రక్షాబంధన్

రక్షా బంధన్ 

అమ్మ కడుపుని పంచుకుని నాకంటే ముందుగా పుట్టావు ముందు అడుగు వేసి నాకు మార్గదర్శి అయ్యావు

చిటికెన వేలు అందించి ధైర్యాన్ని ఇచ్చావు
ఎవరు చూపు పడకుండా నా వెనక కొండలా నిలబడ్డావు

ఆటలలో పాటలలో అండగా నిలబడ్డావు
నీ గారం తో నేను పసిపాపనయ్యాను

అన్న అండగా ఉన్నాడని హాయిగా నిద్రపోయాను.
నేను అలిగినప్పుడు నాన్నలా అలకతీర్చావు

అమ్మ కోప్పడినప్పుడు నా కన్నీళ్లు తుడిచావు.
అన్ని వదులుకొని నేను వెళ్లిపోయినా
నాన్న వారసత్వం నిలబెట్టి  

అమ్మా నాన్న లాగా నన్ను ఆదరించే
అన్నకి తమ్ముడికి నా రక్షాబంధన్. 

నేను నీ పక్కనున్నన్నాళ్లు 
నాన్న కొట్టినప్పుడు
అమ్మ కోప్పడినప్పుడు
పెద్ద ఆరిందవలె అడ్డుకునేదాన్ని.
కన్నీళ్లు తుడిచే దాన్ని 
అమ్మ తాయిలం పెట్టినప్పుడు 
రెండు చేతులు చాపే దాన్ని.

నేను ఇప్పుడు అమ్మని అయిపోయా 
ఎల్లవేళలా నిన్ను కాపాడడానికి ఈ రక్షా కంకణం. 
అది నీకు శ్రీరామరక్ష.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట