పట్టుదల
పట్టుదల " అమ్మాా నేను వచ్చే వారమే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి! అంటూ చేతిలో కాగితం పట్టుకుని చక్రాల కుర్చీ తోసుకుంటూ వచ్చి ఆ చల్లటి వార్త చెప్పిన సుధాకర్ ని తల్లి పార్వతమ్మ చేతిలో ఉన్న పని వదిలేసి వచ్చి గట్టిగా కౌగిలించుకునికన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్ళకి నీ కష్టం తీరుతో oది రా చాలా సంతోషo అంటూ ఎక్కడ జాయిన్ అవ్వాలి రా అని అడిగింది. హైదరాబాదులో పోస్టింగ్ ఇచ్చారు అంటూ సమాధానం చెప్పాడు సుధాకర్. దేవుడు ఒకదాంట్లో చిన్న చూపు చూసిన నీకు ఒక దారి చూపించాడు అంటూ సంతోషంతో దేవుడికి దండం పెట్టుకుంది. సుధాకర్ పార్వతమ్మ గారికి ఆరో సంతానం. పార్వతమ్మ గారి పిల్లలందరూ తెల్లగా బలంగా ఎత్తుగా ఉండేవారు . అంతా తండ్రి పోలిక. అందరిలాగే పుట్టిన సుధాకర్ ఐదేళ్ళు వచ్చేవరకు బాగానే ఉన్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం వచ్చి కాళ్లు చేతులు కదపలేకపోయాడు. సుధాకర్ తండ్రి రామారావు గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. పిల్లవాడి నాడి పరీక్షించి చూసి వాతం కమ్మిందని అనుకుని వైద్యం మొదలుపెట్టారు. అప్పటినుంచి సుధాకర్ కి అన్నీ మంచం మీదే. బిడ్డనీ అలా మంచం మీద చూసి వీడి భవిష్యత్తు ఎలాగని రోజు దిగులు పడుతుండేది ...