మగ మహా రాజు

మగమహారాజు

 ఇది మహా నటుడు నటించిన సినీమా కాదు.
పుణ్యలోకానికి దారి చూపించే మగమహారాజుల గాథ
ఆ కుటుంబం అంతటికీ రాజే.
 ఆ గుండెల్లోనే ఉంటుంది చెప్పుకోలేని వ్యధ.

ఈ మహారాజుకు రాజ్యాలు ఉండవు
తలపై కిరీటాలు ఉండవు
వంశ గౌరవాల బరువులు తప్ప.

కుటుంబ బాధ్యతలబరువులకి
అనుబంధాల ఆప్యాయతలకి
జవాబుదారి ఈ మహారాజే.

ఉరుకుల పరుగుల జీవితం.
విరామం లేని పని ఒత్తిడి

అలసి సొలసి ఇంటికి చేరినా
తీర్చుకోవాల్సిన బాధ్యతల భయాలు.

 
భగీరథ ప్రయత్నం చేయాలి ఒక బాధ్యత తీరాలంటే.
బరువులు ఒక పక్కకు నెట్టాలంటే.

మధ్యతరగతి జీవితాలు 
బడ్జెట్ బండి మీద బతుకు నడపాల్సిందే

బండికి బ్రేకులు వేయకపోతే
బతుకంతా నవ్వుల పాలు
దానికి కూడా మగ మహారాజే ఇవ్వాలి జవాబు

కళ్లెం వదిలితే గుర్రం తప్పటడుగులు వేస్తుంది
అందుకే రౌతు కొద్దీ గుర్రం.

మౌనంగా ఉన్న పురుష పుంగవుని
మదిలో ఎన్ని అగ్నిజ్వాలలో.
కట్టుకున్న భార్యకు తెలియదు
రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు తెలియదు.
ఆ మర్మం అంతా బయటపడేది వైద్యుడు దగ్గరే.

కలలా కరిగిపోతుంది వయస్సు
ఏ క్షణంలో పిలుపు వస్తుందో ఎవరికి తెలుసు.
 ఇదే తరతరాల మగ జాతి చరిత్ర.
 మార్పులేని మహత్తర జాతి చరిత్ర..

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279
 

 

 

,
.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం