పెళ్లి కాజా
పెళ్లి కాజా. "అయ్యా గోపాలకృష్ణ గారు పెళ్లి వారిని భోజనానికి పిలవవచ్చునా! వంట సంగతి ఏమిటి? అంటూ అడిగిన కన్యాదాత చలపతిరావుకి నిరభ్యంతరంగా పిలవచ్చు. మీరు చెప్పిన వంటలన్నీ రెడీగా ఉన్నాయి అన్నాడు గోపాలకృష్ణ. బంగాళదుంప కూర, వంకాయ జీడిపప్పు సాంబారు అప్పడాలు వడియాలు కంది పొడి ఆవకాయ వీటన్నిటితో పాటు కాజాలు, జిలేబి వడ్డించండి. పిండి వంటలన్నీ ఆ మూల గదిలో పెట్టించాను. వడ్డనకి ఊరి వారు సరిపోతారా! మా కుర్రాళ్లను కూడా పంపించినా అవసరమైతే నేను కూడా వస్తాను. మీరు బంతి వేసే లోపు నేను అన్నం వార్చుతాను అంటూ గాడి పొయ్యి దగ్గర స్టూల్ మీద కూర్చున్న వంట బ్రాహ్మణుడు గోపాలకృష్ణ చెప్పాడు చలపతిరావు తో. సదరు గోపాలకృష్ణ వంటలు వండడంలో పిండి వంటలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి. నల్లగా పెద్ద బొజ్జతో పొట్టిగా ఉండి ఎర్రటి అంగవస్త్రం కట్టుకుని నలుగురు కుర్రాళ్లను వెంటబెట్టుకుని ఎంతటి పెళ్లి వంట అయిన రుచికరంగా శుభ్రంగా తయారుచేసే ఆ గోపాలకృష్ణ కాకినాడ నివాసి. ఆ ఊర్లో చిన్న తోరణం కడితే చాలు వంటకి గోపాలకృష్ణ నే పిలిచేవారు.అంత అలవాటు పడిపోయారుఆ ఊరి జనం గోపాలకృష్ణ వంటకి. గోపాలకృష్ణ వంటలో ఉన్నాడంటే నిశ్చింతగా ఉంటాడు యజమా...