పోస్ట్‌లు

ఆ నాలుగు చుక్కలు

ఇంకా కాంతమ్మ రాలేదు ఏమిటి ? రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చేసేదే! ఏమైంది అబ్బా అనుకుంటూ మాటిమాటికీ వీధిలోకి తొంగి చూస్తున్న సుజాతకి వాడిపోయిన మొహంతో దూరం నుంచి వస్తున్న కాంతమ్మ కనబడింది.  సుజాతను చూస్తూనే రాత్రి మా చంటోడు నిద్రపోలేదు తెల్లవార్లు పీకుతూనే ఉన్నాడు. నా దగ్గర పాలు లేవని తెలుసు. పోత పాలు పడుతుంటే విరోచనాలు అవుతున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కాంతమ్మ.  భగవంతుడు సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. కాంతమ్మ కొడుకు కంట సుజాత కొడుకు రెండు నెలల పెద్ద. సుజాత కొడుకు రెండు గుక్కలు తాగి పక్కకు తిరిగి పడుకుంటాడు. ఒకపక్క అతివృష్టి మరొకపక్క అనావృష్టి. ఇద్దరినీ సృష్టించింది దేవుడే. అయినా ఎవరి అదృష్టం వారిది. విజ్ఞాన శాస్త్రం ఎంత బాగా అభివృద్ధి చెందిన తల్లిపాలు మించిన బిడ్డకి ఏ ఆహారము లేదంటారు డాక్టర్లు. తల్లిదగ్గర పాలు లేక కొన్ని కుటుంబాలు బాధపడుతుంటే ఉన్న పాలు బిడ్డకు పంచి ఇవ్వడానికి అందం చెడిపోతుందని ఉద్దేశంతో కొంతమంది కావాలని పోత పాలు అలవాటు చేస్తున్నారు కొంతమంది తల్లులు. కాంతమ్మ మాటలు వినేసరికి ఒక బిడ్డకు తల్లిగా సుజాత హృదయం చలించిపోయింది. ఆ చిన్ని బొజ్జ కి తల్లి ఇచ్చే నాలుగు చుక...

శ్మశానం

నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం. ఈ స్మశాన స్థల...

దసరా

మానవ జీవితానికి పండుగలు అంటే ఒక వరం. స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే రోజు పండుగ రోజు. ఒత్తిడితో నలిగిపోతున్న మానవ జీవితం ఆ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతుంది. అన్ని మతాల వారు ఈ పండుగలు జరుపుకుంటారు. ఎవరి మతానుసారం వారికి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ముస్లిం మతస్తులకి రంజాన్ ప్రత్యేకమైన పండగ. అలాగే క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదినం అయిన క్రిస్మస్ ఒక పండుగ. హిందూమతస్తులకి ఉగాది మొదలు ప్రతినెలా ఏదో ఒక పండగ జరుపుకుంటారు. ఇది కాకుండా అమ్మవారి జాతరలు కూడా ఒక పండగలా చేసుకుంటారు. మొన్నటి వరకు గణేష్ నిమజ్జోత్సవాలు ఆనందంగా జరుపుకున్నాము. ఇక దసరా ఉత్సవాల సందడి మొదలైంది. మార్కెట్లో దసరా తగ్గింపు ధరల హోరు ప్రారంభమైంది. ప్రయాణాల సందడి మొదలైంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. దీన్నే దసరా పండుగ అంటారు. శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరదృతువులో వచ్చే పండుగ దసరా. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తేవాడు. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి త్రిమూర్తులు సృష్టించిన శక్తి స్వరూపం దుర్గామాత. శివుడు ను...