పోస్ట్‌లు

ఊర్మిళాదేవి

ఊర్మిళాదేవి ఒక్క పక్షి మరణం ఒక ఆదర్శప్రాయమైన సీతారాముల కథను లోకానికి తెలియజేయడానికి అవకాశం కల్పించింది. ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాడు. సీతారాములే కాకుండా భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా లోకానికి ఆదర్శప్రాయులు ఎలా అయ్యారు అన్నది మనకి తెలియజేశాడు ఆ మహర్షి.  ఈ శ్రీరాముడు కథలో అన్ని పాత్రలు కూడా ఆదర్శ పాత్రలే. ఏకపత్నివృత్రుడుగా తండ్రి మాట జవదాటని వ్యక్తిగా శ్రీరామచంద్రుడు మనకి కనపడతాడు. భాతృ ప్రేమలో లక్ష్మణుడు భరతుడు లోకానికి ఆదర్శప్రాయలుగా కనిపిస్తారు. లోకంలో ఆదర్శవంతమైన భార్యగా సీతాదేవి నిలిచిపోయింది. రామ బంటుగా హనుమ, స్నేహితుడుగా సుగ్రీవుడు, సేవకుడుగా గుహూడు ఇలా ఎన్నో పాత్రలు జాతి గుండెలో చిరస్థాయిగా నిలబెట్టింది రామాయణం. అయితే మరొక్క పాత్ర లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి పాత్ర కూడా చెప్పుకోదగినది.  వాల్మీకి చేత రచించబడిన శ్రీమద్రామాయణంలో ఊర్మిళాదేవి గురించి చాలా తక్కువగా చెప్పినప్పటికీ ఆమె పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పడంలో సందేహం లేదు.  ఊర్మిళాదేవి జనకమహారాజు తమ్ముడైన కుశ ధ్వజడు కుమార్తె. కుశధ్వజుడు విద్యానగరమును పరిపాలిస్తూ ఉ...

జై వీర హనుమాన్

జై వీర హనుమాన్. ఆంజనేయస్వామి సర్వమానవ ఆరాధ్య దైవం. రామ బంటుగా రామ భక్తుడిగా, అసాధ్యకార్యసాధకుడుగా, రాక్షస సంహారిగా మన మనసులో నిలిచిపోయిన దైవం.  భారతదేశంలో ఏ గ్రామం చూసిన ఏ రహదారి చూసిన స్వామి విగ్రహం లేని చోటు ఉండదు. దేవాలయంలో ఆంజనేయ స్వామిని చూసిన రహదారి పక్కనున్న విగ్రహాలు చూసిన ఒక రకమైన ఉత్తేజం ధైర్యం కలుగుతుంది. బహుశా ఆయన రూపం చూసి భయం తొలుగుతుంది. విశాలమైన వక్షస్థలం పొడవైన కాళ్లు చేతులు చేతిలో గధ వానర ముఖం వానరులకుండే ప్రత్యేకమైన అవయవం తోక కలిగి ఉంటారు స్వామి.  మానవ రూపంలో ఉండే ఈ దేవుడుకి వానర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అందరికీ కలుగు తుంది. ఆంజనేయ స్వామి తల్లి అంజనీ దేవి. ఆమె వానర వనిత. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస శాపం కారణంగా వానర కన్యగా పుడుతుంది. ఆమెకు కేసరితో వివాహం జరుగుతుంది. చాలా కాలo వరకు సంతానం కలగపోవడంతో శివుడుని పూజించి శివుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది.   శివుడి యొక్క తేజమును వాయుదేవుడు పండు రూపంలో అంజనీ దేవికి ఇవ్వగా ఆ పండు తిన్న అంజనీ దేవికి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. అంజనీ దేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయ...

పుట్టిన రోజు

పుట్టినరోజు " హ్యాపీ బర్త్ డే రా సుధాకర్ అంటూ ఆఫీస్ కి రాగానే కొలీగ్స్ అందరూ సుధాకర్ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ తిరగడం ప్రారంభించారు. అందరికీ థాంక్స్ చెప్పి సుధాకర్ తన సీట్లో కూర్చున్నాడు. అదొక ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యాలయం అక్కడ పనిచేసే పదిమంది ఉద్యోగు లు మేనేజర్ దగ్గర నుంచి సబ్ స్టాప్ వరకు ఏ నెలలో ఎవరు పుట్టినరోజులు వచ్చాయో క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకుంటారు. ఆరోజు ఎవరిదైతే పుట్టినరోజు వస్తుందో వాళ్లు హోటల్ లో లంచ్ ఇవ్వాలి. లంచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కేక్ కట్ చేసి తర్వాత ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు. అలా ప్రతినెల ఎవరిదో ఒకరికి పుట్టినరోజు వస్తూనే ఉంటుంది. రేపు పుట్టినరోజు అనగా ముందు రోజు అందరికీ లంచ్ కి రమ్మని ఎవరిదైతే పుట్టినరోజు అవుతుందో వాళ్ళు ఆహ్వానిస్తారు. ఇది ఆఫీస్ సాంప్రదాయం కానీ సుధాకర్ పుట్టినరోజు ముందు రోజు అటువంటి ఆహ్వానం అందలేదు. అదేంటి రేపు సుధాకర్ పుట్టినరోజు కదా మర్చిపోయాడా ఏమిటి ఎవరికీ చెప్పలేదు కనీసం మేనేజర్ గారికి అయినా చెప్పాడా అని ఎదురుచూసిన సహ ఉద్యోగులు ఆశ నిరాశ అయింది. ఆఫీస్ కి వచ్చిన తర్వాత కూడా సుధాకర్ ఆ లంచ్ మాట ఎత్తలేదు. కానీ అం...