పోస్ట్‌లు

మనసే మందారమైన వేళ

శీర్షిక: మనసే మందారమైన వేళ మనిషిని నడిపించే యంత్రం మనసు మనసే కదా మనిషికి మంచి మిత్రుడు మనసును మించిన శత్రువు కానరాడు. రహదారిలో నడిపించేది మనసు గోదావరిలో ముంచేసేది మనసే. మనసు కోరితే తూచా తప్పకుండా  అమలు చేసేది తనువు. మనిషి చేసే కర్మలకి మనసే కదా మూలం. స్పందించే హృదయం ఉంటే మనసున్న వాడని నామకరణం దయగల ప్రభువులని బిరుదులతో సత్కారం. కోరికలతో దహించుకపోయేది మనసు  కొండమీద కోతి కోసం  పడరాని పాట్లు పడుతుంది తనువు. అందని ద్రాక్ష కోసం అసువులు అర్పిస్తుంది మనసులోనే ఉంది మహత్యం. ఆందోళనకు లొంగని మనసుంటేనే ఆరోగ్యం. మనసే మందారమైన వేళ. తనువు ఆనంద నృత్యం చేస్తుంది. సత్కర్మల వైపు పరుగులు తీస్తుంది. గువ్వలా ఎగిరిపోవాలనిపిస్తుంది మనసే కదా మనిషిని నడిపించే యంత్రం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

గోరింటాకు

గోరింటాకు – ఒక సంస్కృతిక చిహ్నం భారతీయ సంస్కృతిలో అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో గోరింటాకు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది కేవలం ఒక ఆకుతో చర్మాన్ని అలంకరించుకోవడమే కాదు – ఒక అభిమానం, ఒక భావోద్వేగం, ఒక శాశ్వత సాంప్రదాయం. గోరింటాకు అంటే ఏమిటి? గోరింటాకు (Henna) అనేది Lawsonia inermis అనే ఔషధ మొక్క. దీని ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ రూపంలో చేతులకు, కాళ్లకు పూస్తారు. కొన్ని గంటల తరువాత అది వదిలే రంగు గోధుమలో నుంచి ఎరుపు గరిష్టంగా మారుతుంది. ఆ రంగే ఆడపిల్లల ఆనందానికి సంకేతం. పెళ్లిళ్లలో గోరింటాకు ప్రాధాన్యం తెలుగు వివాహ సాంప్రదాయంలో పెళ్లికి ముందు రోజు గోరింటాకు వేయడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం. పెళ్లికూతురికి, ఆమె స్నేహితులకు, కుటుంబ మహిళలందరికీ గోరింటాకు వేయడం ఆనందంగా జరుగుతుంది. ఇది భవిష్యత్తు కుటుంబ జీవితానికి శుభప్రదంగా ఉంటుంది అనే నమ్మకంతో చేయబడుతుంది. గోరింటాకు వేయడం వెనుక భావన గోరింటాకు వేయడం వెనుక శరీర ఆరోగ్యానికీ సంబంధం ఉంది. ఇది చర్మానికి చల్లదనం ఇస్తుంది. మానసికంగా ఓ శాంతిని కలిగిస్తుంది. అలాగే పెళ్లి సమయంలో జరిగే శ్రమ, ఉత్సాహపు ఉబ్బరాన్ని తలచినప్పుడు, గోరి...

అరవై ఏళ్లకు పెళ్లి

 అరవై ఏళ్లకి పెళ్లి మావయ్య గారు పంచకట్టుకోవడం అయిందా! అని అడిగింది అరవైఏళ్ల పరమేశ్వరరావుని హాలు లోంచి కోడలు సుజాత.  "మీకు పంచికట్టుకోవడం అయితే నేను వచ్చి నుదుట నామం, కళ్ళకి కాటుక బుగ్గన చుక్క పెడతాను అoది సుజాత. అలాగేనమ్మా అన్నాడు! పరమేశ్వరరావు. ఇంతలో పరమేశ్వరావుకి కూతురు రమ్య గొంతు గట్టిగా వినిపించింది మేడ మీద నుంచి. " అమ్మ తయారయ్యావా! పంతులుగారు పిలుస్తున్నారు అని అంది రమ్య. అయిపోయిందమ్మా! అని సమాధానం ఇచ్చింది పరమేశ్వర రావు భార్య రాధిక. ఎంత బాగున్నావ్ అమ్మ పెళ్లి కూతురు ముస్తాబులో నా దిష్టి తగిలేలా ఉంది అని తల్లిని చూస్తూ రమ్య. పద పద అంటూ తల్లి చెయ్యిని పట్టుకుని మేడ దిగి వస్తుంటే నిజంగానే సుజాత కొత్త పెళ్ళికూతురు అనిపించింది హాల్లో ఉన్న బంధువులకి స్నేహితులకి. అందమైన చిలకాకుపచ్చ ఎర్ర అంచు బోర్డర్ ఉన్న పట్టుచీర, రంగు వేసిన జుట్టు, కాళ్ళకి చేతులకి గోరింటాకు, నుదుటన పెళ్లి బొట్టు, కళ్ళకి కాటుక బుగ్గన చుక్క జడలో మల్లెపూలు ఇది యాభై ఎనిమిది ఏళ్ల పెళ్లి కూతురు అలంకరణ.  పెళ్లికూతురు ఆ పక్క ఈ పక్క రాధిక కూతురు సుమ , సుమ భర్త సుధాకర్ కూర్చుని ఉన్నారు. పెళ్లికూతురు తల్లిదండ...