పోస్ట్‌లు

అయినవిల్లి గణపతి

అయినవిల్లి గణపతి  భక్తుడనై నారికేళము సమర్పింప  తొండముతో కష్టములను తరిమినావు.  రమణీయ కావ్యము రాసిన కరములతో కలములు ఇచ్చి మా కన్నుల పంటను ఆశీర్వదించినావు. గరికతో పూజించిన మా కన్నీటిగాధలన్ని విని  గడ్డి పోచ వలె తేలిక చేసినావు మా మనసులని దొరికిన పత్రితో సేవింప సంతృప్తి చెంది  దయ చూపినావు మా బతుకుల మీద గణనాయకుడవై జగతికి శోభవై గోదావరి తీర గజానను డ వై వెలసి అయినవిల్లి జనుల ఆరాధ్య దైవమై మొక్కుబడి గణపతిగా విఖ్యాతి కెక్కినావు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

గాలి దుమ్ము

గాలి దుమ్ము ఆకాశం మొహం మాడ్చుకుంది ఎప్పుడు హుషారుగా తిరిగే మేఘాలు నల్ల రంగు వేసుకుని చిన్నపిల్లలాగా దెబ్బలాడుకని అలసిపోయి చెమటలు  కార్చాయి. మేఘాల అల్లరికి విసిగిపోయిన సూరీడు చల్లదనం కోరుకుంటే ఏకంగా వాయుదేవుడు విజృంభించి గాలి దుమారం లేపాడు అందంగా పెంచుకున్న తరువుల బాహువులను నిర్దాక్షిణ్యంగా విరిచేసాడు. నీరు పోసిన వాడే నేలపాలు చేశాడు. మధుర ఫలాలు అన్ని దిష్టి చుక్క తగిలించుకుని బేరగాళ్ల కోసం ఆశగా చూసాయి. రైతు కళ్ళల్లో దుమ్ము కొట్టి వాయుదేవుడు మళ్లీ కనిపించని దేవుడు అయిపోయాడు. తట్టలోని మాలు తరగక సర్కారు వారి చెత్త కుండీ దారి వెతికాడు రైతన్న గూడులో ఉండే బుడతడకి గుమ్మం దగ్గర కాపు కాసే షావుకారుకి ఆశగా చూసే ఇల్లాలికి జవాబు చెప్పవలసిన ఈ గరీబు నవాబు అయ్యేది ఎప్పుడో కలికాలంలో నవ్వుతూ ఉండేది ఎప్పుడో  రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు Kaakinda 9491792279

నవ్వు

నవ్వు  మనసులోని ఆనందానికి బాహ్య సంకేతం నవ్వు. జీవoలేని నవ్వుకు అర్ధం గుండె గదిలోని గుబులు. మనసు లోని ఆనందం వరదలై పొంగితే బిగ్గరగా నవ్వు. ఒడిలోని బిడ్డ పెదవులపై వచ్చేది బోసి నవ్వు వడ్డికాసుల వాడి నవ్వు చిద్విలాసం. ఆకతాయి వాడి పెదవులపై వెకిలి నవ్వు ఆదరించేవాడు మనస్ఫూర్తిగా నవ్వు. ముదిత సిగ్గుతో తలదించుకుని ముసి ముసిగా నవ్వు. పులిస్టాప్ లేని నవ్వు మనలో లేని వాడి నవ్వు. మత్తు ఎక్కువై వచ్చే నవ్వు పేరు లేని నవ్వు. అసురుల పెదవులపై వచ్చేది వికృతమైన నవ్వు. అభయం ఇచ్చేది దేవతల నవ్వు. ముఖం మీద చెరగని చిరునవ్వు అతిథికి ఆహ్వానం ఫోటోలకు ఇచ్చే ఫోజులు మనిషికి పెంచును ఆరోగ్యo ఆనందం ఎక్కువైతే కళ్ళు కూడా తన భాషలో నవ్వుతాయి. నగుమోముకి చందమామ లాంటి అందాన్ని తీసుకొస్తాయి నవ్వు తనువుకు మంచి మిత్రువు సమయం సందర్భం లేని నవ్వు సమస్యలకు నెలవు. పెదవులపై వచ్చే చిరునవ్వు సమస్య దూరంగా జరుగు. నవ్వుతూ ఆదరిస్తే జగమంతా దరి చేరు.  మూడుముక్కలాటకి అందమైన లోగిళ్ళు  భూతల స్వర్గంగా మందు బాబుల క్లబ్బులు  ఆ నందనవనంలో నవ్వులే పువ్వులు అవుతాయి. అదే లాఫర్స్ క్లబ్. నవ్వు ప్రాణం ఉన్న మనిషికి మాత్రమే దేవుడిచ్...