పోస్ట్‌లు

బాలు మళ్లీ జన్మించు

ముగ్దమోహన రూపం. పాటంటే ప్రాణం. భాషలో ఉచ్చారణకే ప్రాధాన్యం. భావం పలికించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పుట్టింది పండితారాధ్యుల వంశం. ఏ నోములు నోచిందో తల్లి శకుంతలమ్మ ఆ ఇంట్లో నారద తుంబురులే జన్మించారు బాలుడుగా. ఆరాధించే త్యాగరాజస్వామి కొడుకుగా పుట్టాడు ఆ సాంబయ్య గారింట్లో. చిన్నతనంలో సాంబయ్య గారి ఇంట్లో జరిగిన సాహిత్య గోష్టులు విని బాలసుబ్రమణ్యం గారికి భాష పట్ల అభిమానం పెరిగింది. నాటకాల పట్ల మమకారం పెరిగింది. పాడాలనే కోరిక పెరిగింది.  కళాశాల విద్య స్థాయి దాటి సాంకేతిక విద్య నేర్చుకోమంటే సరిగమల వైపు మొగ్గు చూపిందా గళం. పుట్టింది ఎక్కడో నెల్లూరు జిల్లాలో అయినా తన గొంతులో ఒకటా రెండా 40 వేల పాటల పాడి విశ్వం అంతటికి చిరపరిచితుడు అయ్యాడు మన బాలసుబ్రమణ్యం. ఆరాధ్య గాయకుడయ్యాడు. భాషతో నిమిత్తం లేదు. ఎన్ని భాషలలో పాటలు పాడాడో లెక్కలేదు. ప్రతి దేవాలయము బాలు గొంతులోని సుప్రభాతం తోటే భక్తి పాటల తోటే తలుపులు తెరుచుకుంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు.  ఒక మతమునకు సంబంధించిన పాట అయినా ఒక భాషకు సంబంధించిన పాట అయినా ఆయన గొంతులో అది సుస్వరాల మూట. అది అనుకరణ అంటే అనుకరణ కాదు. చలన చిత్రంలో నటించే న...

మావ గారి నాటకం

 ఊరంతా దీపావళి సంబరాలతో హడావుడిగా ఉంది. బాణసంచా కాల్పులతో ఊరంతా మారుమోగిపోతో oది."గత సంవత్సరం నాన్న ఎంత హడావుడి చేశాడు దీపావళి నాడు. పిల్లలతో పోటీపడి బాణసంచా కాల్చుకున్నాడు. కొత్త బట్టలు కట్టుకొని చిన్నపిల్లాడి లాగా మతాబులు చిచ్చుబుడ్లు కాకరపువ్వొత్తులు పాము బిళ్ళలు మనవలతో పోటీపడి కాల్చుకున్నాడు. దీపావళి నాడు ఆయన పుట్టినరోజు. పిల్లలు అంటే ఎంత సరదా. ఒక్కరోజు సెలవు ఉన్నా సరే రమ్మని పదేపదే ఫోన్లు. అంత దూరం నుంచి ఏం వస్తాము? నాన్న అంటే లేదమ్మా! పిల్లల సరదా మనమే తీర్చాలంటూ వచ్చేవరకు ప్రాణం తినేసేవాడు. ఇంట్లో అందరికీ బట్టలు, బాణసంచాలు ,పిండి వంటలు ,ఇంటి నిండా దీపాలు ,గుమ్మానికి మావిడాకులు తోరణాలు అన్నీ తనే దగ్గరుండి చూసుకునేవాడు." ఇవన్నీ ఆడవాళ్ళ పనులండి మీకెందుకు మీరు మనవళ్ళతో ఆడుకోండి అని అమ్మంటే కాదు నేను సహాయం చేస్తాను అంటూ అన్నిట్లోనూ ఉండేవాడు.అసలు విషయం అది కాదు ఎక్కడైనా అమ్మ సరిగా చేయదేమో అని అనుమానం. పిల్లలు అంటే ప్రాణం.  మరి ఈ ఏడాది దీపావళి కి అప్పుడే మూడు నెలలు అయిపోయింది. తారాజువ్వల హఠాత్తుగా పైకి వెళ్ళిపోయాడు అని సుమతి మనసులో బాధపడుతూ కంటి నుండి జారిన నీళ్లను తుడుచుక...

సహాయం

జీవితం క్షణ భంగురం అంటారు. ఒక్క క్షణం కాలం నిడివి గల జీవిత సంఘటనలు కొన్ని మనకి కనువిప్పు కలిగిస్తాయి. మనిషి గా ఉండవలసిన బాధ్యత గుర్తు చేస్తాయి. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కానీ స్పందించే హృదయాలు కొన్నే ఉంటాయి. అవసరమైనప్పుడు ఆదుకోవడం అనేది అందరికీ చేతకాదు. ఎంతసేపు డబ్బు చుట్టూ పరిగెత్తే మనిషి తన చుట్టుపక్కల చూడడం మానేశాడు.  చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అని సిరివెన్నెల వారు అమృతమైన మాటలు చెప్పిన బాలు గారు గొంతులో ఆ పాట ఆనందంగా విని అర్థం మరుగున పడేసారు జనం ఆ పాట సంగతి అలా ఉంచి మనం కథలోకి వెళ్ళిపోదాం. అవి కరోనా దేశాన్ని కుదిపేస్తున్న రోజులు. రోడ్డుమీద ఎక్కడ జనసంచారం కనబడే వారు కాదు కానీ ఆసుపత్రిలోనూ  మందుల షాపుల దగ్గర బాగా రద్దీగా ఉండేది. అన్ని మందుల షాపుల్లాగా ఆ మందుల షాపు దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మందుల కోసం వచ్చినవాళ్లలో రకరకాల వయసులో వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 10 సంవత్సరాల పాప చేతిలో బ్యాగు, మందుల చీటీతో వచ్చి నిలబడి ఉంది ఇంతలో ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ ఒక మందుల చీటీ మందుల షాపు యజమాని చేతులో పెట్టాడు. ఆ ముసలాయనకి వయస్సు 70 ఏళ్ల వరకు ఉండొచ్చు. వ...