పాఠశాల తెరిచిన తొలి రోజులలో
ప్రతి సంవత్సరం జూన్ నెలతో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అసలు విద్యా సంవత్సరం అంటే ఏమిటి? పాఠశాలలు యూనివర్సిటీలు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి మళ్లీ తరగతులు , పరీక్షలు, సెలవులు జరిగే ఒక స్థిరమైన కాలాన్ని సూచిస్తుంది. ఏ విద్యార్థి కైనా సెలవులు ఉంటే సరదా. అందులో వేసవి సెలవుల తర్వాత తొలిరోజు పాఠశాలకు వెళ్లే పిల్లలు అంత ఉత్సాహంగా ఉండరు. ఇన్నాళ్ళు వేసవి సెలవుల మాధుర్యాన్ని అనుభవించి క్రమశిక్షణ జీవితానికి దూరంగా ఉండి తమ ఇష్టం వచ్చినట్లు ఆటలాడుకుని పాటలు పాడుకుని సినిమాలు షికార్లు వాళ్ళ ఇష్టం. అలా ఆనందంగా గడిపిన వేసవి సెలవు లను మర్చిపోలేక మళ్లీ స్కూలుకి వెళ్లాలంటే బెంగ బెంగగా ఉంటుంది పిల్లలకి. వేసవి సెలవులు అయిపోయి రెండు రోజులు ముందు నుంచి ఇంకా హాలిడేస్ ఇంకా రెండు రోజులే ఉన్నాయి అంటూ రోజు బెంగగా చెబుతుంటారు. మరి పిల్లల పరిస్థితి ఇలా ఉంటే తల్లి తండ్రి పాత స్కూల్లో కంటిన్యూ చేయాలా కొత్త స్కూలుకు మార్చాలా కట్టవలసిన ఫీజులు కొనవలసిన పుస్తకాలు బస్సు ఫీజులు యూనిఫారం వీటన్నిటిని సమకూర్చుకునే హడావిడిలో ఉంటారు. ఆ ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేసుకుంటూ విద్యా...