నా పెళ్ళి నా బాధ్యత
నా పెళ్లి -నా బాధ్యత
" ఒరేయ్ రామకృష్ణ ఈ సంబంధమైన ఒప్పుకోరా. అప్పుడే ఉద్యోగంవచ్చి ఐదేళ్లయింది. ఇంకా ఏమిట్రా జుట్టు నె రిసిపోతోంది.గుప్పెడు పొట్ట కూడా వచ్చింది. ఏ పిల్ల నిన్ను చేసుకోవడానికి ముందుకు రాదు అంటూ రామకృష్ణ తల్లి రాజేశ్వరమ్మ గారు చేతిలో ఒక ఫోటో పట్టుకుని రామకృష్ణ కు చూపిస్తూ అడుగుతోంది. లేదమ్మా నా టార్గెట్ ఇంకా పూర్తికా లేదు అంటూ ఏ ఫోటోను చూడడం మానేశాడు. ఆ డబ్బు గొడవ నీకెందుకురా మీ నాన్న చూసుకుంటారు .లేదమ్మా నాన్న రిటైర్ అయిపోయి అంత డబ్బు ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు.
చూడమ్మా ఇదివరలో నేను చాలాసార్లు చెప్పాను. ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయడం అంటే చాలా కష్టం. పూర్వకాలంలో అయితే కట్నాలు తీసుకునేవారు. ఆ కట్నాలతో మగ పిల్లల పెళ్లిళ్లు చేసేవారు.ఇప్పుడు అలా కాదు కాలం మారింది. కట్నాల ప్రసక్తి పోయింది. ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా ఉద్యోగం చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. పైగా బాగా చదువుకున్న వాళ్ళు. ఒక రకం పెళ్ళికొడుకుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇంకా కట్నం ఎవరు ఇస్తారు. మా పిల్ల బోల్డంత సంపాదిస్తోంది . ఇంకా కట్నం ఏమిటి అని అడుగుతున్నారు. కట్నం తీసుకోవడం తప్పే. కానీ ఎప్పటి నుంచో వచ్చిన ఆచారo అది.
మొన్న మా స్నేహితుడికి పెళ్లయింది. ఆ అమ్మాయి కూడా ఉద్యోగస్తురాలే. అందరిలాగే వీళ్లు కూడా కట్నకానుకులేవి వద్దు పెళ్లి బాగా చేయండి అంటూ సంబంధం కుదుర్చుకున్నారు. తీరా వీళ్ళకి చూస్తే బంధు వర్గం చాలా ఎక్కువ. పెళ్లికూతురు విశాఖపట్నంలో ఉంటుంది. వీళ్ళది రాజమండ్రి. వీళ్ళందర్నీ తీసుకుని విశాఖపట్నం వెళ్లాలంటే బోల్డంత ఖర్చు . వీళ్లే కదా పెట్టుకోవాలి పైగా అక్కడ బస ఏర్పాటు చేయాలంటే వాళ్లకు కూడా కష్టమే. ఏమాత్రం తేడా వచ్చినా ఆజన్మాంతం దెప్పుతారు. అందుకని ఆడపిల్ల వారిని పెళ్లి రాజమండ్రిలో చేయమని అడిగారు. తీ రా చూస్తే ఆడపిల్ల వారికి రాజమండ్రిలో ఏమీ తెలియదు. పాపం మా స్నేహితుడు తండ్రి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. శ్రమ అంతా ఆయనదే. పైగా ఆడపిల్ల వారికి పెళ్లి గురించి మర్యాదల గురించి పద్ధతుల గురించి ఏమాత్రం తెలిసినట్లు లేదు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఏమి చెప్పలేదు అనుకుంటా. మగ పెళ్లి వారి కంటే ముందు వాళ్లే భోజనాలు చేసి కూర్చున్నారు.పాపం అన్ని వీళ్ళే తంటాలు పడ్డారు. అదలా ఉంచు మా స్నేహితుడు తండ్రి గారు రిటైర్ అయిపోయారు. పైగా వాళ్ళు బాగా ఉన్నవాళ్లు కూడా కాదు. పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి పెళ్లంటే మాటలా పెళ్లికొచ్చిన బంధువులందరూ సత్యనారాయణ వ్రతం కూడా చూసుకొని వెళ్లారు. ఇంకేముంది వీళ్ళందరికీ రాజమండ్రిలో హోటల్స్ లో గదులు అద్దెకు తీసుకుని బస ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెళ్ళికి రెండు రోజుల ముందు నుంచి పెళ్లయిన తర్వాత నాలుగు రోజులు వరకు క్యాటరింగ్ భోజనాలే.
పైగా పెళ్లి కూతురికి పట్టు చీరలు బంగారు నగలు ఇంకా పెళ్లి ఖర్చులు వచ్చిన బంధువులకి ముఖ్యులకి బట్టలు స్నేహితుడికి గిఫ్ట్లు ఒకటేమిటి ఫంక్షన్ హాల్ రెంటు పాపం ఇవన్నీ మా మా ఫ్రెండ్ బ్యాంకులో అప్పు తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల నాన్నగారు ఏమి పెట్టి స్థితిలోలేరు. బయట అప్పు చేసినా తీర్చలేని స్థితి వాళ్ల నాన్నగారిది. ఇప్పటికే వాళ్ళ అన్నయ్యది అక్కయ్యది కూడా పెళ్లిళ్లు చేసి ఉన్నారు.పైగా మా స్నేహితుల కుటుంబం బాగా మర్యాదస్తులు. ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపించరు. ఇలా ఉన్నాయి మగ పిల్లవాడి పరిస్థితితులు అంటూ ఆవేశంగా చెప్పాడు రామకృష్ణ. అయితే నీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది రాజేశ్వరమ్మ గారు. ఈ ఏడాది తోటి నా రికరింగ్ డిపాజిట్ మెచ్యూర్ అయిపోతుంది. దానికి కొంత బ్యాంకులోను తీసుకుని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ను. లేట్ అయినా పర్వాలేదు. బయట అప్పులు చేస్తే మనం తీర్చలేము. పెళ్లంటే మాటలు కాదు. బయట ధరలు మండిపోతున్నాయి. ఇదివరలో ఆడపిల్లల పెళ్లిళ్లకి మాత్రమే భయపడేవారు. ఇప్పుడు మగపి పిల్లల పెళ్లిళ్లు కూడా భయపడవలసిన రోజులు వచ్చేసాయి. పెళ్లికూతురు ని వెతకడం తోపాటు ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. మగ పిల్లల పెళ్లి జరగవలసిన వయసులో జరగకపోవడం మూలంగా తల్లి తండ్రి అప్పటికి ముసలివాళ్ళు అయిపోతున్నారు అంతే కాదు తండ్రి రిటైర్ అయిపోతారు కదా.
మరి ఈ సమయంలో పెళ్ళికొడుకులే బాధ్యతలు తీసుకోవాలి అని నా అభిప్రాయం. ఇదేమీ లోక విరుద్ధం కాదు. రేపొద్దున నేను ఇల్లు కట్టుకుంటే బ్యాంకు లోన్ తీసుకుంటాను కదా. అలాగే నా పెళ్ళికి కూడా లోను తీసుకుంటాను అని చెప్పాడు రామకృష్ణ.
రాజేశ్వరమ్మ గారు రామకృష్ణ మాటలు విని ఆలోచనలో పడ్డారు. పిల్లలు తల్లిదండ్రుల గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారు అని చాలా ఆనంద పడ్డా రు. నిజానికి ఈ వయసులో బయట అప్పులు చేసి పిల్లల పెళ్లి చేయడం అంటే తల్లిదండ్రులకు చాలా కష్టం. తల్లి తండ్రి ఓపిగ్గా ఉన్నప్పుడు తండ్రి సర్వీస్ లో ఉన్నప్పుడు బాధ్యతలు తీరిపోతే ఏ గొడవ ఉండదు. మరి పిల్లల వయసు మీరితే తల్లిదండ్రులుకి కూడా కష్టమే. రోజులన్నీ అలా ఉన్నాయి. ఏం చేస్తాం అనుకుంటూ రామకృష్ణ వైపు ప్రేమగా చూసారు.
ఈ మాటలన్నీ లోపలి గదిలో నుంచి వింటున్న రామకృష్ణ తండ్రి బయటకు వచ్చి రామకృష్ణ ని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.
తల్లిదండ్రుల గురించి ఆలోచించే పిల్లలు పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి