పోస్ట్‌లు

మానవత్వం

చెయ్యి అందిస్తే  కొన్ని కాళ్లు ఎవరెస్టు శిఖరం  అవలీలగా ఎక్కేస్తాయి.  భుజం మీద చెయ్యి వేస్తే  నిండుగా ఉన్న గుండె  దూదిపింజలా తేలిపోతుంది.  కళ్ళలోకి సూటిగా చూస్తే  గుండెలోని దిగులు కనబడుతుంది  డొక్క మాడుతోoదని తెలుస్తుంది. జేబు నిండుగా ఉంటే  మాట హుషారుగా ఉంటుంది  ఒక్క మాట తోడైతే అనాథల మనసు ఆశలతో నిండిపోతుంది. ఒక్క చిరునవ్వు వేడిగా ఉన్న హృదయానికి వేసవి జల్లుగా అనిపిస్తుంది. తల తాకితే తల్లి స్పర్శలా బరువు జీవితమే తేలికైపోతుంది. ఆపితే వినడానికి ఆకులాంటి మనసు వేసవి గాలిలా ఊదిపోతుంది. చూపు తిప్పితే ఒంటరితనపు నిశ్శబ్దం చిలికిన శబ్దమై మారిపోతుంది. అన్నీ తెలిసిన మానవుడు  చూపుదిప్పకుండా చూస్తూ ఉండిపోతే  మానవత్వం అర్థం మారిపోతుంది. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

తోటలో పెళ్లి

మధ్యాహ్నం మూడు గంటలు అయింది.  గదిలో మంచం మీద పడుకున్న ఊర్మిళ కి "పోస్ట్ "అనే కేక వినపడింది. ఉత్తరాలు రాయడం తగ్గిపోయిన ఈ రోజుల్లో ఊర్మిళ ఆ కేక కొత్తగా వినపడింది. వెంటనే లేచి వీధిలోకి వచ్చేటప్పటికి పోస్ట్ మాన్ ఏదో ఒక శుభలేఖ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.  అసలే వైశాఖమాసం పెళ్ళిలో ముహూర్తాలన్నీ ఈ నెలలోనే. ఎవరిది అబ్బా! ఈ శుభలేఖ అనుకుని ఫ్రమ్ అడ్రస్ చూస్తే భర్త రామారావు ఫ్రెండ్ రాజిరెడ్డి అయినవిల్లి నుంచి పంపించిన శుభలేఖ.  శుభలేఖ తెరిచి చూసిన వెంటనే చాలా ఆశ్చర్యం అనిపించింది ఊర్మిళకి. "తోటలో పెళ్లికి ఆహ్వానం" అని రాశారు హెడ్డింగ్. వరుడు పేరు, వధువు పేరు, ముహూర్త సమయం, తేదీ అన్ని మామూలే క్రింద మటుకు ఆహ్వానించే వాళ్ళ పేర్లు ఉన్నాయి.  రాజిరెడ్డి ఆ ఊర్లో బాగా మోతుబరి రైతు. కొబ్బరి తోటలో వరి పొలాలు బాగా ఉన్నవాడు. పైగా సొంత వ్యవసాయమే చేస్తాడు. ఎన్నోసార్లు వాళ్ల ఊరు రమ్మని చెప్పిన వెళ్లడమే కుదరలేదు రామారావు దంపతులకు. ఈసారి తప్పకుండా పెళ్లికి వెళ్లాలి. అందులో తోటలో పెళ్లి అంటున్నారు అనుకుంది ఊర్మిళ.  భర్త ఆఫీస్ నుంచి రాగానే శుభలేఖ చేతిలో పెట్టి "చూడండి శుభలేఖ ఎంత బయట అందంగా...

తల్లి

చిత్రం
ఆ తల్లి ఒడి బిడ్డకి  హంస తూలికాతల్పం  ఆ చిన్ని గొంతు తడిపే రసధార  పంచభక్ష్య పరమాన్నం.  రాగాలు లేని జోల పాట  ఆనంద సంగీతం.  ఆదరించే అమ్మ చేతులు  వాడికి అభయం. శిశిరంలో అమ్మవడి  నులివెచ్చని కొలిమి  మండుటెండలో అది  మంచు కురిసే హిమగిరి  గొంతు దాటి రాని మాటకి  అమ్మ ఆనందపు శ్రోత. ఒడిలో చేసే కసరత్తుకి  ఆమె ఒక మార్గదర్శి.  తడబడే అడుగులకి  ఆసరా ఇచ్చే తరువు తేనె పలుకులు నేర్పించే     వాగ్దేవి.  తనువులు రెండు అయినా  తలపులు అన్ని అమ్మవే  బిడ్డ తలాడించే బొమ్మ  ఆజ్ఞలు ఇచ్చేది అమ్మ తల్లిగా పుట్టడం వరమైతే  బాధ్యతతో మెలగడం  బిడ్డ జన్మ సార్ధకం .  రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279