పోస్ట్‌లు

ప్రాణదాత

ఏడాదికో మారు హుస్సేన్ సాగర్ లో వినాయకుడు మూడు మునకలు వేసి భాగ్యనగర వాసులకి ముక్తిని ఇస్తాడు. కాపురం బాలేని ఒక చెల్లి ఉద్యోగం రాలేదని ఒక తమ్ముడు బ్రతుకు బాలేదని ఒక సంసారి దిక్కు తోచక ఒకడు దిక్కు లేక మరొకడు పచ్చటి బ్రతుకుని ఆ సాగరంలో కలిపేసినప్పుడు ఊపిరాడకు మరో లోకం చూసినప్పుడు నేనున్నానంటూ తన బ్రతుకు చూసుకోకుండా సాగరంలో మూడుమునకలేసి ఊపిరి ఉన్న వాళ్ళని  ఊపిరి లేని వాళ్ళని కన్నవాళ్ళకి  కట్టుకున్న వాళ్ళకి కడసారి చూపు అందించే మరో అపర వినాయకుడు ఈ భాగ్యనగర జీవి. నామధేయం శివ ఆ సాగరతీరమే అతని అడ్డా జనాలకు ప్రాణహితుడు. రక్షక భటులకు కుడి భుజం. భాగ్యనగరంలోని ఓ బడుగు జీవి బ్రతకడానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన త్యాగజీవి. కొన ఊపిరి ఉన్న వాళ్లు సంతోషంగాను ఈ లోకంలో లేని వాళ్ళ బంధుజనం కన్నీళ్ళతోను ఇచ్చే పదో పరకో అదే జీవనాధారం. ఉపకారం అంటేనే పారిపోయే జనం ఉన్న రోజులు పరుల ప్రాణం కోసం ప్రాణం త్యాగం చేసే పరమాత్ముడు సార్ధక నామధేయుడు. భర్త అడుగుజాడల్లోనే భార్య ఆడ ప్రాణం ఆమె వంతు ప్రాణ రక్షణ పంచుకున్నారు చెరి సగం. సమయానుకూలంగా స్పందించడమే వారి వృత్తి ధర్మం. భూమ్మీద నూకలు ఉండి  బతికి వచ్చిన ...

ఊపిరి లేని బొమ్మ

ఊపిరి లేని బొమ్మ ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరు వదిలి రానంది అమ్మ ఊపిరాగి బొమ్మై కూర్చుంది నా బీరువాలో. బొమ్మ చూసినప్పుడల్లా అమ్మ నాతోనే ఉంది  అన్న తృప్తి . అమ్మకైనా బొమ్మకైనా బిడ్డ ఆనందమే సంతృప్తి.  బాల్యంలో అమ్మే నాకు సర్వస్వం  బొమ్మైన అమ్మ నాకు దైవంతో సమానం. బ్రతికున్నన్నాళ్లుఅమ్మకి లేదు క్షణం విరామం. నిత్యం బిడ్డల కోసమే పడేది తాపత్రయం. బొమ్మైన తర్వాత ఆమెకు లేదు అనుభవించే యోగం. ఊపిరి ఉన్న బొమ్మను తయారు చేసేది ఆ పరబ్రహ్మ పది తరాలకు చూపించడానికి బొమ్మను  తయారు చేసే యంత్రం సృష్టించాడు ఈ అపరబ్రహ్మ. మట్టిలో మట్టి గాలిలో గాలి కలిసిపోయిన  తాత గారి బొమ్మ లేకపోయినప్పుడు తెలిసింది  నాకు ఆ బొమ్మ విలువ. సెకనుకో బొమ్మ సృష్టించే యువతరాన్ని అభినందిద్దాం మనమందరం. రచన. మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు            కాకినాడ 9491792279

అమ్మాయి కోరిక

అమ్మాయి కోరిక " అమ్మా సీత ఆ హైదరాబాద్ సంబంధం వాళ్లు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు చేశారు. మనం ఏదో ఒక సమాధానం చెప్పకపోతే బాగుండదు అంటూ అడిగిన తండ్రి నరసింహాచార్యులకి " నాన్న ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. వద్దని చెప్పండి అంటూ చెప్పిన కూతురు సీతవైపు అయోమయంగా చూశాడు నరసింహచార్యులు. ఆ సంబంధానికి ఏమైంది? కుర్రవాడు బంగారు లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బోల్డంత జీతం. పైగా కుర్రవాడు అందగాడు. తల్లి తండ్రి కూడా ఉద్యోగస్తులే. వంక పెట్టవలసిన పనిలేదు ఏమిటో ఈ పిల్ల. ఏమి అర్థం కాకుండా ఉంది. అలా అని బలవంతంగా చేస్తే రేపొద్దున పిల్లల కాపురం చేయరు. అప్పుడు కూడా మనమే బాధపడాలి అనుకుంటూ గుడి వైపు అడుగులు వేశాడు నరసింహాచార్యులు. నరసింహ ఆచార్యులు గుడికి వెళ్ళాడు కానీ మనసంతా ఏదో బాధగా ఉంది. ఇప్పటికయిదారు సంబంధాలు ఏదో వంక పెట్టి తిప్పి పంపేసింది. లేక లేక పుట్టిన సీతను చాలా గారాబంగా పెంచాడు నరసింహ ఆచార్యులు. నరసింహ ఆచార్యులు తాతల కాలం నుండి ఆ గుడిని నమ్ముకుని జీవిస్తున్నారు. ఆదాయం అంతంత మాత్రం. కానీ ఏనాడు దేవుడికి లోటు చేయకుండా ఊరివారి సహాయంతో అన్ని ఉత్సవాల్ని అందంగా చేస్తూ కాల...