ఊపిరి లేని బొమ్మ
ఊపిరి లేని బొమ్మ
ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరు వదిలి రానంది అమ్మ
ఊపిరాగి బొమ్మై కూర్చుంది నా బీరువాలో.
బొమ్మ చూసినప్పుడల్లా అమ్మ నాతోనే ఉంది
అన్న తృప్తి .
అమ్మకైనా బొమ్మకైనా బిడ్డ ఆనందమే సంతృప్తి.
బాల్యంలో అమ్మే నాకు సర్వస్వం
బొమ్మైన అమ్మ నాకు దైవంతో సమానం.
బ్రతికున్నన్నాళ్లుఅమ్మకి లేదు క్షణం విరామం.
నిత్యం బిడ్డల కోసమే పడేది తాపత్రయం.
బొమ్మైన తర్వాత ఆమెకు లేదు అనుభవించే యోగం.
ఊపిరి ఉన్న బొమ్మను తయారు చేసేది ఆ పరబ్రహ్మ
పది తరాలకు చూపించడానికి బొమ్మను
తయారు చేసే యంత్రం సృష్టించాడు ఈ అపరబ్రహ్మ.
మట్టిలో మట్టి గాలిలో గాలి కలిసిపోయిన
తాత గారి బొమ్మ లేకపోయినప్పుడు తెలిసింది
నాకు ఆ బొమ్మ విలువ.
సెకనుకో బొమ్మ సృష్టించే యువతరాన్ని
అభినందిద్దాం మనమందరం.
రచన. మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి