మగ మహారాజు
మగమహారాజు ఇది మహానటుడు నటించిన సినిమా కాదు. నూరేళ్లు జీవితం గడపాల్సిన ఒక మహావీరుడి గాధ. మగమహారాజు అంటే వంశమును నిలబెట్టే మహావీరుడు అందుకే గర్భవతులైన వారిని పండంటి మగ బిడ్డని కనాలని ఆశీర్వదిస్తారు. మగ పుట్టుకంటే అంత క్రేజీ. మగ పిల్లలందరూ తలపై కిరీటాలు పెట్టుకుని పుట్టరు. జన్మ ఎవరికైనా ఒకటే. అందరూ ఆ తల్లి గర్భం నుంచి పుడతారు. ఏమిటి మగ పిల్లల ప్రత్యేకత . పుత్రుడే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ అధికారం ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. మగపిల్లాడు పుట్టాడు అంటే అందరికళ్ళల్లోనూ సంతోషo. వంశాన్ని ఉద్ధరించే ఒక అంకురం పుట్టిందని ఆనందo పడిపోతారు. ప్రత్యేకంగా ప్రేమగా పెంచుకుంటారు. తల తాకట్టు పెట్టి ఉన్నత విద్యలు చదివిస్తారు. అదృష్టం బాగుంటే చదువుకు తగిన ఉద్యోగం. మంచి జీతం. దేవుడిచ్చిన, వంశానుగతంగా వచ్చిన రూపం. డబ్బు హోదా . కార్లు బంగ్లాలు సంపాదిస్తారు ఒక ఇంటి వాడిని చేయవల్సిన వయసు వస్తుంది. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో చాలా సులభo . కానీ ఒక జీవిత భాగస్వామి దొరకడం ప్రస్తుతం కష్టమైన పని . భగీరథుడు గంగాదేవిని భూమికి తీసుకురావడానికి ఎంతకాలం తపస్సు చేశాడో తెలియదు గానీ ఒక...