నా పెళ్ళి నా బాధ్యత
నా పెళ్లి -నా బాధ్యత " ఒరేయ్ రామకృష్ణ ఈ సంబంధమైన ఒప్పుకోరా. అప్పుడే ఉద్యోగంవచ్చి ఐదేళ్లయింది. ఇంకా ఏమిట్రా జుట్టు నె రిసిపోతోంది.గుప్పెడు పొట్ట కూడా వచ్చింది. ఏ పిల్ల నిన్ను చేసుకోవడానికి ముందుకు రాదు అంటూ రామకృష్ణ తల్లి రాజేశ్వరమ్మ గారు చేతిలో ఒక ఫోటో పట్టుకుని రామకృష్ణ కు చూపిస్తూ అడుగుతోంది. లేదమ్మా నా టార్గెట్ ఇంకా పూర్తికా లేదు అంటూ ఏ ఫోటోను చూడడం మానేశాడు. ఆ డబ్బు గొడవ నీకెందుకురా మీ నాన్న చూసుకుంటారు .లేదమ్మా నాన్న రిటైర్ అయిపోయి అంత డబ్బు ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు. చూడమ్మా ఇదివరలో నేను చాలాసార్లు చెప్పాను. ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయడం అంటే చాలా కష్టం. పూర్వకాలంలో అయితే కట్నాలు తీసుకునేవారు. ఆ కట్నాలతో మగ పిల్లల పెళ్లిళ్లు చేసేవారు.ఇప్పుడు అలా కాదు కాలం మారింది. కట్నాల ప్రసక్తి పోయింది. ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా ఉద్యోగం చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. పైగా బాగా చదువుకున్న వాళ్ళు. ఒక రకం పెళ్ళికొడుకుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇంకా కట్నం ఎవరు ఇస్తారు. మా పిల్ల బోల్డంత సంపాదిస్తోంది . ఇంకా కట్నం ఏమిటి అని అ...