పోస్ట్‌లు

నిజ స్వరూపం

నిజ స్వరూపం  సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. రామారావు గారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో భార్య టీ కప్పు చేత పట్టుకుని భర్తకు ఇచ్చి ఎదురుగుండా కుర్చీలో కూర్చుంది. ఏవండి ఇవాళ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి . మన రాధ ఎవర్నో ఇష్టపడిందట. అబ్బాయి మధు కూడా అదే ఆఫీసులో పని చేస్తున్నాడుట. ఇద్దరికీ మూడు సంవత్సరాల నుంచి పరిచయం. రాధ గురించి పూర్తి వివరాలు అతనికి తెలుసు. మధ్యలో ఆరోగ్యం బాగా లేకపోతే తనే హాస్పిటల్ తీసుకెళ్తుంటాడట. అబ్బాయి ఫోటో కూడా పంపించింది. అబ్బాయి కూడా మాట్లాడాడు. తనకి తండ్రి లేడని తల్లితో కలిసి ఉంటున్నాడని తన చెల్లెలికి పెళ్లి చేసి పంపించేసారని వివరాలు చెప్పాడు. ఇద్దరిదీ సమానమైన ఉద్యోగం. సమానమైన చదువు సమానమైన జీతం. ఈడు జోడు బాగానే ఉంది. కానీ వాళ్లు మన కులం కాదు ధైర్యంగా చెప్పాల్సిన మాటలు చెప్పేసింది రామారావు గారి భార్య లలిత. భార్య మాటలు విన్న తర్వాత రామారావు గారు ఆలోచనలలో పడ్డారు. తర్వాత భార్య చెప్పిన మాటలు తలకెక్కలేదు. రామారావు గారిది శుద్ధ చాందస భావాలు గల బ్రాహ్మణ కుటుంబo. రోజు గాయత్రి మంత్రం జపం చేస్తే గాని రామారావు గారు పచ్చి మంచిన...

గుఱ్ఱం బండి

గుర్రం బండి "అమ్మా రేవు దగ్గరికి బండి వెడుతోంది వస్తారా అంటూ చేతిలో చెర్నాకోలు పట్టుకొని తలకి తలపాగా చుట్టుకుని ఒంటిమీద బనియన్ తొడుక్కుని నిక్కర్ వేసుకుని ఒకమనిషిచాలామందికి తారసపడి ఉంటాడు. దూరంగా ఒక మూల గుర్రపు బండి కళ్ళకి గంతలు కట్టుకుని పచ్చగడ్డి తింటూ నిలబడి ఉన్న నాలుగు కాళ్ల జంతువు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు మన చిన్నతనంలో మనం చూసే ఉంటాము. ఆ రోజుల్లో అది అతి ముఖ్యమైన ప్రయాణ సాధనము. మానవుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణించాలంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు తక్కువగా ఉండేవి. ఒకటి సైకిలు ఎడ్ల బండి గుర్రపు బండి రిక్షా. కాలక్రమేణా సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఆటోలు బస్సులు కార్లు మోటార్ సైకిల్ వచ్చి ఈ గుర్రపు బండి రిక్షా ఎడ్ల బండి సైకిలు మరుగున పడిపోయాయి. అయితే ఇంకా కొన్ని ఊర్లలో గుర్రపు బండి సామాన్లు ఒకచోట నుండి ఇంకొక చోటకు చేరవేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ గుర్రపు బండిని జట్కా బండి అని కూడా పిలుస్తారు. జట్కా బండి అంటే గుర్రము చేత లాగబడే బండి అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో టాంగా అంటారు. ఈ బండి ఇంధనం అవసరం లేని బండి ఇరుసుతో నడిచే బండి.యజమాని చేతిలో కీలుబొమ్మగ...

పల్లెలు

పల్లెటూరు అందాలకు ఆలయం.  అనుబంధాలకు నిలయం.  రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయంగా పిలుచుకునే ఆనంద కుటుంబం. సాయం అంటే ముందుకు అడుగు వేసే జనం సహాయం అంటే అందరికంటే ముందుండే మన ఊరే కరుణాసముద్రం. బాధ్యత అంటే బరువు అని తలచని అనుబంధం. చుట్టూ పరికిస్తే అనుక్షణం బాధ్యత గుర్తు చేయడం  ఓ వరం.  గంప కింద నుంచి కోడి కూతతో ఊరి మత్తు బహుదూరం.  ఇంకా ముసుగు తీయకపోతే జీవన పోరాటంలో తీరం వెతుక్కునే పక్షి వెక్కిరింపుతో పౌరుషం. గుడిలో నుంచి వినపడే సుప్రభాతం తెల్లవారింది అనడానికి సంకేతం. ఎర్రటి చూపులతో చుర్రుమనిపించే సూర్యకిరణం. అంబా అనే మూగజీవి అరుపు తన బిడ్డ ఆకలి తీర్చమని గుర్తు చేయడం పక్కన తడిమి చూస్తే వెక్కిరించిన మంచం.  వాకిట్లోంచి కళ్ళాపి జల్లుతున్న శబ్దం.  కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రహదారిపై సహచరుల జీవన ప్రయాణం.  అరుగు మీద చంటిగాడి చేతిలో పాఠ్యపుస్తకం. ఆ వేపుకు తిరిగి రెండు చేతులు జోడిస్తే బారెడు పొద్దెక్కిందని మనసులో ఓ భయం. పెరటిలోని వేపచెట్టు మూలనున్న దిగుడు బావి ఆరోగ్యానికి అభయం. వాకిట్లో కోడి పిల్లలకి ఆహారం వెతుకుతూ విహారం.  నక్కి నక్కి చూస్తున్న నల్ల పిల...