పోస్ట్‌లు

లక్ష పెన్నులతో పూజ

లక్ష పెన్నుల తో పూజ.  సాధారణంగా దేవుళ్ళని, దేవతలనినిత్యం పువ్వులతో ధూప దీప నైవేద్యాలతో పూజిస్తుంటారు. అది ప్రతి దేవాలయంలోనూ జరిగేదే. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయితే నడిచి ఏడుకొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. తలనీలాలు సమర్పిస్తామని అనుకుంటారు. అయితే తమ కోరికలు తీరితే కొబ్బరికాయలు మ్రొక్కు తీర్చుకుంటామని ఈ స్వామిని వేడుకుంటారు . ఇది ప్రధానమైన మ్రొక్కు ఈ దేవాలయంలో. ఇంతకీ ఆ స్వామి ఎవరు? అంటే కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామంలో ఉండే శ్రీ సిద్ధి వినాయక స్వామి. అయినవిల్లి గ్రామం కాకినాడకి 72 కిలోమీటర్ల దూరంలో అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది అతి పురాతన దేవాలయం. ఈ దేవాలయంలో స్వామి దక్షిణాభిముఖుడై కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు.  ప్రతిరోజు జరిగే సాధారణ అర్చనలతోపాటు లక్ష్మీ గణపతి హోమం ,పర్వదినాలలో ప్రత్యేక పూజలు, జరుగుతుంటాయి. ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.  దానికి తోడు ఈ కోనసీమలో చుట్టూ అందమైన గోదావరి ,పచ్చటి చెట్లు ,పిల్ల కాలువలు, కొబ్బరి తోటలు చూడడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగు...

నన్ను వదిలి ఉండగలవా

"నన్ను వదిలి ఉండగలవా! మనమందరం ఎలాగా బందీ అయిపోయాము. బందీ అయిపోయామంటున్నారు. దేనికో చెప్పకుండా సందేహం పెంచారు. సాధారణంగా బందీలు అనే మాట వ్యసనానికి సరిపోతుంది. నిజమే నాకు కూడా ఒక సందేహం .ఇది వ్యసనమా కాదా. అవునని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాదని చెప్పడానికి కారణాలు కూడా ఉన్నాయి.  ఎక్కడో జపాన్లో పుట్టి జగమంతా వ్యాపించింది. అది లేకపోతే మనకు జరుగుబాటు లేకుండా ఉంది. మనం అత్యధికంగా ప్రేమించే వస్తువుల్లో ఇది కూడా జేరిపోయింది. ఎక్కడో మూలగా నడవలో బల్ల మీద కూర్చుని సమాచారాన్ని మోసుకొచ్చే ఆ యంత్రాన్ని పడగొట్టేసి సాంకేతికంగా ఎదిగిపోయి చిన్న బొమ్మగా చేతిలో చేరిపోయి సమాచారాన్ని ఇట్టే మోసుకొస్తోంది, తీసుకుపోతోంది. సమాచారంతోపాటు మన సరదాలు కూడా తీరుస్తోంది. సమయం చెబుతోంది. పది పైసలు ఖర్చు లేకుండా మన ప్రతిబింబాలన్నీ క్షణాల్లో చూపిస్తోంది.  ఆ బుజ్జిముండ మీద మీకు ఎందుకు అంత కోపం? రోజు మీ బంధువుల స్నేహితుల పిల్లల క్షేమ సమాచారం తీసుకొస్తోంది కదా అని సమర్థించే వాళ్ళు ఇది వ్యసనం కాదని ఓటేశారు. ఇంకా అనేక కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇది లేకపోతే ఒక క్షణం విడిచి ఉండలేని పరిస్థితి. కనపడకపోతే ...

రామ చిలుక

రామ చిలుక  పేరులో రామ శబ్దం  రంగు చూస్తే హరిత వర్ణం ముక్కు చూస్తే మిరప పండు  కుత్తుక చుట్టూ రాముడి రంగు.  నువ్వంటే మాకు ప్రాణం.  మా ప్రాణం నీలాగే ఎగిరిపోతుందని తెలియని అమాయకులం.  రామదాసు చరిత్ర తెలిసిన నిన్ను బోనులోనే బంధిస్తున్నాం. పక్షివని తెలిసినా మా భవిష్యత్తు చెప్పమని పైసలిస్తున్నాం. అందరికీ జాతకం చెప్పే  నువ్వు బోను లో ఎందుకు బందీ అవుతావు  తుర్రుమని ఎగిరిపోయి ఉండే దానివి కదా  నీ తలరాత అలా ఉంది  మా రాతని నువ్వు ఎలా చెప్పగలవు.  ఎప్పుడూ నువ్వు చెట్ల మీద ఉంటేనే అందం.  చిలకకొట్టిన జామపండు మాకు  ఎప్పుడు అది అమృతతుల్యమే. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

మగ మహా రాజు

మగమహారాజు  ఇది మహా నటుడు నటించిన సినీమా కాదు. పుణ్యలోకానికి దారి చూపించే మగమహారాజుల గాథ ఆ కుటుంబం అంతటికీ రాజే.  ఆ గుండెల్లోనే ఉంటుంది చెప్పుకోలేని వ్యధ. ఈ మహారాజుకు రాజ్యాలు ఉండవు తలపై కిరీటాలు ఉండవు వంశ గౌరవాల బరువులు తప్ప. కుటుంబ బాధ్యతలబరువులకి అనుబంధాల ఆప్యాయతలకి జవాబుదారి ఈ మహారాజే. ఉరుకుల పరుగుల జీవితం. విరామం లేని పని ఒత్తిడి అలసి సొలసి ఇంటికి చేరినా తీర్చుకోవాల్సిన బాధ్యతల భయాలు.   భగీరథ ప్రయత్నం చేయాలి ఒక బాధ్యత తీరాలంటే. బరువులు ఒక పక్కకు నెట్టాలంటే. మధ్యతరగతి జీవితాలు  బడ్జెట్ బండి మీద బతుకు నడపాల్సిందే బండికి బ్రేకులు వేయకపోతే బతుకంతా నవ్వుల పాలు దానికి కూడా మగ మహారాజే ఇవ్వాలి జవాబు కళ్లెం వదిలితే గుర్రం తప్పటడుగులు వేస్తుంది అందుకే రౌతు కొద్దీ గుర్రం. మౌనంగా ఉన్న పురుష పుంగవుని మదిలో ఎన్ని అగ్నిజ్వాలలో. కట్టుకున్న భార్యకు తెలియదు రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు తెలియదు. ఆ మర్మం అంతా బయటపడేది వైద్యుడు దగ్గరే. కలలా కరిగిపోతుంది వయస్సు ఏ క్షణంలో పిలుపు వస్తుందో ఎవరికి తెలుసు.  ఇదే తరతరాల మగ జాతి చరిత్ర.  మార్పులేని మహత్తర జాతి చరిత్ర.....

దుస్తులు

దుస్తులు "  పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.  పోయేటప్పుడు అది నీ వెంట రాదు." అన్నాడు ఒక సినీ కవి. అంటే ఈ మధ్యకాలంలో తన శరీర  భాగాలని బహిర్గతం చేయకుండా కాపాడుకోవడానికి దుస్తులు  ధరిస్తాడు మానవుడు. ధరించే దుస్తులు మానవుడికి సరికొత్త  అందాన్ని ఆనందాన్ని తీసుకొస్తాయి. మన సమాజంలో దుస్తులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మనం ధరించే దుస్తులు చలి నుండి ఎండ నుండి మన శరీరాన్ని కాపాడు తాయి. రోజు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఒక రకమైన ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. ఇది ఆఫీస్ వారి నియమ నిబంధనలో డ్రెస్ కోడ్ ఉంటుంది. దుస్తులు ధరించిన ఉద్యోగులు పలానా ఆఫీస్ వారని ప్రజలకు తెలుస్తుంది. ఈ డ్రెస్ కోడ్ గనక పెట్టకపోతే నైట్ డ్రెస్ లతో కూడా ఆఫీసులకు వచ్చే ప్రమాదం ఉంది. పదిమంది తిరిగే ఆఫీసులో అది సభ్యతగా ఉండదు. అది ఆ మనిషి గౌరవం తగ్గిస్తుంది. ఆ కార్యాలయానికి చెడ్డ పేరు వస్తుంది.  అలాగే స్కూల్లోనూ కాలేజీలోనూ చదివే పిల్లలకు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించాలని నియమ నిబంధనలు ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలందరూ ఒక్కటే ధనిక పేద తేడా ఏమీ లేదని చెప్పడమే. ఆదిమానవుడు కూడా ఆకుల తోటి లతలతోటి తన శరీరాన్ని కప్పుకు...

పరమాత్మ

పరమాత్ముడు  పప్పు రుబ్బే రుబ్బురోలు పరమాత్ముడిని తలచి షోడశోపచార ములు చేసి పూజలు చేసే ఒక పడతి. ఆ పడతి కి వెఱ్ఱి యని ప్రజలు తలచే పరమాత్ముడు ఎందైన కలడని పోతన చెప్పె. భవన స్తoభము నుండి నరసింహుడు అవతరించి ప్రహ్లాదుని రక్షించే. దశావతారములు ఎత్తి విష్ణువు భక్తులను రక్షించే. రహదారి పక్కన తాడిచెట్టుని అమ్మగా తలచి పసుపు కుంకుమలు పూసే మానవుడు. పుణ్యమని దలచి వే ప కి రావికి కల్యాణం జరిపించే. మూగ జీవిని వెంకటేశ్వరుడని తలచి అచ్చు వేసి రహదారిలోకి విడిచే . వానరం కనపడగానే వంగి వందనము చేసి హనుమగా తలిచే. దీనులలోనే కనబడింది దైవం మదర్ తెరిసా కి మానవసేవే మాధవసేవ అని నమ్మింది రామకృష్ణ పరమహంస. మనసుపెట్టి చూస్తే ప్రతి ప్రాణిలోనూ ఉంది దైవం. ఆ మనసు పేరే మానవత్వం. మనసు మెచ్చే పని చేయడమే మనిషి లక్షణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

చెవిలో చెబితే!

చిత్రం
చెవిలో చెబితే!  మనిషి జన్మంతా కోరిక మయం. బాధల మయం కోరిన కోరికలు తీర్చుకోవడానికి మనిషి దేవుడిని నమ్ముతాడు. దేవాలయాల కి వెళ్తాడు. మ్రొక్కులుచెల్లిస్తాడు . ఏడుకొండలు ఎక్కితే గాని వెంకటేశ్వర స్వామి కరుణించడు. పదునెనిమిది మెట్లు ఎక్కితే గాని అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి కాదు. శ్రీశైల శిఖర దర్శనం చేస్తే గాని శివయ్య కరుణాకటాక్షాలు భక్తులకు లభించవు. ఏ దేవాలయంలో నైనా గర్భగుడిలో భక్తులకు అనుమతి లేదు. కొన్ని దేవాలయాల్లో తప్పితే దేవుని భక్తులు తాకరాదు. కానీ ఒక అపురూపమైన స్వామి భక్తుల కోరికలను తన చెవిలో చెప్పించుకుని ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు . ఆ స్వామి ఎవరో కాదు కాకినాడ జిల్లా బిక్కవోలు గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి. ఇది పురాతనమైన దేవాలయం. ఈ స్వామికి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద శిలావిగ్రహం. భూమి లోపల ఎన్ని అడుగులు ఉందో ఎవరికీ తెలియదు . చాళుక్యుల కాలంలో కట్టిన గుడి అని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ స్వామి అనుగ్రహం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుని అన్న ప్రసాదం స్వీకరించి వెళ్తుంటారు. పూజాదికాల సమయాలు ఎక్కడా వివరాలు లభించలేదు. గుడ...

మామిడి పండు

అందాన్ని పండు తో పోలుస్తారు మనిషి పండు లాఉన్నాడు అంటారు. పండు చూడ్డానికి కాదు తినడానికి పండు తింటే పండులా అవుతారు. ప్రతి సీజన్ కి ఓ పండు వేసవి వచ్చిందంటే చెప్పాలా మామిడి పండే మహారాజు. ఉగాది పండగ తోటే ప్రారంభం. మామిడికాయ రుచి చూడడం. వేసవిలో పిందెలతో పచ్చడి బద్దలు అదేనండి మెంతిబద్దలు లేకుండా ముద్ద  దిగదు మన తెలుగు ప్రజలకు. పప్పులో ఓ పుల్ల మామిడి ముక్క  వెల్లుల్లి తో తాలింపు చేస్తే అడ్డ విస్తరి అర నిమిషo లో ఖాళీ ఊరంతా వెతికి తెస్తారు ఊరగాయ కాయ. నాణ్యం చూడ్డానికి స్నేహితులతో మంతనాలు పెళ్ళి అంత పని ఊరగాయ పెట్టుకోవడం. ఆ సందడే వేరు. అమ్మలకి చేతినిండా పని. ఈనాటి బొమ్మలకి నగిషీలు దిద్దుకోవడమే పని కంచం ముందు కూర్చుంటే కాని ఊరగాయ గుర్తుకు రాదు. అప్పుడు గుర్తుకు వస్తుంది అంగట్లోని పికిల్. ఎర్రగా నూనెలో తేలుతూ చెరువులోని కలువ పువ్వులా ఉంటుంది కుండలోని ఊరగాయ. వేసవి వెళ్ళేసరికి సగం కుండ ఖాళీ. రోజుకో రకం ఆవకాయ తోటి అడ్డవిస్తరి అద్భుతం అమ్మ చేతిలో ఏముందో మిస్టరీ. బ్రహ్మ కూడా చెప్పలేడు పామిస్ట్రీ. బెల్లం ఆవకాయ కలిపిన అన్నం ముద్ద.  మరునాటికి కూడా నోరు పట్టుకుని వదలదు తీపిదనం. గుప్పన...

జీవితం

నీటి బుడగ జీవితం. ఎప్పుడు చితికి పోతుందో ఎవరికి తెలుసు. చావు బతుకుల మధ్య కాలంమే జీవితం. పగలు రాత్రి ప్రతిమనిషికీ సమానం. సగ భాగం అంతా తిండి నిద్రకి సరిపోతుంది. బాల్యమంతా నీ జీవితం గురించి నీకు అవగాహన ఉండదు. యవ్వనం నుండి నీ అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఇంకో జీవి కూడా నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ జీవి కూడా జీవితం అంటే అంత వరకు తెలియదు. అమ్మా,నాన్న ,పుస్తకాలు ,కాలేజీ, హాస్టల్ జీవితం బాధ్యతలు లేని బతుకు ఇంతవరకు అనుభవించిన తీపి గుర్తులు. ఇంకొకరి తో జీవితం ఒక ఫ్రేమ్ లో ఉంటుంది.  ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోవడం. ఒకరి కోసం ఒకరు బతకడం. తన ఇష్టాలను త్యాగం చేయడం కూడా తప్పదు. సర్దుబాటే జీవితం. సరే జీవితంలోకి అడుగు పెట్టాం. జీవిత సాఫల్యo ఏమిటి. డబ్బు పిల్లలు వృద్ధాప్యం ఈ మూడింటి తోటి మనకు చిక్కులు వస్తాయి. మన ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలి.  డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. చేసిన పనికి ప్రతిఫలమే జీతం. జీతం తో జీవితం ఆనందంగా గడపడమే . అప్పనంగా వచ్చేది లంచం. లంచం పంచ రంగుల జీవితం చూపిస్తుంది. కానీ దైవం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. పరుల సొమ్ము ఆశించక పోవడమే పరమార్ధం. గౌతమ్ బుద్ధ...

బారసాల

పిల్లలు దేవుడు చల్లనివారే అంటూ ఎక్కడో దూరంగా పాట విన పడుతుంది. నిజమే పిల్లలు దేవుడు ఒక్కరే అసలు దేవుడు పిల్లల్ని ఎందుకు పుట్టించాడు అంటే మన ఆనందంగా ఉండడానికి . పిల్లలు ఉన్న ఇల్లు ఎంత సందడిగా ఉంటుంది. ఇంకా చంటి పిల్లలు ఉంటే అసలు చెప్ప అక్కర్లేదు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇటీవల కాలంలో మా మనవరాలు పుట్టడం తో మరోమారు ఆ అనుభూతుల్ని అనుభవించడానికి భగవంతుడు అవకాశం కల్పించాడు. మా చిట్టి తల్లి కి మరో బుల్లి తల్లి. నా బుల్లి తల్లి రాకతో మా ఇల్లు స్వరూపమే మారిపోయింది. నడుముకు బెల్టు చెవులకు గుడ్డా కాళ్లకు ప్లాస్టిక్ చెప్పు తో నా చిట్టి తల్లి రూపం మారిపోయింది. చంటి దాని ఏడుపుతో ఇల్లంతా మార్మోగిపోతోంది .  గుట్టలుగా ఉన్నా మా ఆవిడ పాత చీరలు ముక్కలుగా మారిపోయి ప్రతి గదిలోనూ కనపడుతున్నాయి. పట్టుమని పది రోజులు కూడా ఎప్పుడు మా ఇంట్లో ఉండని మా అత్తయ్య గారు ఆరోగ్యం బాగా లేకపోయినా తన టెంపరరీ అడ్రస్ సామర్లకోటకు మార్చి చంటి దానితో బిజీ అయిపోయింది. అసలు చంటి పిల్లల్ని పెంచడం కూడా ఒక కళే. ఆమె అలనాటి సుధీర్ఘ అనుభవంతో నా చిట్టి తల్లి ని ,చంటి దాని కూడా కంటికి రెప్పలా చూసుకునేది. ముత్త అమ్మమ్మ గా ఆమ...