ఇది సత్యం
ఇది సత్యం. " ఈసారి పండక్కి పిల్లలు ఎవరికీ ఫోన్ చేయకండి. నేను చాకిరి చేయలేకపోతున్నాను. మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. ఖర్చులు తట్టుకోవడం కష్టం కదా! అయినా పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యి పది ఏళ్లు పైన అయింది. ఏమీ అనుకోరు లెండి అంది జానకమ్మ తన భర్త సుందర రామయ్య తో. సుందర రామయ్య ఎటు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం చేస్తాడు ఇంటి యజమాని కదా! ఏ నిర్ణయం తీసుకున్న మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా! సుందర రామయ్యకి కూడా అదే అనిపించింది. రమారమీఅరవై ఐదు ఏళ్లు వయస్సు దాటింది జానకమ్మకి. ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు. సుందరామయ్యకి నలుగురు ఆడపిల్లలే. అందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ లోటు లేదు. సుందరామయ్య మటుకు ఉన్న ఊరిలో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు. అయినా ఏ పండుగకి పిల్లల్ని పిలవకుండా ఉండరు. ఈసారి జానకమ్మ ఎందుకు అలా చెప్పింది? అలా ఎప్పుడూ చెప్పలేదు. సుమారు యాభై సంవత్సరాల నుంచి చాకిరీ చేసి చేసి అలిసిపోయింది జానకమ్మ. ఏమిటో రేపు ఒకసారి జానకమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్...