సామెత -1
మనం ప్రతిరోజు మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒక సందర్భంలో ఒక సామెత వాడుతుంటాం. సామెత అంటే ఏమిటి? సాహిత్యపరమైన అర్థవంతమైన చిన్న పదబంధం.. ఒక్కొక్కసారి సామెత వాడుకలో అర్ధాన్ని మార్చివేస్తుంది. ఉదాహరణకి తెలుగులో ఒక సామెత ఉంది పండగ నాడు కూడా పాత మడుగేనా అది వాడుకలో పండగ నాడు కూడా పాత మొగుడేనా అని మారిపోయింది. ఇంతకీ ఈ సామెత అర్థం పండగ నాడు అందరూ కొత్త బట్టలు కట్టుకుంటారు కదా పండగ నాడు కూడా పాత వస్త్రాలేనా అని అర్థం. మడుగు అంటే వస్త్రము అని అర్థం. అందుకనే అర్థం తెలుసుకుని భాష వ్రాయడానికి ప్రయత్నించాలి. లేకపోతే చాలా ప్రమాదం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి