పోస్ట్‌లు

మారిన మానవుడు

మారిన మానవుడు అనాదిగా మానవుడు సంఘజీవి. ఒక తీయని పలకరింపుతో పులకరించిపోతాడు. స్నేహం కోసం ప్రాణాలు అర్పిస్తాడు. విద్యార్థి దశలో మొదలైన స్నేహం కడదాకా కొనసాగుతుంది. ఎవరైనా కోరితే సహాయం వెంటనే చేసేవాడు. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడే వాడు కాదు. మన సంస్కృతి అటువంటిది. మన చరిత్ర అటువంటిది. కర్ణుడు శిబి చక్రవర్తి లాంటి వారు మనకు ఆదర్శం.  సంతర్పణలు పూజలు పునస్కారాలు అంటూ పదిమంది ఒకచోట చేరేవారు. కష్టo సుఖం మాట్లాడుకునేవారు. పుణ్య దినాలలో అరుగుల మీద కూర్చుని భజనలతో కాలక్షేపం చేసేవారు. రచ్చబండల దగ్గర పిచ్చా పాటీ మాట్లాడుకునేవారు. అలా మనిషికి మనిషికి ఒక అనుబంధం ఉండేది. ఆప్యాయంగా పలకరించుకునేవారు. మనసు విప్పి మాట్లాడుకునేవారు. మమతపంచుకునేవారు.బంధుత్వాలుపెంచుకునేవారు కష్టసుఖాల్లోపాలుపంచుకునేవారు కానీకాలంమారిందిమనిషిలోమార్పులుచోటుచేసుకున్నాయి.మనిషి ఒంటరివాడైపోతున్నాడు .మనిషి తన చుట్టూ తాను గిరి గీసుకొని బతుకుతున్నాడు. యువతరం అయితే మరీను. ఎవరైనా పలకరిస్తే తప్ప మాట్లాడరు. పక్కనున్న వ్యక్తి గురించి పట్టించుకోరు. ఎదురింటిలో ఎవరు ఉంటున్నారో తెలియదు. ఎంతసేపు ఒకే లోకం.  ఆ లోకంలోనే మని...

ఉత్తరం

ఉత్తరం  " ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది. ఏమీ తోచట్లేదు .కబుర్లు తెలియట్లేదు . ఎప్పుడూ వారం రోజులకోసారి ఉత్తరం రాసేవాడు అనుకుంటూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూస్తూ మాటిమాటికి గుమ్మం వైపు తొంగి చూస్తోంది కావమ్మ. ఉత్తరం చదివితే సాంబయ్య ను చూసినట్టు ఉంటుంది కావమ్మకి. సాంబయ్య తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోజుల్లో కావమ్మ లాంటి వాళ్ళు ఎందరో! మళ్లీ ఉత్తరం వచ్చేవరకు ఆ ఉత్తరంలోని సంగతులతో మనసు బెంగ పెట్టుకోదు. ఏంటో ఈసారి చాలా లేట్ అయింది అనుకుంటూ గదిలో మూలగా ఉన్నతీగకు తగిలించుకున్న పాత ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది. మొదటి వాక్యం లో గౌరవం, ప్రేమ మొదలైంది . ఎడం చేతపక్క తల పైకెత్తి చూస్తే దాని వయసు ఎంతో తెలిసిపోయింది. మీకోసం ఆ ఊరి నుంచి కబురు మోసుకొచ్చాను అని చెప్పింది.   క్షేమమాచారాలతో మనసు కుదురుపరచి అక్కడి నుంచి ఆ ఊరి ఊసులన్నీ చెబుతూ ప్రేమ పొంగిస్తూ బాధలను తెలియ చేస్తూ అమ్మ మీద బెంగ ని ప్రకటించే కబుర్లన్నీ తనలో దాచి తలపై మీద ముద్ర వేయించుకుని వచ్చిన తోకలేని పిట్ట ఈ కార్డు ముక్కని చదివి కన్నీళ్లు కార్చింది కావమ్మ.  ముగింపులో...

శంకర జయంతి

శంకర్ జయంతి  భారతీయ తత్త్వశాస్త్రంలో విలక్షణమైన కీర్తిని సంపాదించిన ఆది శంకరాచార్యులు జన్మించిన రోజును శంకర జయంతిగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ఆయన జీవితం, సిద్ధాంతాలు, హిందూ ధర్మానికి చేసిన సేవలను స్మరించుకునే పవిత్ర సందర్భం. శంకరుడి జన్మస్థలం మరియు బాల్యం: ఆది శంకరులు క్రీ.శ. 8వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలోని కాలడీ అనే చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి శివగురు, తల్లి ఆర్యాంబ. బాల్యంలోనే ఆయన మేధా సామర్థ్యం, భక్తి భావం ప్రసిద్ధి పొందాయి. తల్లి కోరిక మేరకు సన్యాసాన్ని స్వీకరించారు. ఇది ఆ కాలంలో అసాధ్యమైన నిర్ణయం. కానీ ధర్మపరిరక్షణే ఆయన లక్ష్యమైంది. వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి సాక్షాత్తు శివుడే శంకరాచార్యులుగా పుట్టారని గ్రంథాలు చెబుతున్నాయి.  శంకరాచార్యుల వారు పుట్టేటప్పటికీ భారతదేశంలో బౌద్ధ మత ప్రభంజనం ఎక్కువగా ఉంది . వైదిక కర్మలు మూతపడ్డాయి. అటువంటి సందర్భంలో ఈ శంకరుల జననం జరిగింది. ఎనిమిది సంవత్సరముల వయసులోనే సన్యసించి సకల శాస్త్రాలను చదివి బిక్షాటన చేస్తూ జీవితం గడిపే శంకరులు ఒకసారి ఒక ఇంటి ముందుకి వెళ్లి బిక్ష అడుగుతాడు. ఆ ఇంట...