స్పూర్తి దీపావళి
స్ఫూర్తి దీపావళి దీపావళి అంటే కేవలం దీపాల పండుగ కాదు, అది మనసులను వెలిగించే స్ఫూర్తి పండుగ. ప్రతి సంవత్సరం చీకటిని తొలగించి వెలుగు తెచ్చే ఈ పర్వదినం మన జీవితంలో కూడా అజ్ఞానం, అసూయ, ద్వేషం వంటి చీకట్లను తొలగించమని గుర్తు చేస్తుంది. మన ఇంటి ముందు వెలిగించే చిన్న దీపం మన హృదయంలోని వెలుగుకు చిహ్నం. ప్రతి దీపం ఒక స్ఫూర్తి —భౌతికంగా మనకు కనిపించే దీపం వెలుగులు పంచుతుంది కానీ మనలోని అజ్ఞానం తొలగించుకోవడానికి జ్ఞాన దీపం నిజాయితీగా జీవించడానికి ధర్మ దీపం ఇతరుల పట్ల ప్రేమ కారుణ్యం పెంచుకోవడానికి ప్రేమ దీపం, కారుణ్య దీపం వెలుగులు ప్రసరించేలా ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైన మానవత్వం మనలో మేల్కొంటుంది. దీపావళి పండుగ మనం కేవలం ఇంటిని శుభ్రం చేయడమే కాకుండా, మన మనసును కూడా శుభ్రం చేసుకోవాలని నేర్పుతుంది. ఈ దీపావళి మన జీవితంలో కొత్త ఆశలు, సత్సంకల్పాలు, వెలుగైన ఆలోచనలను నింపాలి. “మనసులో వెలిగిన దీపమే నిజమైన స్ఫూర్తి దీపావళి.” దీపావళి అంటే వెలుగుల పండుగ. ఆ వెలుగులతో పాటు బాణసంచా కూడా దీపావళి ఉత్సవంలో భాగం. పిల్లలు, పెద్దలు అందరూ ఆకాశం వైపు చూసి ఆనందంతో నవ్వుతారు. కానీ ఈ బాణసంచాలో కూడా మనకు ...