పోస్ట్‌లు

సోషల్ మీడియా బంధాలు

అంశం :సోషల్ మీడియా బంధాలు నేటి బంధాలకు – డిజిటల్ స్క్రీన్‌లే వేదికలు. మాటల్లో మాధుర్యం తగ్గింది, ఇమోజీల లాలిత్యమే మిగిలింది. లైకు పెడితే ప్రేమేనా? కామెంట్ రాలేకపోతే విరోధమా? వాట్సాప్ స్టేటస్‌లలో దాగిన పిలుపులు, కాల్ చేయకుండానే "బిజీ!" అనుకునే మనసులు. ఒకప్పుడు బంధాల బీజంగా మొలిచిన స్నేహాలు – ఇప్పుడు నెట్‌వర్క్‌ పరిచయాల్లో కలిసిపోయాయి. బంధం ఒక ట్యాగ్‌ అయింది, ప్రేమ ఒక హ్యాష్‌. ఫొటోలకు ఫిల్టర్లు, నవ్వులకు స్టిక్కర్లు, కానీ మనసుకు మాత్రం మాస్క్‌ తొలగించలేము. విష్‌లు ఫార్వర్డ్‌ చేస్తాం – దూర మిత్రునికి, కానీ పక్కనుండే వారిని పలకరించకుండా వెళ్తాం. గడియారం ముందుకు పరుగెడుతుంది, బంధాలు మాత్రం వెనక్కి జారిపోతున్నాయి. వాస్తవ ప్రేమకు వెబ్ అడ్రెస్ అడిగే కాలం ఇది, కన్నీళ్లు కూడా ఇప్పుడు సింక్‌ అవ్వాలి! ఓ మిత్రమా! స్క్రీన్‌ను కాసేపు పక్కన పెట్టు, నన్ను చూడు – నేను ఈ డిస్‌ప్లే కంటే లోతైనవాడిని. బంధం నెమ్మదిగా నడవాలి – చేతులు పట్టుకుని, ఫాలోలు కావు, పక్కనుండే నీడ కావాలి. ఓర్పు, ఆసక్తి, ఆత్మీయత – ఇవే నిజమైన కనెక్టివిటీ, సిగ్నల్స్ కంటే మనసులే శాశ్వతమైన నెట్‌వర్క్‌. నువ్వు పక్కనుంటే – నోటిఫికేష...

పుల్లయ్య బజ్జి

ఉదయం ఐదు గంటలు అయింది. ఎప్పటిలాగే ఆ పల్లెకి తెల్లారింది. అగ్రహారంలోని సందు చివరన ఉన్న కాఫీ హోటల్‌ వైపు అరుపులు, చప్పుళ్లు వినిపిస్తున్నాయి. అదేమీ పెద్ద హోటల్ కాదు. చిన్న పాక హోటల్. మధ్యాహ్నం వరకే తెరిచి ఉంటుంది. హోటల్ లోపల కర్రబల్లల మీద పొలాలకు వెళ్లే రైతులు కూర్చుని ప్రతిరోజూ ఒక్క కప్పు టీ తాగి, అప్పుడు పొలాలకు వెళ్లడం వారికి నిత్యకృత్యం. ఉదయాన్నే రైతులతో, కాస్త ఆలస్యంగా వ్యాపారులతో, టిఫిన్ సమయానికి అగ్రహారంలోని ప్రతి ఇంటి వాళ్లతో – ఆ హోటల్‌లో ఖాళీ అనే మాటకే చోటుండదు. ఒకప్పుడు పల్లెల్లో ఉదయాన్నే చద్దన్నం తినేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అందరూ పుల్లయ్య హోటల్‌లో టిఫిన్ కోసం ఎగబడుతున్నారు. అతడే ఆ పాక హోటల్ యజమాని – పుల్లయ్య. హోటల్ ఎప్పుడు పెట్టాడో ఎవరికీ తెలియదు. కానీ అప్పటి నుంచి అదే పాకలో, అదే ధోరణిలో కొనసాగుతోంది. పాకా మారలేదు – పుల్లయ్య మారలేదు. వయసు పెరుగుతున్నా టిఫిన్ల రుచి మాత్రం తగ్గడంలేదు. ప్రతి తెల్లవారుజామున మూడు గంటలకు లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, కట్టెల పొయ్యి వెలిగించి పని మొదలుపెడతాడు. సహాయులు ఎవరూ ఉండరు – అంతా తన సొంతంగా. "ఏమయ్యా పుల్లయ్య, ఎవ్వరినైనా పనికి పెట్ట...

వీధి కుక్కలు

"ఎందుకు మావయ్య గారు, ఆ వీధి కుక్కలకి రోజు అనవసరంగా పనిగట్టుకుని బిస్కెట్లు పెడుతుంటారు? అవి మీద పడి ఎక్కడ కరుస్తాయని భయం మాకు. మీరేమో ప్రతిరోజూ ఇదే పని!" అంటూ కోడలు భారతి కోపంగా అడిగింది మామగారు రాజారావుని. "ఎన్నోసార్లు వద్దని చెప్పాం! అయినా కానీ మీరు మానట్లేరు. రేపటి నుంచి మీరు ఆ తూముల వైపు వెళ్ళకండి. మిమ్మల్ని చూడగానే అవి తోక ఊపుకుంటూ దగ్గరకు వస్తాయి. మీరేమో జాలిపడి బిస్కెట్లు కొనిపెడుతుంటారు. చంటి పిల్లలకు పెట్టినట్లు ఏమిటో ఈ అలవాటు!" అని విసుక్కుంది రాజారావు కోడలు భారతి. "పైగా ఇది అనవసరం ఖర్చు. నెలాఖరికి ఎంత ఖర్చవుతుందో, మీరైనా లెక్క చూసుకున్నారా!" అని అడిగేసరికి, ఒక్కసారిగా మనసు చివుక్కుమంది రాజారావుకి. అయినా భారతి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా చెప్పులు వేసుకుని వాకింగ్‌కి వెళ్ళిపోయాడు రాజారావు.  అలా రోడ్డు మీద నడుస్తూ ప్రతిరోజూ వెళ్లే లాల్‌బహుదూర్‌నగర్ రోడ్ నెంబర్ రెండు లో ఉన్న తూముల దగ్గర కూర్చున్నాడు. రాజారావు అలా కూర్చోగానే ఎక్కడి నుంచి వచ్చాయో తోకలు ఊపుకుంటూ పది కుక్కలు రాజారావు చుట్టూ చేరేయి. వచ్చే ముందు భారతి మాట్లాడిన మాటలకి మనసు బాధపడి,...