పోస్ట్‌లు

ఓహో పావురమా

అది నిజంగా భాగ్యనగరమే. ఆ రాజ్యానికి పట్టపురాణి మీద ప్రేమతో అందంగా నిర్మించబడిన ఆ నగరం, నాలుగు దిక్కులలో ఉన్న పల్లెలను కలుపుకుని సువిశాల నగరంగా మారింది.  పరిశ్రమలకు, కర్మాగారాలకు ఆశ్రయమిచ్చి కాలుష్యం మాట దేవుడెరుగు. పొట్టచేత పట్టుకుని, పట్టాపుచ్చుకుని పట్నం చేరిన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కార్పొరేట్ ఆఫీసుల్లో ఆశ్రయం ఇచ్చి కడుపు నింపే ఆ నగరం నిజంగా అక్షయపాత్ర. రోజురోజుకీ నగరం పెరిగిపోతోంది. ఎర్రబస్సు ఎక్కి పట్నం చేరే జనాల సంగతి చెప్పక్కర్లేదు. “కనీస అవసరాలు నేను కల్పించలేను బాబోయ్, అయినా సరే కర్మాగారం పక్కనైనా ఉంటాం” అని బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు, డూప్లెక్స్ హౌసులు కట్టుకుని కాలక్షేపం చేసే జనమెంతో. “మాకు గుండెల్లో ధైర్యం ఉంది, జేబులో డబ్బుంది, ఒంట్లో ఓపిక ఉంది. కూతవేటు దూరంలో కూత వేసే మెట్రోరైలు ఉంది” అంటూ, ఇంటి దగ్గరనుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకైనా వెళ్లి వస్తామని దూరదూరంగా వెళ్లిపోయి, చెయ్యి చాస్తే ఆకాశం అందే బహుళ అంతస్తుల భవనాల్లో కాపురం చేస్తున్నారు. మీట నొక్కితే పైకి మోసుకుపోయే యంత్రం ఉంది. “మాకు ఏమి భయం!” అంటూ ఆ అంతస్తుల్లో కాపురం చేస్తున్నారు. “కోటి రూపాయలైనా పర...

పూర్వాశ్రమ తల్లి

 పూర్వాశ్రమ తల్లి "ఏమండీ! మన కోడలు సీతమ్మ ప్రతిరోజు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటోంది. రెండు మూడు సార్లు పిలిస్తే గాని పలకటం లేదు. అలా వెర్రిదాని లాగా ఆలోచిస్తూ ఉండిపోతోంది. ఏమిటో దాన్ని చూస్తే భయంగా ఉంది," అంది కామాక్షమ్మ తన భర్త రామారావుతో కోడలు గురించి చెబుతూ. "ఎలా ఉంటుంది చెట్టంత కొడుకు విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకుడై పిల్లాపాపలతో సంతోషంగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఎంతమందికి వస్తుంది అంతటి అదృష్టం! ఇంజనీరు కానీ డాక్టర్ కానీ చదివిద్దాం అనుకున్నాం, కానీ వాడు వేద విద్య నేర్చుకుంటానన్నాడు. సరే అన్నాము. వేద పండితుడై మనకు దగ్గరగా ఉంటాడు అనుకున్నాం. కానీ దైవానుగ్రహం వేరే విధంగా ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడే సంస్థకి అధిపతిగా నిలబెడుతోంది. వచ్చే నెలలోనే సన్యాసాశ్రమ దీక్ష ప్రారంభానికి ముహూర్తం పెట్టారు. అదే సీతమ్మ దిగులు," అన్నాడు సీతమ్మ మావగారు రామారావు. అనంతశర్మ తండ్రి చిన్నప్పుడే చనిపోతే, కోడల్ని మనవడిని తన దగ్గరే ఉంచుకుని చూస్తుంటాడు రామారావు. ఇదంతా దూరం నుంచి వింటున్న సీతమ్మకి ఒక్కసారి గత సంవత్సరం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఉన్నట్టుండి ఆ...

రెక్కల అతిథులు

ఉదయం లేస్తూనే చెప్పాడు మా అబ్బాయి అవినాష్ — ఇవాళ అతిధులను తీసుకురాడానికి వెళ్లాలని. “ఎవర్రా?” అని అడిగితే “సస్పెన్స్” అంటూ మాట దాటేశాడు. “రైల్వే స్టేషన్? బస్టాండ్?” కా అని అడిగితే మౌనంగా ఉండిపోయాడు, నవ్వుతూ. వీడి సస్పెన్స్ బంగారం గాను! అయినా ఈరోజుల్లో ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చే అతిధులు ఎవరు అబ్బా అనుకుంటూ ఎదురు చూడడం మొదలుపెట్టాం. “వాళ్లు భోజనానికి వస్తారా? టిఫిన్లు పెట్టాలా? ఏంట్రా విషయం?” అంటూ వాళ్ళ అమ్మ పదేపదే అడగడం మొదలెట్టింది. మా అబ్బాయి మొహంలో చిరునవ్వు తప్ప సమాధానం లేదు. “పోనీలే, వాడు చెప్పకపోతే చెప్పకపోయాడు, నేను ఇల్లు సర్దుకుని రెడీగా ఉంటాను,” అంటూ చిందరవందరగా ఉన్న సామాన్లన్నీ సరిగ్గా సెట్ చేసి, స్నానం చేసి, బట్టలు మార్చుకుని రెడీగా కూర్చుంది వాళ్ళ అమ్మ.  మా అబ్బాయి మటుకు ఏమి కంగారు పడకుండా — చుట్టాలే ఎన్ని గంటలకు వస్తారో చెప్పడు, తాను ఎప్పుడు తీసుకువస్తాడో కూడా చెప్పడు. ఏమి చెప్పకుండా మామూలుగా పని చేసుకుంటూ కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ వరుసగా పూర్తి చేసి, నిదానంగా సాయంకాలం ఐదు గంటలకి బండి తీసుకుని బయటికి వెళ్లిపోయాడు. రాబోయే చుట్టాల కోసం మళ్లీ రెండోసారి ఇల్లు సర్ది, డైనింగ్...