి వేడి అన్నం పప్పు కూర మజ్జిగ తో భోజనం  అరిటాకు వేసి వడ్డించింది. పాపం ఎన్ని రోజులైందో ఆ ముసలిది  అన్నం తిని ఆకులో అన్నం అంతా ఖాళీ చేసేసి అమ్మా ప్రాణం  ...