పోస్ట్‌లు

జగన్నాథ రధ చక్రాలు వస్తున్నాయి

పరిచయం: ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు (జూన్/జూలైలో) జరిగే జగన్నాథ రథయాత్ర అనేది భారతీయ సంస్కృతి మరియు భక్తి పరంపరలో అతి విశిష్టమైన పండుగలలో ఒకటి. ఇది ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం, పూరీ నగరంలో జరుపబడుతుంది. ఈయాత్రలో శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రా దేవి తండ్రిగారి ఇంటికి వెళ్లే విధంగా విశేషంగా జరుపబడుతుంది. 📜 చరిత్ర: జగన్నాథుడి దేవాలయం పురాతనమైనది. స్కంద పురాణం, బ్రహ్మ పురాణం మొదలైన అనేక పురాణాలలో ఈ క్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. జగన్నాథ స్వామిని విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. ఈ యాత్ర ప్రబలమైన భక్తి ఉద్యమానికి ప్రతీకగా స్థాపితమైంది, ముఖ్యంగా చైతన్య మహాప్రభు కాలంలో ఇది మరింత ప్రాచుర్యం పొందింది 🚩 యాత్ర విశేషాలు: రథాలు: నంది ఘోష (జగన్నాథుడు): 16 చక్రాలు తలధ్వజ (బలరాముడు): 14 చక్రాలు దర్పదళన (సుభద్ర): 12 చక్రాలు రథాలను కట్టడం నుంచీ లకడియ కార్మికులు శ్రద్ధతో తయారు చేస్తారు. గుండిచా మందిరం: ఇది జగన్నాథుని తల్లి దేవాలయం అని భావిస్తారు. స్వామి అక్కడ ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. భక్తుల భాగస్వామ్యం: లక్షలాది మంది భక్తులు రథాలను తాళ్ళతో లాగడం ద్వారా తమ భక్తిని ప్రదర్శ...

డాక్టర్

 🏥 డాక్టరు 💊  అర్ధరాత్రి 12 గంటలు అయింది. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి నిద్ర పట్టక అటు ఇటు మంచం మీద దొర్లుతున్నాడు డాక్టర్ శ్రీనివాస్ ప్రముఖ కార్డియాలజిస్ట్. ఇంతలో వీధిలోంచి అంబులెన్స్ శబ్దం వినిపించింది. ఎవరికి ఎలా ఉందో పాపం! అనుకున్నాడు. రోజు ఎన్నో వేల మందికి గుండె వైద్యం చేసి అంబులెన్సులు సిరంజిలు శతస్కోపులు మందులు ఆపరేషన్ థియేటర్లు ఇంటెన్సు కేర్ యూనిట్లు స్పెషల్ వార్డు మధ్య బతుకుతున్నా , అంబులెన్స్ శబ్దం అంటే డాక్టర్ కైనా భయం అనిపిస్తుంది. అంటే ఎవరో ప్రమాదంలో ఉన్నారని సూచన ఇస్తోందన్నమాట ఆ శబ్దం.  రంగరాయ మెడికల్ కాలేజీ డాక్టర్ క్వార్టర్స్ లో కాపురం ఉంటుంన్న డాక్టర్ శ్రీనివాసు కి ఆ అంబులెన్స్ తమ క్వార్టర్స్ లో లో నుంచే వెళ్లడం గమనించాడు కిటికీలోంచి. ఎవరబ్బా. అనుకుంటూ ఆలోచించసాగాడు. ఇంతలో టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. హలో అనగానే అవతల నుంచి క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ రమేష్ సార్ మన డాక్టర్ శశాంక్ గారికి పెయిన్ వచ్చిందిట. ఇప్పుడు కాజువాలిటీలో ఉన్నారు కండిషన్ సీరియస్ గా ఉంది. సార్ మీరు వెంటనే రావాలి అంటూ గబగబా నాలుగు ముక్కలు చెప్పేసాడు. వెంటనే మళ్ళీ ఫోన్ చేసి చేయవలసి...

భూత యజ్ఞం

భూత యజ్ఞం అనేది సనాతన ధర్మంలో ఉన్న అయిదు ప్రధాన పంచ మహా యజ్ఞాలలో (Pancha Maha Yajnas) ఒకటి. ఈ యజ్ఞాలు గృహస్తుడిగా జీవించే వ్యక్తి నిత్య కర్తవ్యంగా నిర్వహించవలసిన సత్కార్యాలను సూచిస్తాయి. వాటిలో: • దేవ యజ్ఞం – దేవతల పూజ • పితృ యజ్ఞం – పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలు • ఋషి యజ్ఞం – వేదాధ్యయనము, గురు సేవ • మనుష్య యజ్ఞం – అతిథి సేవ, దానధర్మాలు • భూత యజ్ఞం – జంతువులు, పక్షులు, చిన్న జీవుల సేవ భూత యజ్ఞం అంటే ఏమిటి? "భూత" అంటే ఇక్కడ జీవరాశులు అన్న అర్థంలో వాడతారు – అంటే పశు, పక్షి, క్రిమికీటకాది జీవులు. భూత యజ్ఞం అనగా: "ఇతర జీవుల పట్ల కరుణతో, హింస లేకుండా, అవసరమైన ఆహారం, నీరు వంటి సహాయాన్ని అందించడం." భారతీయ సంప్రదాయంలో, మనుష్యులు ఈ భూమిపై ఒక్కరే కాదు. ఇతర జీవులంతా కూడా ఈ ప్రకృతి భాగస్వాములే. అందుకే, మన ఆహారం తయారీలోనైనా, మిగిలిన తినుబండారాలలోనైనా, ఏదో ఒక భాగాన్ని పక్షులకో, శునకాదులకు అర్పించే సంప్రదాయం ఉన్నది. భూత యజ్ఞం చేసేది ఎలా? భూత యజ్ఞం అనేది కొన్ని సాధారణ చర్యల ద్వారానే చేయవచ్చు: • ఇంటి వద్ద పక్షులకు తినుబండారాలు (ధాన్యాలు, నీరు) ఉంచడం • శునకాలు, పిల్లులు వంటి వీధి...