పోస్ట్‌లు

పాదముద్రలు

పాదముద్రలు మన జీవిత ప్రయాణంలో మనకు ముఖ్యంగా సహకరించేవి మన శరీరంలో అంతర్భాగమైన కాళ్లు మరియు వాటిని అంటిపెట్టుకొని ఉండే పాదాలు.  మన గమనానికి ఇవే ఆధారం. బాల్యంలో అమ్మ చిటికెన వేలు పట్టుకుని నడిపించే తొలి అడుగులుకి తడబడే అడుగులకి మన కాళ్ళే మనకు ఆధారం.  కాలం గడిచే కొద్దీ కాళ్లు బలపడతాయి. మనసు కూడా బలపడుతుంది. ఒకప్పుడు అమ్మ ఆసరా అవసరమయ్యే మనల్ని మన కాళ్లు స్నేహితులతో పాఠశాలలకి ఆటపాటలకి తీసుకెళ్తాయి. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కూడా మన అడుగులు ముందుకు పడతాయి. జీవితంలో ఎక్కవలసిన మెట్లు ఎక్కడానికి మనల్ని గమ్యం చేరుస్తూ ఉంటాయి మన కాళ్లు కానీ... పాదాలు మాత్రం ప్రతి అడుగులో ముద్ర వేసిపోతుంటాయి. కాళ్లు మన శరీరాన్ని మోస్తే...పాదాలు మన కదలికల్ని జ్ఞాపకంగా మిగులుస్తాయి. ఎప్పుడో చిన్నప్పటి ఇంటి ప్రాంగణం లో మిగిలిన పాదముద్రలు ఇప్పుడీ వృద్ధాప్యంలో వెతుక్కుంటే కనిపించవు. కానీ మనసులో మాత్రం అవే పాదాలు... మనల్ని వెనక్కి పిలుస్తుంటాయి. కాళ్లు శక్తి కాదు కాదు... ఆశ్రయం. పాదాలు గుర్తు కాదు కాదు... అనుబంధం.ఏదో ఒక రోజు  ఈ కాళ్లు నిలబడలేని స్థితి వస్తుంది. కానీ మనం వేసిన పాదాల దార...

నిత్య కళ్యాణం

నిత్య కళ్యాణం ఆంధ్రప్రదేశ్లో ప్రవహించు పవిత్ర గోదావరి నది ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో కాకినాడ జిల్లాలోని ఐ పోలవరం మండలంలో ఉన్న మురమళ్ళ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడి ఒకటి. ఇది చూడదగిన ప్రదేశం.   పార్వతి దేవి తండ్రి అయిన దక్షుడు యజ్ఞవాటికను నాశనం చేయడానికి శివుడి అంశతో పుట్టిన వీరభద్ర స్వామి నీ శాంత పరచడానికి భద్రకాళి అమ్మవారు ఒక కన్య రూపంలో వచ్చి స్వామి వివాహం గాంధర్వ వివాహం చేసుకుంటుంది.  ఈ దేవాలయం  ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల సౌకర్యార్థం తెరిచి ఉంటుంది. ప్రతినిత్యం పూజలతోపాటు నిత్యం భక్తులకు అన్నదానం ప్రతిరోజు సాయంకాలం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. పిల్లలకి వివాహాలు ఆలస్యం అవుతుంటే తల్లిదడ్రులు ఈ స్వామికి కళ్యాణం చేయిస్తామని మొక్కుకుంటారు.  ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. కాకినాడ నుంచి అమలాపురం వెళ్లే దారిలో ఈ మురమళ్ళ గ్రామం ఉంది. కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. 

అతిధి@అరవై

అతిధి @ అరవై.  సాయంకాలం నాలుగు గంటలు అయింది. నీలిరంగు ఆకాశం హఠాత్తుగా రంగు మారిపోయింది. వరుణ దేవుడు వాయుదేవుడు ఇద్దరూ రంగంలోకి దిగారు. పెద్ద వర్షం కాదు గాని చిన్న చిన్న తుంపర్లతో రహదారంతా తడిసిపోయింది.  ఇంతలో స్కూటర్ వచ్చి ఆగింది . ఎవరబ్బా ఈ వర్షం లో అని తొంగి చూశాడు కుర్చీలో కూర్చున్న ప్రసాద్. స్కూటర్ స్టాండ్ వేస్తూ రామారావు వెనకాల అతను భార్య సుజాత కనబడ్డారు.  వీధిలోకి వెళ్లి ఇద్దర్ని సాదరంగా ఆహ్వానించాడు ప్రసాద్. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ప్రసాద్ స్నేహితుడు రామారావు "ఒరేయ్ ప్రసాదు రేపు ఉదయం 9 గంటలకి మా అమ్మాయి శ్రీమంతం నువ్వు మీ ఆవిడ తప్పకుండా రావాలి ! అంటూ చెప్పాడు. కాఫీ టిఫిను భోజనం కూడా అక్కడే అంటూ ఆప్యాయంగా చెప్పాడు రామారావు. "నేనెందుకు రా ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ కదా నేనేం చేయను వచ్చి అంటూ పకపక నవ్వేడు ప్రసాద్. "లేదురా నువ్వు తప్పకుండా రావాలి. మీలాంటి దంపతులు వచ్చి మా పిల్లనీ ఆశీర్వదించాలి అంటూ సెంటిమెంట్ గా చెప్పాడు  ఇంతలో రామారావు భార్య సుజాత అన్నయ్య గారు వదిన గారు లేరా ! అని ప్రశ్నించింది . లేదమ్మా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింది అంటూ చెప్పాడు ప్రసాద్. రాత్ర...