బంధం

-
బంధం 

ఆ దృశ్యం –
సాంప్రదాయ జీవనశైలికి ఒక జీవచిహ్నం.
ప్రకృతి ప్రేమికుల పుటలలో

ఒక జరగని జ్ఞాపకం.

సాంప్రదాయ రవాణా విధానానికి
ఒక నిశ్శబ్ద సాక్ష్యం.
భారతీయ పల్లె జీవనశైలికి
ప్రతిబింబంగా నిలిచిన బండి బాట.

ఆ రైతుకు తెలిసింది ఒక్కటే –
తన బ్రతుకు బండిని లాగుతున్నది
ఆ మూగజీవులేనని.
 అతనికి నమ్మకం.

ఆ మూగజీవులకి రైతు అంటే
గట్టి నమ్మకం –
వేళకు కడుపు నింపుతాడని,
వానొచ్చినా, ఎండ తాకినా
వాటిని విడిచిపెట్టడు అనేది.

ఆ బాటలో సాగుతున్నది
ఒక బండి కాదు,
ఒక జీవితం...
ఒక బంధం...
ఒక నిశ్శబ్ద ప్రేమగాధ.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కా కినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట