నలుపు నాణ్యమే
నలుపు – నాణ్యమే మనిషి నయనాలు పసిగట్టి చూసేది రంగుల ప్రపంచం. ఆ రంగుల్లో నలుపు అంటే చాలామందికి భయం, తిరస్కార భావన కలిగించే ఒక నీడలా అనిపిస్తుంది. కానీ ఆ నలుపు అంత తేలికైనది కాదు. అది ఒక జీవిత దర్శనం, ఒక గంభీరమైన సందేశం. సప్తవర్ణాలు దేవుని సృష్టి. అందులో నలుపు కూడా ఒకటి. కానీ మిగిలిన రంగులకంటే నల్ల రంగుపై వ్యతిరేక భావన ఎక్కువ. ఎందుకంటే అది చీకటిని గుర్తు చేస్తుంది. కానీ అదే నలుపు చల్లని మేఘంగా మారి చినుకులుగా జలధారలు కురిపించగలదు. భూమిని పచ్చగా మార్చే మొదటి అంకురం నలుపే. విద్యా బోర్డు - నలుపే; జ్ఞానం - వెలుగు పాఠశాల బోర్డు నలుపే. కానీ దానిపై రాసే తెలుపు అక్షరాలే విద్యార్థుల జీవితానికి దారిదీపాలు. నల్ల బోర్డుపై తెల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించడమే కాదు, వాటి ప్రాముఖ్యతను కూడా నలుపే అందిస్తుంది. అది శిక్షణకు మార్గదర్శి. ఆరోగ్యానికి, అందానికి కూడా నలుపు అవసరం నల్ల నేరేడు, నల్ల ముళ్లి వంటి పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనతను నివారించడంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. కళ్లకు మెరుపు ఇచ్చే నల్లటి కాటుక ఆత్మవిశ్వాసానికి చిహ్నం. బొట్టు, చుక్కలుగా పెళ్లికూతురి ముస్తాబులోనూ నలుపు కీలకం. భ...