పోస్ట్‌లు

తొలి తిరుపతి

తొలి తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే తిరుపతిని పెద్ద తిరుపతి అంటారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల గ్రామంలో కొలువై ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు.  మరి తొలి తిరుపతి పేరు ఎప్పుడైనా విన్నారా! ఇది కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉండే చదలవాడ తిరుపతి. ఇక్కడ శృంగార వల్లభ స్వామి దేవాలయం అతి పురాతనమైనది. ఈ దేవాలయంలో తొలిసారిగా మహావిష్ణువు శృంగార వల్లభ స్వామి రూపంలో కనబడడం వలన ఇది తొలి తిరుపతిగా ప్రసిద్ధి కెక్కింది. భక్తుడు ఎంత ఎత్తులో ఉంటే అంతే ఎత్తులో దేవుడు కూడా కనిపిస్తాడని ఒక నమ్మకం. ఇక్కడ స్వామి నవ్వుతూ కనిపిస్తాడు. కాకినాడ జిల్లాలో ఉండే దేవాలయంలో చూడదగిన ఆలయం. ఈ ఆలయానికి అతి సమీపంలో ఉండే రైల్వే స్టేషన్ సామర్లకోట రైల్వే జంక్షన్. సామర్లకోట రైల్వే జంక్షన్ లో దిగి ఆటోలో ప్రయాణించి ఆ దేవాలయం చేరుకోవచ్చు  నేను కేవలం దేవాలయం యొక్క ప్రాముఖ్యతని అది ఎక్కడ ఉందో ఎలా చేరుకోవాలో మాత్రమే తెలియజేస్తున్నాను. మిగతా వివరాలు కి మీరు వెబ్సైట్ చూసుకోవచ్చు. గూగుల్లో ఆలయాలకు సంబంధించిన అన్ని వివరాలు ద...

చినుకు రాలాలి

చినుకు రాలాలి " బయట అంత ఎండ గట్టిగా కాస్తుంటే వర్షాలు పడతాయని చెప్తున్నారు ఏంటండీ అంటూ అడిగింది ఒక భార్య ఒక భర్తని టీవీలో వార్తలు చూస్తూ!  వేసవికాలంలో వర్షాలు ఏమిటి? కలికాలం కాకపోతే ను. మా చిన్నతనాల్లో గాలి దుమ్ములు వచ్చేవి. పెద్దగా గాలి వచ్చి తోటల్లో ఉండే మామిడికాయ లు రాలిపోయేవి. పిల్లలందరం తోటల్లోకి పరిగెత్తుకుని వెళ్లి చెట్టు కింద పడిన మామిడికాయలు ఏరుకుని తట్టలో పెట్టుకుని పట్టుకొచ్చే వాళ్ళo. అదొక వింత అనుభూతి. మర్నాడు ఎండ చాలా దారుణంగా ఉండేది అంటూ ఒక ముసలాయన తన అనుభవాల పరంపరలోకి వెళ్లిపోయాడు. టీవీ వాళ్ళు వార్తలు ఏమీ ఆధారాలు లేకుండా చెప్పరు. వాతావరణ పరిశోధన శాఖ వాళ్లకి ఇచ్చిన సమాచారం ఆధారంగా చెబుతారు. చూస్తూ ఉండండి కాసేపట్లో వర్షం పడుతుంది అన్నాడు ఇంటి యజమాని.  ఊరుకోండి ఊరగాయలు కూడా ఎండలో పెట్టాను. అలా చెబుతారు ఏమిటి ? అంటూ కోపంగా ఇంట్లోకి వెళ్లిపోయింది ఒక ఇల్లాలు. అప్పటికి ఉదయం తొమ్మిది గంటలు అయింది. పిల్లలు స్కూల్ కి పెద్దల ఆఫీసులకి తయారవుతున్నారు. సడనుగా వాతావరణ శాఖ చెప్పినట్లుగా నీలిరంగు ఆకాశం ముఖం మార్చుకుని నల్లగా తయారైపోయింది. ఆకాశంలో నుంచి మంచు ముక్కలు ఊడి పడినట్లు...

పాదముద్రలు

పాదముద్రలు మన జీవిత ప్రయాణంలో మనకు ముఖ్యంగా సహకరించేవి మన శరీరంలో అంతర్భాగమైన కాళ్లు మరియు వాటిని అంటిపెట్టుకొని ఉండే పాదాలు.  మన గమనానికి ఇవే ఆధారం. బాల్యంలో అమ్మ చిటికెన వేలు పట్టుకుని నడిపించే తొలి అడుగులుకి తడబడే అడుగులకి మన కాళ్ళే మనకు ఆధారం.  కాలం గడిచే కొద్దీ కాళ్లు బలపడతాయి. మనసు కూడా బలపడుతుంది. ఒకప్పుడు అమ్మ ఆసరా అవసరమయ్యే మనల్ని మన కాళ్లు స్నేహితులతో పాఠశాలలకి ఆటపాటలకి తీసుకెళ్తాయి. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కూడా మన అడుగులు ముందుకు పడతాయి. జీవితంలో ఎక్కవలసిన మెట్లు ఎక్కడానికి మనల్ని గమ్యం చేరుస్తూ ఉంటాయి మన కాళ్లు కానీ... పాదాలు మాత్రం ప్రతి అడుగులో ముద్ర వేసిపోతుంటాయి. కాళ్లు మన శరీరాన్ని మోస్తే...పాదాలు మన కదలికల్ని జ్ఞాపకంగా మిగులుస్తాయి. ఎప్పుడో చిన్నప్పటి ఇంటి ప్రాంగణం లో మిగిలిన పాదముద్రలు ఇప్పుడీ వృద్ధాప్యంలో వెతుక్కుంటే కనిపించవు. కానీ మనసులో మాత్రం అవే పాదాలు... మనల్ని వెనక్కి పిలుస్తుంటాయి. కాళ్లు శక్తి కాదు కాదు... ఆశ్రయం. పాదాలు గుర్తు కాదు కాదు... అనుబంధం.ఏదో ఒక రోజు  ఈ కాళ్లు నిలబడలేని స్థితి వస్తుంది. కానీ మనం వేసిన పాదాల దార...