పోస్ట్‌లు

మందు పొట్లం

 మందు పొట్లం మా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఈనాటికి మమ్మల్ని నవ్విస్తూ ఉంటుంది. మాది కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని పల్లిపాలెం గ్రామం . మా చింతాతయ్య గారు మా నాన్నగారు కూడా ఆయుర్వేద వైద్యం చేసేవారు. మా ఊర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు మిగతా సామాజిక వర్గాలు కూడా ఉండేవి. ప్రధానమైన కులం రెడ్డి కులం .  అయితే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ఆ రోజుల్లో ఒక ముప్పై ఐదు సంవత్సరంలో వయసు ఉండే ఒక  వ్యక్తి ఏదో అనారోగ్యం కోసం ఆయుర్వేదం మందు కోసం మా తాతయ్య గారి దగ్గరికి వచ్చాడు. రోగి లక్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత   ఆయుర్వేద మందుని కాగితంతో పొట్లాలు కింద కట్టి రోజుకు ఒక పొట్లం  తేనెతో వేసుకో వారం రోజుల తర్వాత మళ్లీ కనబడని చెప్పాడు తాతయ్య. నాలుగు రోజుల తర్వాత ఆ వ్యక్తి పరుగు పరుగున తాత గారి దగ్గరకు వచ్చి ఆ ఆ పొట్లం వేసుకున్నప్పటి నుంచి నాకు కడుపు నొప్పి మొదలైంది అండి అంటూ చెప్పుకొచ్చాడు. తాతయ్య  "ఆ మందుకి కడుపునొప్పి రాద య్య!  మరి నువ్వు ఆ మందు ఎలా వేసుకున్నావు? అని అడిగాడు.   ఆ పొట్లం తేనె తోటి వేసుకున్నానండి అన్నాడు. అప్పుడు అసలు పరిస్థితి ...

ఏలూరు జిల్లా యాత్ర

ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండే ఏలూరు 2022 సంవత్సరం నుంచి జిల్లాగా మార్పు  చెందింది .  కొల్లేరు సరస్సు:   ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాల్లో కొల్లేరు  సరస్సు ఒకటి. ఇది కొంత భాగం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వ్యాపించి ఉంది. ఇక్కడ రకరకాల చేపలు లభ్యమవుతాయి. అంతేకాకుండా అనేక పక్షులు విదేశాల నుండి సైతం ఇక్కడికి వలస వస్తాయి.  ద్వారకాతిరుమల: దీనినే చిన్న తిరుపతి అంటారు.  కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ద్వారకా కొండపై కొలువై ఉన్నారు. దీనిని చిన్న తిరుపతి అంటారు. ఇక్కడ స్వామి అత్యంత మహిమాన్వితుడు.  పట్టిసీమ: గోదావరి నది మధ్యభాగంలో ఉండే వీరభద్ర స్వామి దేవాలయం అత్యంత మనోహరంగా ఉంటుంది . మహాశివరాత్రి  ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

అరిటాకు భోజనం

అరిటాకు భోజనం . విందు భోజనానికి ముఖ్య అతిథి అరిటాకు.ఆకుపచ్చటి అరిటాకు ఆంధ్రుల భోజనానికి అది ట్రేడ్ మార్క్. ఆకాశంలోని హరివిల్లు వలె మెరిసిపోతుంది  అరిటాకులోని ఆతిథ్యం. ఆకులోని పదార్థాలు చూడగానే ఆత్మా రాముడికి రెక్కలు వస్తాయి. ఆకుపచ్చటి అరిటాకులో కుడివైపు చివర పసుపు పచ్చటి ముద్దపప్పు మెరిసిపోతూ ఉంటుంది. దాని పక్కనే చెరువులోని కలువ పువ్వుల మెరిసిపోతూ నూనెలో తేలియాడుతున్న ఆవకాయ. ఇంకా కోనసీమ భోజనం అంటే పనసపొట్టు లేకుండా ఎలా ఉంటుంది. మంచి సువాసనలు వెదజల్లుతూ ఆకులో అందంగా కుదురుగా ఉంటుంది . మాకు విందు భోజనంలో కంద బచ్చలి తప్పనిసరి అది లేకపోతే విందు ఏమిటి నా బొంద అంటుంది ఓ ఇల్లాలు.  కూరలు దాటికి ముందుకు చెయ్యి చాపితే  మచ్చు కోసం వేసిన దప్పలం ,దాని పక్కనే తెల్లగా మెరిసిపోతూ అప్పడం, బాగా వేగిపోయిన గుమ్మిడి వడియం అలా ఎడం పక్కకి ప్రయాణం సాగిస్తే పండు వెన్నెల లాంటి అన్నం, అన్నం దాటుకుని చేయి చాపితే పులిహార పక్కనే పూర్ణం బూర్లు ఇవన్నీ ఆకుని ఆక్రమించుకుని మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయి .  అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆంధ్రుల అభిమాని గోంగూర పచ్చడి అడవులో  దున్నపోతులా మెరిసి...