దీపావళి సంబరాలు
సాయంకాలం ఆరు గంటలు అయింది. ఎక్కడి నుంచో బాణసంచా చప్పుడు వినబడు తోంది. అప్పుడే దీపావళి ప్రారంభమైపోయింది అనుకుంటూ ఇత్తడి పళ్లెంలో వెలిగించిన ప్రమిదలని ఒక్కొక్కటి ఆరుగు మీద పెడుతోంది రమ్య. దీపావళి నాడు అరుగులకు ప్రత్యేక అతిధులు ఈ దీపాలు. ఈ దీపాలతోటే ఎంత కళ వచ్చింది ఇంటికి అనుకుంటూ గాలికి రెపరెపలాడుతున్న దీపాలను చూసి మనసు ఎక్కడకో పోయింది రమ్యకి. పక్క ఇంటి నుంచి పిల్లల దివిటీలు కొడుతున్న హడావుడి వినపడుతోంది. పిల్లలు చేతులు కాల్చుకుంటారని ఆ తల్లి నానా హైరానా పడిపోతో oది. ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి రమ్య మనసు చిన్నతనంలోకి పరుగులెట్టింది. " అమ్మా రమ్య పరికిణి కుచ్చిళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకో. దూరంగా ఉండి ప్రమిదల్లో నూనె పొయ్యి. నువ్వు మతాబులు కాల్చుకో. అన్నయ్య తారాజువ్వలు కాల్చుకుంటాడు. నీకు గె డ కర్రకి మతాబులు కట్టిస్తాను. కాకరపువ్వొత్తులు కూడా నువ్వే కాల్చుకో. ఇలా ఎన్నో జాగ్రత్తలు ప్రతి దీపావళికి అమ్మ చెబుతూనే ఉండే ది. ప్రతి దీపావళికి కొత్త బట్టలు కాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూచక్రాలు పాము బిళ్ళలు మతాబులు ఇవన్నీ నా వాటా. అన్నయ్య కి తారాజువ్వలు టప...