పోస్ట్‌లు

వనభోజనం

ఆదివారం ఉదయం ఆరు గంటలు అయింది. నగరం ఇంకా నిద్ర లేవలేదు. నగర సరిహద్దుల్లో అందమైన తారు రోడ్డు మీద బస్సు దూసుకుపోతోంది. బస్సు అంతా కోలాహలంగా ఉంది. మంచం మీదనుంచి లేవగానే కాఫీ కప్పు పట్టుకునే నరసింహ శాస్త్రి కాలు గాలిని పిల్లిలా బస్సు అంతా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా గంటకు గాని కాఫీ కప్పు చేతిలోకి రాదు. పోనీ ఎక్కడైనా ఆగి కాఫీ తాగుదామంటే నిన్న సాయంకాలం కమ్యూనిటీ మీటింగ్లో రామశాస్త్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేయ్. “రేపు ఉదయం ఏమీ బయట వస్తువులు తినడానికి వీల్లేదు. అన్నీ మనం స్వయంగా తయారు చేసుకునే ఉదయం కాఫీ దగ్గర నుంచి మధ్యాహ్నం ఫలహారం వరకు. లేదంటే వనభోజనాలనే మాటకు అర్థం లేదు. సాధారణంగా వనభోజనాలంటే బయట హోటల్ కి ఆర్డర్లు ఇచ్చేసి ఎంజాయ్ చేయడం కాదు. మనకు మనమే స్వయంగా తోటలో వండుకుని పదిమందితో హాయిగా చెట్లు కింద అరిటాకులు వేసుకుని తింటే ఆ ఆనందమే వేరు. ఏడాదికి ఒకసారి కదా! అలా చేస్తే ఎంతో తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది,” అన్నాడు రామశాస్త్రి. అనుకున్న విధంగా ఉదయం ఐదు గంటలకి పెద్ద బస్సు మా కాలనీ పార్కు దగ్గరికి వచ్చి ఆగింది. మగవాళ్లంతా వంట సామాన్లు, ఆట సామాన్లు, స్పీకర్లు, తాటాకు చాపలు,...

కార్తీక్

"చూడండి, ఈ బాబు మానసికంగా ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. దీనికి ఏమి వైద్యం లేదు. అందుకే ఈ వయసులో రావలసిన ఆటపాట ఆలస్యంగా వస్తున్నాయి. కానీ శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నాడు" అంటూ పిల్లల వైద్యుడు చెప్పిన మాటలకి పిల్లవాడు కార్తీక్ తల్లి రాధ బుర్ర తిరిగిపోయింది. తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఏమి వినపడలేదు. ఆటోలో ఇంటికి వచ్చేసి మంచం మీద పడుకుని ఆలోచనలలో మునిగిపోయింది. పుట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు! అందాల చందమామలా ఉన్నాడు. కార్తీక పౌర్ణమి నాడు పుట్టాడు. అందుకే పున్నమి చంద్రుడిలా ఉండేవాడు. గిరజాల జుట్టు, తెల్లటి రంగు, పొడవైన వేళ్లు, కాళ్లు, చేతులు – అబ్బా! తలుచుకుంటేనే ముద్దొచ్చేలా ఉండేవాడు. పుట్టి ఏడాది పైగా అయినా ఆ వయసు వాళ్లకు ఉండవలసిన లక్షణాలు లేకపోవడంతో డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్లింది రాధ. అప్పుడు తెలిసిన నిజం! రాధ అత్తగారు రోజు సాధిస్తూనే ఉంది. “పిల్లవాడు ఏమిటి ఇలా ఉన్నాడు? ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పిల్లలు మా ఇంట్లో పుట్టలేదు” అంటూ గోల చేసేది. పాపం రాధ ఏమి కనిపెట్టుకోలేకపోయింది. కానీ అనుభవంతో అత్తగారు కనిపెట్టింది. “ఇప్పుడు ఏమంటుందో ఏమో... భర్త ఈ విషయం ఏ విధంగా తీసుకుంటాడో?”...

రావిచెట్టు

"ఏవండీ అప్పారావు గారు, రేపు ఉదయం ఈ రావి చెట్టు కొట్టడం ప్రారంభించాలి. ఇంత పెద్ద చెట్టు కొట్టాలంటే కనీసం పది మంది కూలీలు, నాలుగు రోజులు సమయం పడుతుంది. దానికి తగిన ఏర్పాట్లు చూడండి" అంటూ ఆ అధికారి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి కార్ ఎక్కి బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. "సార్, ఈ చెట్టు కొట్టడం లేబర్ వల్ల సాధ్యం కాదు. పట్నం నుంచి కోత మిషన్ తెప్పించాలి. ముందు కొమ్మలు నరికేసిన తర్వాత చెట్టు మొదలు కోత మిషన్ చేత కోయించాలి. పైగా దీని చుట్టూ సిమెంట్ దిమ్మ కూడా ఉంది. ఈ దిమ్మ పడ కొట్టాలంటే బుల్డోజర్ కూడా కావాలి" అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు మేస్త్రి అప్పారావు. "ఎలాగూ లేదన్న పదిహేను రోజులు టైం పడుతుంది అండి" అంటూ చెట్టు పైకి పరిశీలనగా చూశాడు అప్పారావు. "సరే" అంటూ అధికారి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అబ్బా! ఎంత పెద్ద చెట్టు! పెద్ద పెద్ద కొమ్మలు, నిండా ఆకులు – ఒక రాక్షసుడు లా ఉంది. ఈ గ్రామానికి సరిపడే ఆక్సిజన్ ఇదే సరఫరా చేస్తుందేమో. గాలికి అటు ఇటు ఊగే ఆకులు ఎప్పుడు పెద్ద శబ్దం చేస్తూ ఉంటాయి. దీని వయసు సుమారు వంద సంవత్సరాలు పైగా ఉంటుంది. ఎవరూ నాటారో మహానుభావ...