చల్లని తల్లి

చల్లని తల్లి

ఇన్నాళ్లు గజగజలాడించిన హేమంతం 
కోపంగా చూస్తున్న శిశిరాన్ని చూసి కరిగి పోయె 

ముసుగు తన్నిన దుప్పటి మూలకు చేరిపోయే 
నిప్పులు కక్కుతూ భానుడు చెమట పుట్టించే 

గది గోడల మీద అందమైన 
బొమ్మలన్నీ మాయమయ్యే 

వేసవి బాధకి శీతలయంత్రం 
ఇంటి గోడల మీద బొమ్మ అయ్యే. 

మూడు రెక్కల గాలి పంకా మీద 
మోజు తీరిపోయే.

మీట నొక్కితే మాట వినే 
చల్లని తల్లి అపురూపమాయే 

పగలు రాత్రి మరిచి
గదికి బందీ అయ్యే
  కుటుంబం. 
బిల్లు చూసి సంసారి గుండె గుబిల్లుమనే.
వేలు పోసి కొన్న దానికేసి వెర్రి చూపులు చూసే సంసారి
చిల్లు పడిన జేబుకోసం
బడ్జెట్లోని లోటు కోసం 
తల్లడిల్లిపోయే ఆ సంసారి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం