పోస్ట్‌లు

వాహన భీమా

వాహన భీమా  మీరు కొత్త కారు కొన్నారా? లేక పాత కారుకి బీమా రెన్యువల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ గైడ్ మీ కోసమే. కారు బీమా ఎందుకు అవసరం, ఏ రకాలు ఉన్నాయి, ఉత్తమమైన పాలసీ ఎలా ఎంచుకోవాలి అన్నదాని నుంచి క్లెయిమ్ ఎలా చేయాలో వరకు పూర్తిగా తెలుగులో తెలుసుకోండి. వాహన భీమా అంటే ఏమిటి? కారు భీమా అనేది మీ కారుకు జరిగిన ప్రమాదం, దొంగతనము, లేదా ఇతరులకు నష్టం చేసినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించే బీమా పాలసీ. ఇది రోడ్డు ప్రమాదాలలో నుండి ప్రకృతి విపత్తుల వరకూ ఎన్నో అంశాల్లో కవర్ ఇస్తుంది. కారు బీమా రకాలూ: 1. తర్డ్ పార్టీ బీమా (Third-Party Insurance): చట్టపరంగా తప్పనిసరి. మీరు ఇతరుల జీవితాలకు లేదా ఆస్తికి నష్టం చేస్తే, ఆ బాధ్యతను బీమా సంస్థ భరిస్తుంది. మీ కారుకి జరిగిన నష్టం కవర్ కాదు. 2. కాంప్రెహెన్సివ్ బీమా (Comprehensive Insurance): తర్డ్ పార్టీతో పాటు మీ కారుకి జరిగిన నష్టానికీ రక్షణ. ప్రమాదం, అగ్ని, వరద, దొంగతనాలు మొదలైనవి కవర్ అవుతాయి. చాలా మంది యజమానులకు ఇది ఉత్తమ ఎంపిక. అదనపు రైడర్లు (Add-on Covers): Zero Depreciation Cover: భాగాల వయస్సు లెక్కచేయకుండా పూర్తిగా క్లెయిమ్ ఇస్తారు. Engine Protection: ...

సీనియర్ సిటిజెన్

సీనియర్ సిటిజన్ ఒక రోజులో పెద్ద మార్పు నిన్నటి వరకు బాధ్యతలకు బందీని. కాలంతో పరిగెత్తే కర్మజీవిని. ఇప్పుడు గాలిలో ఎగిరే పక్షిని. అప్పుడు ఇప్పుడు  కాలమే నాకు సమస్య. అప్పుడు కాలం సరిపోక  ఇప్పుడు కాలం గడవక. ఇదంతా కొత్త లోకం. ఆ లోకమంతా చూపించి పొద్దు గడిపే నా దోస్త్ వీడే. అందంగా చేతిలోకి చేరిపోయి జేబులోకి దూరిపోయి గోల చేస్తూ తన రాకను తెలియజేస్తాడు. ఆ ఊరి కబురుని పొరుగూరి సొగసుని అందరి క్షేమాన్ని అందంగా చూపిస్తాడు. ముఖ పుస్తకమై మురిపిస్తాడు  తల్లిలా సందేహాలు తీరుస్తాడు. కోరితే కోరాగా చిక్కుముడి విప్పుతాడు. WhatsApp కి సాటి లేదనిపించాడు. రోజు మాట్లాడే బొమ్మలు చూపించి బెంగలు తీర్చుతున్నాడు అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు. దాని విన్యాసాలన్నీకి ప్రేక్షకుడిగా మార్చి కాలాన్ని గడిపించేస్తాడు. నేను ఒక మాలోకాన్ని. ఆ దోస్త్ గాడి లోకంలో నేను ఒక నిరక్షరా స్యుడిని నేను అక్షరాలు నేర్పిన వాళ్ళకి శిష్యుడునైపోయాను.  కాల ప్రవాహంలో వాళ్ళ వడిలో  పసిపాపను అయిపోతాను. కాలం కన్నెర్ర చేస్తే  పంచభూతాల్లో కలిసిపోతాను నేను ఎవర్ని ఒక సీనియర్ సిటిజన్ని. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బ...

ఆవకాయ

ఆవకాయ  అందమైన అమ్మాయి కళ్ళను చెరువులో పెరిగే కలువ పూలతో పోలుస్తారు. ఈ కలవ పూలు రెండు రకాలు. ఒకటి తెలుపు మరొకటి ఎరుపు. ఈ ఎర్ర కలువ పూలు చూడగానే నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. మన వంటింట్లో కుండలో ఉన్న ఆవకాయ కూడా ఎర్రగా నూనెలో తేలుతూ కలువ పువ్వు లాగా నాకు అనిపిస్తుంది. ఆకులో పంచభక్ష పరమాన్నలున్న ఆవకాయ ముక్కలేకపోతే విస్తరి చిన్నబోతుంది. ఆంధ్రుడిగా పుట్టినవాడు ప్రతివాడు ఆవకాయ అంటే చాలా ఇష్టపడతాడు. విదేశాల్లో ఉన్న కోరి మరీ తెప్పించుకుంటాడు.ఆంధ్రుడికి ఆవకాయకి చాలా అవినాభావ సంబంధo వుంది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సందడి మొదలవుతుంది.కారణం ప్రధానంగా ఆవకాయకి కావలసిన మామిడి కాయలు కాసే కాలం. నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకునే కాలం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చళ్ళని ఎండ పెట్టి నిలువ చేసుకుంటే సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఆవకాయ ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. తెలుగు వాడు విస్తరిలోకి ఏమీ లేకపోయినా పెరుగన్నము ,ఆవకాయతో పూట గడిపేసుకుంటాడు. ఇదే విషయం శ్రీనాథ మహాకవి ఆవకాయతోటి తన అనుభవం పద్య రూపంలో చెప్పారు. ఈ విషయం ఒక కవి మిత్రుడు చెప్పాడు నాకు. అంటే ఆవకాయ అతి ప్రాచీనమైందని తెలు...