పోస్ట్‌లు

అరవై ఏళ్లకు పెళ్లి

 అరవై ఏళ్లకి పెళ్లి మావయ్య గారు పంచకట్టుకోవడం అయిందా! అని అడిగింది అరవైఏళ్ల పరమేశ్వరరావుని హాలు లోంచి కోడలు సుజాత.  "మీకు పంచికట్టుకోవడం అయితే నేను వచ్చి నుదుట నామం, కళ్ళకి కాటుక బుగ్గన చుక్క పెడతాను అoది సుజాత. అలాగేనమ్మా అన్నాడు! పరమేశ్వరరావు. ఇంతలో పరమేశ్వరావుకి కూతురు రమ్య గొంతు గట్టిగా వినిపించింది మేడ మీద నుంచి. " అమ్మ తయారయ్యావా! పంతులుగారు పిలుస్తున్నారు అని అంది రమ్య. అయిపోయిందమ్మా! అని సమాధానం ఇచ్చింది పరమేశ్వర రావు భార్య రాధిక. ఎంత బాగున్నావ్ అమ్మ పెళ్లి కూతురు ముస్తాబులో నా దిష్టి తగిలేలా ఉంది అని తల్లిని చూస్తూ రమ్య. పద పద అంటూ తల్లి చెయ్యిని పట్టుకుని మేడ దిగి వస్తుంటే నిజంగానే సుజాత కొత్త పెళ్ళికూతురు అనిపించింది హాల్లో ఉన్న బంధువులకి స్నేహితులకి. అందమైన చిలకాకుపచ్చ ఎర్ర అంచు బోర్డర్ ఉన్న పట్టుచీర, రంగు వేసిన జుట్టు, కాళ్ళకి చేతులకి గోరింటాకు, నుదుటన పెళ్లి బొట్టు, కళ్ళకి కాటుక బుగ్గన చుక్క జడలో మల్లెపూలు ఇది యాభై ఎనిమిది ఏళ్ల పెళ్లి కూతురు అలంకరణ.  పెళ్లికూతురు ఆ పక్క ఈ పక్క రాధిక కూతురు సుమ , సుమ భర్త సుధాకర్ కూర్చుని ఉన్నారు. పెళ్లికూతురు తల్లిదండ...

రాజమహేంద్రవరం

 రాజమహేంద్రవరం. నేను ఎందుకు ప్రత్యేకo ఎన్నిసార్లు పేర్లు మారినా  నేను రాజరాజ నరేంద్రుని  రాజధానినే చరిత్ర ఎవరు చెరిపేయగలరు  ఒకళ్ళ ఇద్దరా ఎన్ని రాజవంశాలు  నన్ను నడిపించాయో  ఎంతో మంది కవులు  ఎంతోమంది సంఘసంస్కర్తలు  తీర్చిదిద్దిన సాంస్కృతిక రాజధానిని  రాజమండ్రి ని  గాలిలో ఎగురుకుంటూ వచ్చేవాళ్లు  జాతీయ రహదారిపై రివ్వున  దూసుకు వచ్చేవాళ్ళు  చుకు చుకు బండి  దిగేవాళ్లు  షికారుగా బోటు లో   రోజు ఎంతోమంది అంతకంటే ముఖ్యం  ఏ నగరానికి లేని అదృష్టం  గలగల పారే గోదావరి  నా పక్కన ఉండడం  ఎప్పటి బిపిన్ చంద్రపాల్  ఇప్పటికీ గాలిలో ఆ స్వరం వినిపిస్తూనే ఉంటుంది  నా నగరంలోని పాల్ చౌక్ లో అదేనండి కోటిపల్లి బస్టాండ్  బ్రిటిష్ వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయినా  కలెక్టర్ గారి పేరు మీదుగా నా నగరంలో   ఇన్నిసుపేట మిగిలిపోయింది. అక్కడ అందమైన పూల తోటలు లేవు. మనసును మల్లెపూలలా మార్చే  దివ్యజ్ఞాన సమాజం నాయకుడు  ఆల్కాట్ పేరుతో ఏర్పడిన వీధి  ఆల్కాట్ గార్డెన్స్ ఆ రామదాసు రామ భక...

నా స్నేహితుడు

"నాన్న అలా కాదు ఈ సైడ్ బటన్ నొక్కాలి ఇక్కడ ఆన్ చేయాలి. చార్జర్ ఇలా పెట్టాలి మళ్లీ రీస్టార్ట్ చేయాలి. నెట్వర్క్ పనిచేయట్లేదు ఏమో మొబైల్ నెట్వర్క్ వాడుకో. ఫేస్బుక్ క్రియేట్ చేసాం వాట్సాప్ నెంబర్ ఇదే. యూట్యూబ్ ఉండనే ఉంది. సాంసంగ్ నోట్స్ డౌన్లోడ్ చేసాం. ఏమిటో కొత్త కొత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నారు పిల్లలు నాన్న నీ మొబైల్ నెంబర్ మొదటి నెంబరు చివరి నెంబరు కూడానీలక్కీనంబరే.Youareluckyఅంటూఆనందపడిపోయారు ఇలా చకా చకా నాకు చెబుతూ నా పుట్టినరోజుకి ఆ బుల్లి ముండని నా చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. నాకు అంతా అయోమయంగా ఉంది. నేను అక్షరాల నేర్పిన పిల్లల దగ్గర శిష్యుడిలా మారిపోయి మొత్తానికి బ్రహ్మవిద్య నేర్చేసుకున్న. చుట్టాలు పక్కాలు పార్కులో స్నేహితులు, మార్కెట్లో కూరగాయల షాపులు , కిరాణా షాపులు , పాలవాళ్లు ,మెడికల్ షాపులు, డాక్టర్లు, రక్త పరీక్ష కేంద్రాలు పనిమనిషి ,చాకలి, మంగలి నంబర్లన్నీ డైరీ తీసి కాల్ లిస్టులో పెట్టేసుకున్న. ఆ లిస్టు చూస్తే పెళ్లి సామాన్లు లిస్టులా ఉంది కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు ఆస్తమాను దాన్ని చూస్తూ చేతిలో అటు ఇటు తిప్పుకుంటూ జేబులో పెట్టుకుంటూ ఎ...