పోస్ట్‌లు

రెక్కల అతిథులు

ఉదయం లేస్తూనే చెప్పాడు మా అబ్బాయి అవినాష్ — ఇవాళ అతిధులను తీసుకురాడానికి వెళ్లాలని. “ఎవర్రా?” అని అడిగితే “సస్పెన్స్” అంటూ మాట దాటేశాడు. “రైల్వే స్టేషన్? బస్టాండ్?” కా అని అడిగితే మౌనంగా ఉండిపోయాడు, నవ్వుతూ. వీడి సస్పెన్స్ బంగారం గాను! అయినా ఈరోజుల్లో ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చే అతిధులు ఎవరు అబ్బా అనుకుంటూ ఎదురు చూడడం మొదలుపెట్టాం. “వాళ్లు భోజనానికి వస్తారా? టిఫిన్లు పెట్టాలా? ఏంట్రా విషయం?” అంటూ వాళ్ళ అమ్మ పదేపదే అడగడం మొదలెట్టింది. మా అబ్బాయి మొహంలో చిరునవ్వు తప్ప సమాధానం లేదు. “పోనీలే, వాడు చెప్పకపోతే చెప్పకపోయాడు, నేను ఇల్లు సర్దుకుని రెడీగా ఉంటాను,” అంటూ చిందరవందరగా ఉన్న సామాన్లన్నీ సరిగ్గా సెట్ చేసి, స్నానం చేసి, బట్టలు మార్చుకుని రెడీగా కూర్చుంది వాళ్ళ అమ్మ.  మా అబ్బాయి మటుకు ఏమి కంగారు పడకుండా — చుట్టాలే ఎన్ని గంటలకు వస్తారో చెప్పడు, తాను ఎప్పుడు తీసుకువస్తాడో కూడా చెప్పడు. ఏమి చెప్పకుండా మామూలుగా పని చేసుకుంటూ కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ వరుసగా పూర్తి చేసి, నిదానంగా సాయంకాలం ఐదు గంటలకి బండి తీసుకుని బయటికి వెళ్లిపోయాడు. రాబోయే చుట్టాల కోసం మళ్లీ రెండోసారి ఇల్లు సర్ది, డైనింగ్...

వైకల్యం

చిత్రం
1 బ్రతుకుకి భయంకరమైన గ్రహపాటు సాపాటు కోసం తప్పదు ఈ పాట్లు. సంకల్పం గట్టిదైతే వైకల్యం వెన్ను తడుతుంది. 2 జరిగిన దానికి చింతిస్తే కాలమే కాళ్లకు సంకెలవుతుంది. భవిష్యత్తు వైపు అడుగేస్తే విజయమే మన గమ్యమవుతుంది. 3 దారిలో తుఫాను ఎదురైతే దిగులుపడక ముందుకు సాగాలి. మనసులో ధైర్యం పెరిగితే గెలుపు మనదే అవుతుంది. 4 అవరోధం వచ్చినా ఆగిపోకు దాన్ని అవకాశముగా మార్చు. సాధనలో నిబద్ధత పెంచితే శిఖరాలు చేరుకోవచ్చు. 5 విఫలమే పాఠమని గ్రహిస్తే విజయమూ సులభం అవుతుంది. సహనం తోడైతే సఫలమై ప్రతిబంధం దాటవచ్చు. 6 అడుగు వెనక్కు వేయక ముందుకు ఆశను తోడుగా ఉంచాలి. దారిలో వెలుతురు తక్కువైనా మనసులో జ్యోతి వెలిగించాలి. 7 కష్టమే కిరీటాన్ని అలంకరిస్తోంది పట్టుదలే సింహాసనం ఇస్తుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధమైతే అడ్డంకులు కూలిపోతాయి. 8 భయమే శత్రువు అని మరిచిపోకు నమ్మకమే గెలుపు రహస్యం. కృషిని నిత్యం కొనసాగిస్తే సాఫల్యం సొంతం అవుతుంది. 9 జీవితమే యుద్ధభూమి అయితే ధైర్యమే కవచమై నిలుస్తుంది. ఆశలే అశ్వమై నడిపిస్తే విజయం వైపు పరిగెడుతుంది. 10 గతం ఒక పాఠమై నిలిచిపోతుంది భవిష్యత్తు కలలతో అలరిస్తుంది. వర్తమానమే వేదిక కాబట్టి ఇప్పుడే కృషి ప్రారంభించ...

ఉత్తరం

" ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది. ఏమీ తోచట్లేదు .కబుర్లు తెలియట్లేదు . ఎప్పుడూ వారం రోజులకోసారి ఉత్తరం రాసేవాడు అనుకుంటూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూస్తూ మాటిమాటికి గుమ్మం వైపు తొంగి చూస్తోంది కావమ్మ. ఉత్తరం చదివితే సాంబయ్య ను చూసినట్టు ఉంటుంది కావమ్మకి. సాంబయ్య తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోజుల్లో కావమ్మ లాంటి వాళ్ళు ఎందరో! మళ్లీ ఉత్తరం వచ్చేవరకు ఆ ఉత్తరంలోని సంగతులతో మనసు బెంగ పెట్టుకోదు. ఏంటో ఈసారి చాలా లేట్ అయింది అనుకుంటూ గదిలో మూలగా ఉన్నతీగకు తగిలించుకున్న పాత ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది. మొదటి వాక్యం లో గౌరవం, ప్రేమ మొదలైంది . ఎడం చేతి పక్క తల పైకెత్తి చూస్తే దాని వయసు ఎంతో తెలిసిపోయింది. మీకోసం ఆ ఊరి నుంచి కబురు మోసుకొచ్చాను అని చెప్పింది.   క్షేమమాచారాలతో మనసు కుదురుపరచి అక్కడి నుంచి ఆ ఊరి ఊసులన్నీ చెబుతూ ప్రేమ పొంగిస్తూ బాధలను తెలియ చేస్తూ అమ్మ మీద బెంగ ని ప్రకటించే కబుర్లన్నీ తనలో దాచి తలపై మీద ముద్ర వేయించుకుని వచ్చిన తోకలేని పిట్ట ఈ కార్డు ముక్కని చదివి కన్నీళ్లు కార్చింది కావమ్మ.  ముగింపులో కూడా మదిని...