ప్రసాదం

ప్రసాదం 

ఆ నవరాత్రులు
కొందరి బ్రతుకుకి వెన్నెల రాత్రులు

రెండు చేతులు చాచి అమ్మా ఆకలి అంటే గాని
డొక్క లేవని ఆ బడుగు జీవులకి
అవి నిజంగా పండగ రోజులే.

ఊరువాడ తిరగక్కర్లేదు
అమ్మ అయ్య అని పిలవక్కర్లేదు

సందు చివర పచ్చటి పందిరిలో
బొజ్జ గణపయ్య సన్నిధిలో
బల్లమీద కాలక్షేపం చేస్తే
మైక్ లో ఆహ్వానించి మరీ డొక్క నింపుతారు.

ఉదయం సాయంకాలం
గణపయ్యకి గరిక పూజలు.

ప్రజలకి పాప భీతి పెరిగిపోతుంది.
పూట పూటకి వెరైటీ నైవేద్యం.
ఆ బడుగు జీవికి గుండెల్లో ఎక్కడలేని ధైర్యం.

పండు వెన్నెల లాంటి కుడుములు
పచ్చటి పసుపు లాంటి పులిహార

అబ్బా ఎంత బాగుంది చక్ర పొంగలి
కమ్మటి పెరుగు తో చేసిన దద్దోజనం
అటుకులు బెల్లం రుచి చెప్పక్కర్లేదు
కాలక్షేపం కోసం చేసిన బటానీలు కాదు
బొజ్జ గణపయ్య కరుణ కోసం ఉడకబెట్టి పోపేసిన శనగలు.
కొబ్బరి ముక్కలు పంచదార
కోటయ్య కాజా 
బందరు లడ్డు
ఆత్రేయపురం పూతరేకులు
మాడుగుల హల్వా
అబ్బా స్వామి వారిదేమి అదృష్టం
స్వామి వారిది కాదు
మాలాంటి బడుగు జీవులిది.

రోజు రాత్రి ఖాళీ కడుపుతో
కాళ రాత్రి లా ఉండేది
ఇప్పుడు ఈ నవరాత్రులు మాకు వెన్నెల రాత్రే.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం