నాటకం
నాటకం. ఉదయం పది గంటలు అయింది. అరుగు మీద వాలు కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న రామరాజుకి ఎవరో ఇద్దరు మధ్య వయస్కులు స్కూటర్ మీద వచ్చి" నాటకాలు వేసే రామరాజు గారి ఇల్లు ఇదేనా అని అడిగారు. అవునండి మీరు అంటూ కుర్చీలోంచి లేచి నేనే రామరాజు ని అంటూ అరుగు మీదనున్న తాటాకుల చాప చూపించి కూర్చోమని చెప్పాడు రామరాజు. మేము సఖినేటిపల్లి నుండి వస్తున్నాము. మా ఊరిఅమ్మవారు సంబరాలకి శ్రీకృష్ణ రాయబారం నాటకం వేయించుదామని దానికోసం మిమ్మల్ని కలవడానికి మాట్లాడడానికి వచ్చాము అంటూ చెప్పారు. ఏంటి బాబు మీరు చెప్పేది నిజమేనా! నేను కలగనటం లేదు కదా! అంటూ రామరాజు అయినా ఈ రోజుల్లో నాటకాలు ఎవరు చూస్తున్నారు అండి. మీరు ఏదో పరాచకాలు ఆడుతున్నారు నాతో అన్నాడు. లేదండి మా ఊర్లో ఉన్న మీ పాత తరం వాళ్ళ కోరిక ప్రకారం ఈ నాటకం వేయించుదామని అనుకుంటున్నాం. నవతరానికి కూడా ఆ పాత ఆణిముత్యాలు లాంటి నాటకాలు అంటే అభిమానం పెరిగేలా చేయాలని సంకల్పించాం.ఇంకా నెల రోజులు టైం ఉంది. ఈ లోగా మీరు రిహార్సల్స్ డ్రెస్సులు చూసుకోవాలిగా. అందుకనే ముందుగా చెబుతున్నాం. అడ్వాన్స్ ఇచ్చి వెళదామని వచ్చాం అంటూ చెప్పిన ఆ యువకుల మాటలకి రామరా...