అడవిలో మెరిసిన పద్మం
అడవిలో మెరిసిన పద్మం. " ఈ అడవిలో ఈ* తార*ని ఎక్కడని వెతికి పట్టుకోవాలి? తారలo టే నక్షత్రాలు అవి ఆ ఆకాశంలో ఉంటాయి. మరి ఈ తార నక్షత్రము కాదు సినిమా తార కాదు. మరి అడవుల్లో నివసించే ఒక సాధారణ గిరిజన స్త్రీ ఈ ఫోటో ఒక్కటే ఆధారం. ఏదో నర్సరీలో పని చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఆడవికి దగ్గరగా ఉండే గ్రామ సచివాలయంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందమో చూద్దాం అనుకుంటూ సచివాలయంలోకి అడుగు పెట్టాడు ఆ మండల ఎమ్మార్వో . సాధారణంగా ఏదైనా శవ పంచాయితీ కోసం వచ్చే ఎమ్మార్వో గారు ఏమిటి ఇలా కబురు కాకరకాయ లేకుండా వచ్చేసారని కంగారు పడుతూ ఆ విలేజ్ సెక్రటరీ అసలు విషయం విన్న తర్వాత నవ్వుకుని ఆ పక్కన ఉన్న అడవి దగ్గర ఉన్న నర్సరీ దగ్గరికి ఎమ్మార్వో గారిని తీసుకుని బయలుదేరాడు. ఎమ్మార్వో ని వచ్చారని తెలిసి ఆ నర్సరీ అధికారి పరుగున వచ్చాడు. విలేజ్ సెక్రటరీ చేతిలో ఉన్న ఫోటోలు చూసి దూరంగా పనిచేస్తున్న తారని పిలిపించాడు . తీరా ఆ తారను చూసేటప్పటికి ఎమ్మార్వో కి, విలేజ్ సెక్రటరీ కి మతిపోయింది. ఎక్కడో అడవుల్లో సాధారణంగా బతికే ఒక గిరిజన స్త్రీ. ఒంటినిండా బట్టలు కానీ ,కాళ్లకు చెప్పులు కానీ లేవు. ఆ భాష పూర్తిగ...